1905 బెంగాల్ విభజన
నేపథ్యంలో అనుశీలన్ సమితి లేదా బెంగాల్ విప్లవకారుల సంస్థ ఉద్భవించింది.. అనుశీలన్ సమితి స్వామి
వివేకానంద, బాల
గంగాధర తిలక్,
అరబిందో
ఘోష్ మరియు ఇతర జాతీయవాద ఆలోచనాపరులు మరియు పండితుల నుండి ప్రేరణ పొందింది.
మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే వరకు
అనుశీలన్ సమితి బెంగాల్‌కే పరిమితమైంది. ఆ సమయంలో పంజాబ్‌లో గదర్ పార్టీ లేదా
వారణాసిలో కొన్ని విపవ సంస్థలు ఉండేవి...
ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా
ఉత్తరప్రదేశ్‌లో అనుశీలన్ సమితి ని విస్తరించాలని విప్లవకారులు భావించారు.
ఇందుకోసం జోగేష్ చంద్ర ఛటర్జీకి బాధ్యతలు అప్పగించి వారణాసికి పంపారు. అప్పటికే
క్రియాశీలంగా ఉన్న విప్లవ సంఘాల సహాయంతో జోగేష్ వారణాసి లో ఒక విప్లవ పార్టీ నిర్మాణానికి పూనుకొన్నారు.
1923లో అనుశీలన్ సమితి
చాప్టర్ ను లక్నోలో ప్రారంభించాలని విప్లవకారులు నిర్ణయించారు. అప్పట్లో మహాత్మా గాంధీ సహాయ
నిరాకరణ ఉద్యమాన్ని విరమించుకోవడం పట్ల యువత అసంతృప్తితో ఉన్నారు. కొన్ని నెలల
తర్వాత విప్లవ సంస్థ అనుశీలన్ సమితి మరియు దాని సభ్యులు పెద్ద హిందుస్థాన్
రిపబ్లికన్ అసోసియేషన్ (HRA)ని ఏర్పాటు చేశారు.
లక్నోలోని
పార్టీ సానుభూతిపరుల సహాయం కోసం ఢాకాలోని పార్టీ నేతలు జోగేష్ ను కోరారు. అందులో జోగేష్ చే సూచించబడిన అత్యంత ముఖ్యమైన వ్యక్తి, చౌదరి ఖలీకుజ్జామాన్. ఆ సమయంలో చౌదరి ఖలీకుజ్జామాన్
లక్నో మున్సిపల్ బోర్డు ఛైర్మన్ మరియు ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు
కొన్ని నెలల
క్రితం కాంగ్రెస్ సమావేశంలో జోగేష్, ఖలీకుజ్జమాన్‌ను గయాలో కలిశారు. ఆ సమయంలో
అంశీలన్ సమితి సీనియర్ నాయకులు ఖలీకుజ్జమాన్ ను విప్లవ పార్టీ అనుశీలన్ సమితి పూర్తికాల
సభ్యునిగా చేరాలని కోరారు. ఖలీకుజ్జమాన్ స్వయంగా ఆయుధాలు చేపట్టడం సరికాదని
నమ్మాడు, అయితే అంశీలన్ సమితి పార్టీకి భౌతిక
మద్దతు పలికారు.
లక్నో మున్సిపల్ బోర్డ్ చైర్మన్
చౌధురి ఖలీఖుజమాన్‌ను జోగేష్ కలిశారు మరియు ప్రతుల్
గంగూలీ నుండి పరిచయ లేఖ ను అందజేశారు. చౌధురి ఖలీఖుజమాన్ కి, జోగేష్
తన లక్ష్యాలను తెలియజేసి లక్నోలో అంశీలన్ సమితి ఒక యూనిట్‌ని నెలకొల్పాలని కోరాడు.
చౌధురి ఖలీఖుజమాన్ అంగీకరింఛి లక్నోలో అంశీలన్ సమితి తరుపున రిక్రూట్ అయిన
వారి ఆర్థిక అవసరాలను అందించడానికి తన వంతు సహాయ హస్తాన్ని అందిస్తానని వాగ్దానం
చేశారు.
జోగేష్ వారణాసికి తిరిగి వెళ్లి
సచింద్ర నాథ్ బక్షిని తనతో పాటు లక్నోకు తీసుకువచ్చాడు. జోగేష్, బక్షిని
ఖలీఖుజ్జమాన్‌తో పరిచయం చేసి లాంఛనంగా అంశీలన్ సమితి పార్టీని ప్రారంభించారు. ఖలీఖుజ్జమాన్
అంశీలన్ సమితి పార్టీకి ఆర్థికంగా సహాయం చేయడానికి అంగికరించినారు మరియు జోగేష్ కు మున్సిపల్ బోర్డులో ఉద్యోగం
ఇచ్చారు.
కొన్ని నెలల తర్వాత, జోగేష్ మరియు బక్షిని
కకోరి ట్రైన్ డకోయిటీకి సంబంధించి అరెస్టు చేశారు. కాకోరీ కేసులో విప్లవకారులకు
న్యాయవాదులను ఏర్పాటు చేయమని జోగేష్, ఖలీకుజ్జమాన్‌కు సందేశం పంపాడు. ఖలీకుజ్జమాన్
ప్రయత్నాల ద్వారానే న్యాయవాదులు హర్కరణ్ నాథ్ మిశ్రా, C. B. గుప్తా మరియు
గోవింద్ బల్లభ్ పంత్ విప్లవకారుల తరుపున వాదించడానికి కోర్టుకు హాజరయ్యారు.
ఖలీఖుజ్జమాన్ కోర్టు కార్యకలాపాలను
చూసేందుకు వెళ్ళాడు, అక్కడ ఒక CID అధికారి జోగేష్ చంద్ర ఛటర్జీ అనే విప్లవకారుడికి సహాయం
చేసినందుకు ఖలీఖుజ్జమాన్ ని ప్రశ్నించారు. ఖలీఖుజ్జమాన్ దానిని నిరాకరించాడు. C.I.D చీఫ్, జోగేష్ చంద్ర ఛటర్జీ కి మున్సిపల్ బోర్డులో
పోస్ట్ ఇచ్చారు.' అని
ఖలీఖుజ్జమాన్
తో అన్నాడు. అంతట ఖలీఖుజ్జమాన్ 'నేను చాలా మందికి
పోస్ట్‌లు ఇస్తాను' అని బదులిచ్చారు..
పై వివరణ అనుశీలన్ సమితి కేవలం
హిందూ పార్టి మాత్రమె కాదు ఖలీకుజ్జామాన్ వంటి ముస్లిం వ్యక్తులు కూడా రహస్య విప్లవ సంస్థ అనుశీలన్ సమితి కోసం
పని చేయగలరు
అని తెల్పుతుంది. విప్లవ పార్టీ అనుశీలన్ సమితి యొక్క లౌకిక స్వభావం గురించి తెలియజేస్తుంది.
No comments:
Post a Comment