నువా,రాజస్థాన్:
కల్నల్ ఇష్రత్ అహ్మద్ భారత ఆర్మీలో
మీరట్‌లోని ఆర్డినెన్స్ ఆర్మీ యూనిట్ కమాండ్‌గా బాధ్యతలు స్వీకరించిన మొదటి ముస్లిం మహిళ.
కల్నల్ ఇష్రత్ కయామ్‌ఖాని ఉన్నత విద్యా
స్థాయి కలిగి సైనిక, పరిపాలన మరియు పోలీసు సేవలలో రాణించిన కమ్‌ఖాయాని ముస్లిం
సమాజానికి చెందినవారు.
కల్నల్ ఇష్రత్ అహ్మద్ రాజస్థాన్‌లోని
జుంఝును జిల్లాలోని నువా గ్రామంలోని ప్రముఖ ముస్లింకుటుంబానికి చెందినవారు. భారతీయ
ముస్లిం సమాజం నుండి ఒక మహిళ ఇంతటి ఉన్నత
స్థానానికి చేరుకోవడం పట్ల గర్వంగా ఉంది.
కల్నల్ ఇష్రాత్ అహ్మద్, కల్నల్ జాకీ అహ్మద్ కుమార్తె మరియు బ్రిగేడియర్
సాకిబ్ హుస్సేన్ సోదరి. ఐజీపీ లియాఖత్ అలీ ఖాన్ కూడా కల్నల్ ఇష్రాత్ అహ్మద్ కుటుంబం
నుంచే వచ్చారు.
కల్నల్ ఇష్రత్ అహ్మద్ కుటుంబం పరిపాలనలో ఉన్నత స్థానాలకు చేరుకున్న
అనేక మంది పౌర సేవకులను కలిగి ఉంది.
కమ్‌ఖాయాని బిద్రి సమాజం కల్నల్ ఇష్రత్ అహ్మద్ సాధించిన ఘనత పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసినది. "సమాజం ఇష్రత్ అహ్మద్ కుటుంబాన్ని చూసి గర్విస్తోంది" అన్నది.
-అవాజ్ ది వాయిస్ సౌజన్యం తో
No comments:
Post a Comment