24 April 2024

భారతీయ ముస్లింల సంపద ఎంత? ఒక అధ్యయనం How much wealth do Indian Muslims have? a study

 

కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో తల్లులు మరియు సోదరీమణులబంగారాన్ని లెక్కిస్తానని, ఆపై మంగళసూత్రాలను కూడా వదలకుండా ముస్లింలకు పంచుతామని ప్రకటించినది అని ప్రధాని నరేంద్ర మోడీ (ఏప్రిల్ 21)అన్నారు..

ప్రధానమంత్రి వాదనలను "అబద్ధాలు" మరియు "ద్వేషపూరిత ప్రసంగాలు"గా కాంగ్రెస్ అభివర్ణించింది.

దేశంలోని వివిధ మతపరమైన వర్గాలకు చెందిన బంగారంతో సహా సంపద మరియు ఆస్తులపై వివరణాత్మక లేదా నిర్దిష్ట డేటా అందుబాటులో లేదు.

ICSSR గుర్తింపు పొందిన పరిశోధనా సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్ 2020లో ప్రచురించిన భారతదేశంలో సంపద యాజమాన్యంలో ఇంటర్ గ్రూప్ అసమానతపై అధ్యయన నివేదిక లో కొంత  సంబంధిత డేటా అందుబాటులో ఉంది.

నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (NSSO), మరియు ఇండియన్ ఎకనామిక్ సెన్సస్ నిర్వహించిన ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వే (AIDIS) నుండి డేటాను ఉపయోగించిన ఈ నివేదిక, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాల్లో మరియు ముస్లింలలో సంపద యాజమాన్యం అత్యల్పంగా ఉందని కనుగొంది.

భారతదేశంలో ఏ గ్రూపులకు ఎంత సంపద ఉంది?

నివేదికలోని డేటా ప్రకారం, దేశంలోని మొత్తం సంపదలో దాదాపు 41% హిందూ ఉన్నత కులాల వారు, ఆ తర్వాత హిందూ OBCలు (31%) ఉన్నారు. ముస్లింలు, ఎస్సీలు మరియు ఎస్టీలు వరుసగా 8%, 7.3% మరియు 3.7% సంపదను కలిగి ఉన్నారు.

భారతదేశంలోని మొత్తం కుటుంబాల వారి వాటా (22.2%)తో పోలిస్తే హిందూ ఉన్నత కులాల సంపదలో వాటా అసమానంగా ఎక్కువగా ఉంది. ఈ సంఖ్య హిందూ OBCలకు 35.8%, ముస్లింలకు 12.1%, SCలకు 17.9% మరియు STలకు 9.1% 

హిందూ ఉన్నత కులాల వారి సంపద మొత్తం విలువ రూ. 1,46,394 బిలియన్లు అని నివేదిక అంచనా వేసింది, ఇది ఎస్టీల ఆస్తుల విలువ (రూ. 13,268 బిలియన్లు) కంటే దాదాపు 11 రెట్లు మరియు ముస్లింల సంపద రూ. 28,707 బిలియన్లుగా అంచనా వేయబడింది.

ప్రస్తుత ధరల ప్రకారం వివిధ సామాజిక సమూహాలకు చెందిన మొత్తం సంపద (రూ బిలియన్లలో)

 

సామాజిక సమూహం Social group

రూరల్

RURAL

అర్బన్ Urban

మొత్తం

Total

షెడ్యూల్డ్ తెగ Scheduled Tribe

9544

3724

13268

షెడ్యుల్ క్యాస్ట్ Scheduled Caste

16163

9971

26134

హిందూ OBC

Hindu OBC

62952

47568

110520

హిందూ ఉన్నత కులాలు Hindu high caste

42338

104057

146394

ముస్లిములు Muslim

14379

14329

28707

మిగిలినవారు  Rest

15224

18105

33329

మొత్తం Total

160600

197753

358354

మూలం: AIDIS 2013; భారతదేశంలో సంపద యాజమాన్యంలో ఇంటర్ గ్రూప్ అసమానతపై అధ్యయన నివేదిక, 2020

 

ఒక్కో ఇంటికి సంపద పై యాజమాన్యం.

ఒక్కో కుటుంబ సంపద యాజమాన్యం సగటున  రూ. 15.04 లక్షలు, అయితే సామాజిక వర్గాల్లో గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయి.

హిందూ ఉన్నత కులాల్లో (రూ. 27.73 లక్షలు) సగటు గృహ సంపద అత్యధికంగా ఉంది.

 హిందూ ఓబీసీలు సగటు గృహ సంపద (రూ. 12.96 లక్షలు)

ముస్లిం కుటుంబాల సగటు గృహ సంపద (రూ. 9.95 లక్షలు)

ఎస్టీ, ఎస్సీ (రూ. 6.12 లక్షలు) కుటుంబాల సగటు గృహ సంపద వరుసగా(రూ. 6.13 లక్షలు)మరియు (రూ. 6.12 లక్షలు) గా ఉంది.


ప్రస్తుత ధరల ప్రకారం (రూ.లలో) భారతదేశంలోని సామాజిక-మత సమూహాలకు చెందిన ఇంటి ఆస్తి

 Per household asset owned across socio-religious groups in India at current prices (in Rs)

సామాజిక సమూహం Social group

రూరల్

Rural

అర్బన్ Urban

మొత్తం

Total

షెడ్యూల్డ్ తెగ Scheduled Tribe

513000

1227000

613000

షెడ్యూల్డ్ కులం Scheduled Caste

517000

871000

612000

హిందూ OBC

Hindu OBC

1074000

1783000

1296000

హిందూ ఉన్నత కులం Hindu high caste

1657000

3819000

2773000

ముస్లిం Muslim

822000

1263000

995000

ఇతరులు Rest

4668000

4826000

4753000

మొత్తం Total

1037000

2369000

1504000

మూలం: AIDIS 2013; భారతదేశంలో సంపద యాజమాన్యంలో ఇంటర్ గ్రూప్ అసమానతపై అధ్యయన నివేదిక, 2020

 

ఏ సామాజిక వర్గం దగ్గిర ఎక్కువ బంగారం ఉంది?

అధ్యయనం ప్రకారం, హిందూ OBCలు బంగారంలో అత్యధిక వాటాను (39.1%), హిందూ ఉన్నత కులాలు (31.3%) కలిగి ఉన్నారు. ముస్లింలకు 9.2% వాటా ఉంది, ఇది కేవలం ఎస్టీల (3.4%) కంటే ఎక్కువ.

వివిధ సామాజిక-మత సమూహాలలో సంపద వాటా (శాతంలో)

 

సామాజిక సమూహం Social group

ల్యాండ్ Land

బిల్డింగ్ Building

లైవ్‌స్టాక్ Livestock

ఫామ్ Farm

నాన్ ఫామ్ Non Farm

ట్రాన్స్‌పోర్ట్ Transport

ఫైనాన్స్

గోల్డ్ Gold

మొత్తం ఆస్తులు

 Total assets

షెడ్యూల్డ్ తెగ Scheduled Tribe

4.2

2.7

12.9

8.1

1.2

4.1

3.9

3.4

3.7

షెడ్యూల్డ్ కులం Scheduled Caste

7.1

7

12.4

9.1

3.8

7.2

8.6

9.9

7.3

హిందూ OBC Hindu OBC

34.7

23.4

44

41.9

38.4

30

26.3

39.1

30.8

హిందూ ఉన్నత కులం Hindu high caste

35.3

51.4

19.9

28

38.4

41.5

46.3

31.3

40.9

ముస్లిం Muslim

7.7

8.5

6.9

5.4

9.7

8.8

6

9.2

8

ఇతరులు మిగతా వారు Rest

11

6.9

4

7.6

8.4

8.4

8.9

7.1

9.3

మొత్తం Total

100

100

100

100

100

100

100

100

100

మూలం: AIDIS, 2013; భారతదేశంలో సంపద యాజమాన్యంలో ఇంటర్ గ్రూప్ అసమానతపై అధ్యయన నివేదిక, 2020


మూలం: ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్, 24-04-2024

No comments:

Post a Comment