18 April 2024

మదర్సా నుంచి వ్యవసాయ శాస్త్రవేత్త గా ఎదిగిన మొయినుద్దీన్

 

యువతకు సూర్తిదాయకoo


అడ్డంకులు ఎదురైనా జీవితంలో ఎదగాలనుకునే వారికి మదర్సాలో చదువుకున్న వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ మొయినుద్దీన్ జీవితమే స్ఫూర్తి.  

డాక్టర్ మొయినుద్దీన్ ఉత్తరప్రదేశ్‌లోని జలాల్‌పూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్‌లో జన్మించారు. మొయినుద్దీన్ తన ప్రాథమిక విద్యను మదరసా నిదా హక్‌(జలాల్‌పూర్)నుండి పొందాడు.  చదువుకోవాలనే తపనతో మదర్సా తరువాత చదువు కొనసాగించాడు.

మొయినుద్దీన్ అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్), UP నుండి డిగ్రీ పొందారు. మొయినుద్దీన్ శామ్ హిగ్గిన్‌బాటమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, టెక్నాలజీ, అండ్ సైన్సెస్, అలహాబాద్ నుండి పిహెచ్‌డి పొందారు

డాక్టర్ మొయినుద్దీన్ ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మాయా కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్‌లో అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.

డాక్టర్ మొయినుద్దీన్ వ్యవసాయ పరిశోధనలో చేసిన కృషికి అనేక జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు.

2013లో అలహాబాద్ యూనివర్శిటీలో "15వ ఇండియన్ అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ అండ్ ఫార్మర్స్ కాంగ్రెస్" సందర్భంగా మొదటిసారిగా డాక్టర్ మొయినుద్దీన్ కి యంగ్ సైంటిస్ట్ అవార్డు లభించింది.

డాక్టర్ మొయినుద్దీన్ అనేక  అంతర్జాతీయ సదస్సులకు హాజరయ్యారు.

2021లో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని శోభత్ డీమ్డ్ యూనివర్శిటీలో డాక్టర్ మొయినుద్దీన్ కి ఉత్తమ వ్యవసాయ శాస్త్రవేత్త అవార్డు లభించింది.

2022లో నేపాల్‌లోని పోఖారాలోని త్రిభువన్ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్రీలో డాక్టర్ మొయినుద్దీన్ కి అత్యుత్తమ శాస్త్రవేత్త అవార్డు లభించింది.

డాక్టర్ మొయినుద్దీన్ ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రోనమీ, అగ్రోనమీ డివిజన్, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, న్యూఢిల్లీలో జీవితకాల సభ్యుడు కూడా.

డాక్టర్ మొయినుద్దీన్ సొసైటీ ఆఫ్ అగ్రోనమీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, సామ్ హిగ్గిన్‌బాటమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, టెక్నాలజీ అండ్ సైన్సెస్, అలహాబాద్‌లో క్రియాశీల సభ్యుడు.

డాక్టర్ మొయినుద్దీన్ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని అగ్రికల్చరల్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సొసైటీలో క్రియాశీల జీవిత సభ్యుడు కూడా.

అనేక జాతీయ సెమినార్‌లు   సమావేశాలలో డాక్టర్ మొయినుద్దీన్ పాల్గొన్నారు.

డాక్టర్. మొయినుద్దీన్ తండ్రి హాజీ మునీర్ అహ్మద్ మీర్జా గాలిబ్, ఇంటర్ కాలేజ్ జలాల్‌పూర్‌లో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు తన కష్టార్జితంతో వ్యవసాయంలో శాస్త్రవేత్తగా ఎదిగి దేశానికి సేవ చేస్తున్నాడు’’ అని గర్వంగా చెప్పారు ” డాక్టర్. మొయినుద్దీన్ తండ్రి హాజీ మునీర్ అహ్మద్ మీర్జా గాలిబ్ .

డాక్టర్. మొయినుద్దీన్ యువతకు సందేశమిస్తూ సమయం యొక్క విలువను గుర్తించి దానిని వృధా చేయకుండా ఉండండి;, తమ సమయానికి విలువ ఇవ్వని వారు వెనుకబడిపోతారు” అని అన్నారు..

 

No comments:

Post a Comment