
ప్రవక్త సీరా (ప్రవక్త ముహమ్మద్(స) జీవిత చరిత్ర) వివిధ మత, మేధో నేపథ్యాలకు చెందిన పండితుల దృష్టిని ఆకర్షించింది. అనేక మంది హిందూ పండితులు, మేధావులు ప్రవక్త ముహమ్మద్(స) జీవితం, బోధనలు, వ్యక్తిత్వాన్ని అధ్యయనం చేసారు. వారు తమ అభిప్రాయాలను ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషలలో పుస్తకాలు, వ్యాసాలు, కవిత్వం ద్వారా వెల్లడించారు.
ప్రవక్త (స)జీవితం, ఆశయం గురించి సానుకూల అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిలో ఎం. ఎన్. రాయ్, ఎన్. కె. సింగ్, టి. ఎల్. వాస్వానీ
ఉన్నారు. వారి రచనలు హిందూ-ముస్లిం సామరస్యం, పరస్పర అవగాహన యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కిచెప్పాయి. భారతీయ సంస్కృతిలో
ముస్లిం వర్గాలు పోషించిన ముఖ్యమైన పాత్రను వారు గుర్తించారు.
సీరా సాహిత్యానికి దోహదపడిన తొలితరం హిందూ రచయితలలో లాల్‌చంద్ అమరద్దినోమల్
జగ్టియానీ Lalchand Amardinomal Jagtiani ఒకరు. జగ్టియానీ రచించిన 'ముహమ్మద్ రసూలుల్లాహ్' అనే పుస్తకం, ప్రవక్త ముహమ్మద్(స)
జీవితం గురించి సింధీ భాషలో వెలువడిన అత్యంత ముఖ్యమైన రచనలలో ఒకటి.
అదేవిధంగా, శ్రద్ సెహ్ ప్రకాష్ Shrad
Seh Prakash 1907లో 'హజ్రత్ ముహమ్మద్
సాహిబ్, ఇస్లాం స్థాపకుడు' అనే గ్రంథాన్ని రచించగా, డాక్టర్ నిషికాంత చటోపాధ్యాయ 1904లో 'ముహమ్మద్: ఇస్లాం
ప్రవక్త' అనే గ్రంథాన్ని
రచించారు. జె. ఎస్. దారా 1914లో 'రసూల్-ఎ-అరబీ' ప్రచురించారు. ఈ రచనలు, ప్రవక్త ముహమ్మద్(స) జీవితం మరియు బోధనలతో ముస్లిమేతర మేధావులు మమేకమైన తొలి
ఉదాహరణలను సూచిస్తాయి.
ఇతర ముఖ్యమైన రచనలలో లక్ష్మణ్ ప్రసాద్ రచించిన 'అరబ్ కా చాంద్' (1932), పండిట్ సుందర్ లాల్ రచించిన 'హజ్రత్ ముహమ్మద్ ఔర్ ఇస్లాం', రఘునాథ్ సహాయ్ రచించిన 'పైగంబర్-ఎ-ఇస్లాం', మరియు గోవింద్ రామ్
సేథీ షాద్ రచించిన 'చార్ మినార్'
(1944) ముఖ్యమైనవి.
ప్రొఫెసర్ లజపత్ రాయ్ కూడా తన 'హజ్రత్ ముహమ్మద్ సాహిబ్ కి సవానా-ఉమ్రి' అనే రచన ద్వారా తోడ్పడ్డారు. ఈ రచనలు, ప్రవక్త ముహమ్మద్ జీవితాన్ని అర్థం చేసుకుని, తమ పాఠకులతో పంచుకోవడానికి హిందూ రచయితలు చేసిన ప్రయత్నాలను ప్రతిబింబిస్తాయి.
ప్రవక్త జీవిత చరిత్ర (సీరా) అధ్యయనం ముస్లిం పండితులకే పరిమితం కాకుండా, ఇతర మత వర్గాల మేధావుల ఆసక్తిని చూపిస్తాయి.
ఇటీవలి రచనలలో, కె. ఎస్.
రామకృష్ణారావు రచించిన 'ముహమ్మద్: ది ప్రొఫెట్ ఆఫ్ ఇస్లాం' ప్రత్యేకంగా ప్రస్తావించదగినది. రామకృష్ణారావు రచన, ఒక భారతీయ హిందూ మేధావి దృక్కోణం నుండి ప్రవక్త(స) యొక్క వ్యక్తిత్వం, నాయకత్వం మరియు మానవ సమాజానికి ప్రవక్త(స)చేసిన సేవలను చర్చిస్తుంది.
అదేవిధంగా, ఎన్. కె. సింగ్
రచించిన 'ప్రొఫెట్ ముహమ్మద్
అండ్ హిస్ కంపానియన్స్' కేవలం ప్రవక్త(స) జీవితాన్నే కాకుండా, ఆయన సహచరుల మరియు తొలితరం ముస్లిం సమాజం యొక్క జీవితాలను కూడా అన్వేషిస్తుంది.
హిందూ పండితుల రచనలు ప్రవక్త(స) జీవితం బోధనలపై విలువైన అంతర్దృష్టులను
అందిస్తాయి.
స్వతంత్ర పుస్తకాలతో పాటు, హిందూ మరియు ఇతర ముస్లిమేతర మేధావులు వ్యాసాలు, వ్యాఖ్యానాలు మరియు కవిత్వం ద్వారా సీరా సాహిత్యానికి తోడ్పడ్డారు. సయ్యద్ బషీర్ అహ్మద్ సంకలనం చేసిన 'సర్వార్-ఎ-కోనైన్ అఘ్యార్ కీ నజర్ మే Sarwar-e-Konain Aghyar Ki Nazar Mein ' అనే సంకలనం ఈ సందర్భంలో ప్రత్యేకంగా చెప్పుకోదగినది.. ఇది మాలిక్ రామ్, పండిట్ గోపాల్ కృష్ణన్, లాలా రామ్ లాల్ వర్మ, మోతీ లాల్ మాథుర్, భగవాన్ దాస్ భగవాన్, మరియు స్వామి బ్రజ్ నారాయణ్ సన్యాసి వంటి వివిధ మత వర్గాలకు చెందిన వ్యక్తులు ప్రవక్త(స)పై రాసిన రచనలను ఒకచోట చేర్చింది.
దిల్లూ రామ్ కౌసరి, మహారాజా సర్ కిషన్ ప్రసాద్, మున్షీ శంకర్ లాల్ సాఖీ, మనోహర్ లాల్ బిహార్, మరియు జ్యోతిబా ఫూలేల సాహిత్య రచనలు కూడా ప్రవక్త(స) జీవితం మరియు బోధనల పట్ల
ముస్లిమేతర రచయితల ఆసక్తిని ప్రతిబింబిస్తాయి.
ప్రవక్త జీవిత చరిత్ర(సీరా)పై హిందూ రచయితల రచనలను పరిశీలిస్తే, వారు ప్రవక్త ముహమ్మద్(స) యొక్క నైతిక
స్వభావం. నిజాయితీ, సత్యసంధత, సహనం, క్షమ, దయ, వినయం మరియు కరుణ
గురించి వివరంగా చర్చించారు. వారి ప్రకారం ప్రవక్త(స)గుణాలు అన్ని వర్గాల ప్రజలకు
విలువైన పాఠాలను అందిస్తూనే ఉన్నాయి.
సాంఘిక సంస్కర్తగా న్యాయాన్ని స్థాపించడానికి, బలహీన వర్గాల హక్కులను పరిరక్షించడానికి, మహిళల స్థితిని మెరుగుపరచడానికి, సమానత్వాన్ని ప్రోత్సహించడానికి మరియు సాంఘిక వివక్షను నిర్మూలించడానికి ప్రవక్త(స)చేసిన
ప్రయత్నాలు పలువురు రచయితల దృష్టిని ఆకర్షించాయి.
కొందరు ప్రవక్త(స)మార్గదర్శకత్వంలో అరేబియా సమాజంలో వచ్చిన పరివర్తనను మరియు
మానవ నాగరికతకు దాని ప్రాముఖ్యతను పరిశీలించారు. శాంతి, కరుణ మరియు శాంతియుత సహజీవనం పై ప్రవక్త(స) ఇచ్చిన సందేశం కూడా చర్చించబడింది.
హిందూ పండితులు ఇస్లాం యొక్క నైతిక మరియు మతపరమైన బోధనలపై, ముఖ్యంగా ఏకేశ్వరవాదం, జవాబుదారీతనం, దానధర్మాలు, సోదరభావం మరియు మానవ సమానత్వం వంటి భావనలపై మరింత ఆసక్తిని కనబరిచారు.
ప్రవక్త(స) మదీనాలో ముస్లిం సమాజాన్ని స్థాపించడం మరియు స్థిరమైన సామాజిక
వ్యవస్థను ఏర్పాటు చేయడానికి చేసిన ప్రయత్నాలను కొందరు
హిందూ రచయితల రచనలు వివరిస్తూన్నాయి.
కొందరు హిందూ రచయితలు ప్రవక్త(స) జీవితాన్ని కాలక్రమానుసారంగా వివరించగా, మరికొందరు ప్రవక్త(స) వ్యక్తిత్వం, బోధనలు మరియు విజయాలలోని నిర్దిష్ట అంశాలపై దృష్టి సారించారు.
కొంతమంది ఇస్లామిక్ బోధనలను ఇతర మతాల బోధనలతో కూడా పోల్చారు. తమ రచనలకు వివిధ సీరా పుస్తకాలు, ఇస్లామిక్ గ్రంథాల అనువాదాలు మరియు ప్రాచ్య పండితుల రచనలను ఆధారంగా
చేసుకున్నారు.
ముస్లిమేతర పండితుల రచనలు ఇస్లామిక్ చరిత్ర, నీతి మరియు ప్రవక్త (స)వ్యక్తిత్వంలోని అంశాలను ముస్లిమేతర పాఠకులకు పరిచయం
చేశాయి.
సీరా సాహిత్యానికి హిందూ పండితులు చేసిన కృషి భారతీయ మేధో చరిత్రకు మరియు
వివిధ మతాల మధ్య సంబంధాలకు చాలా ముఖ్యమైనది.
No comments:
Post a Comment