భారతదేశంనకు శుక్రవారం 27 రంజాన్ అనగా 1366 హిజ్రీ దినమున స్వాతంత్రం లబించినది. భారతీయ ముస్లింలకు ఇది చాల ప్రాధాన్యత గల దినము మరియు నిష్పాక్షికoగా ఆలోచించవలసిన సమయం. అనేక మంది భారతీయ ముస్లింలు 27 రంజాన్ ను యుమ్ –ఎ-ఫుర్ఖాన్ (Yaum-e-Furqan) ను మదీనా లో జరిగిన లో మొదటి స్వాతంత్ర యుద్ధం లాగా జరుపుకొంటారు. కానీ వారు 1857 లో కాల చక్రం లో కలసిపొయిన మొదటి స్వాతంత్ర యుద్ధం తరువాత 27 రమదాన్ దినమున ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమునకు జన్మనిచ్చిన్న 2వ భారతీయ స్వాతంత్ర్య యుద్దమును గుర్తుంచుకోవాలి.
అల్లాహ్ 27రంజాన్ దినమున బ్రిటిష్ వారి నుండి భారతదేశం కు స్వాతంత్ర్యం మంజూరు చేసాడు అదేవిధంగా అజ్ఞానం, నిరక్షరాస్యత, పేదరికం, మత ద్వేషం వంటి వలసపాలన ఉత్పత్తుల నుండి విముక్తి కలిగించినాడు. మన జాతీయ నాయకులు అవిశ్రాంతిగా రాజ్యాంగ నిర్మాణ సభ లో పని చేసి స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం, వంటి ఉన్నతమైన సూత్రాల ఆధారంగా సెక్యులరిజం అండ్ డెమోక్రసీ సాదించడానికి భారతదేశ ప్రజలకు ఒక అద్భుతమైన రాజ్యాంగం తయారు చేసినారు.
పవిత్ర 27రంజాన్ దినము రాత్రి పవిత్ర ఖురాన్ వెల్లడించడం ప్రారంభమైంది మరియు ముహమ్మద్ (స) చివరి ప్రవక్త గా నియమించబడినాడు. ఇది చాలా శుభకరమైన రాత్రి. ముస్లింలు ఈ రాత్రి ఆరాధన, వెయ్యి నెలల ఆరాధనలకు సమానమని నమ్ముతారు. అందుకే దీనిని లైలతుల్ కద్ర్ లేదా శుభకరమైన లేదా మహిమగల రాత్రి అని నమ్ముతారు
మానవజాతి విధి 27రంజాన్ తో అనగా 610 CE తో ముడి పడినది అలాగే భారతదేశం యొక్క విధి కూడా 27రంజాన్ తో అనగా 1947 CE తో ముడి పడినది.
భారతదేశం యొక్క మొదటి ప్రధాన మంత్రి మరియు గొప్ప స్వాతంత్ర్య నాయకుడు అగు నెహ్రు 15 ఆగష్టు 1947 అర్ధరాత్రి పార్లమెంట్ లో తన చారిత్రక ప్రసంగం "ట్రిస్ట్ విత్ డెస్టినీ" చేసినప్పుడు దేవుని దీవెనలు భారతదేశం మరియు ప్రపంచానికి లబించినవి. ఈ మహిమ గల రాత్రి అందు భారత ప్రధాని తన "ట్రిస్ట్ విత్ డెస్టినీ" లో భవిషత్తు లో భారత దేశం సాదించవలసినది గుర్తు చేశారు. అది అధికార రాత్రి, మరియు దేశం యొక్క ప్రధాని నెహ్రు అందరు భారత ప్రజలకు అన్ని అధికారాలు సమానం గా ఉన్నాయి అన్న భరోసా ఇవ్వడం జరిగినది
దివ్య ఖురాన్ అవతరణ మహిమ గల రాత్రి అందు 1400 సంవత్సరాల క్రితం జరిగినది. 1947 నందు భారతదేశం యొక్క రాజ్యాంగం/భారత స్వాతంత్ర్య ప్రకటన జరిగింది. ఈ రెండు దీవించిన పుస్తకాలు/చట్టం మధ్య పలు సారూప్యతలు ఉన్నాయి. రెండు మానవ గౌరవం, మానవ సోదర బావం , స్వేచ్ఛ, మానవ సంక్షేమం, న్యాయం, సమానత్వం సమర్దిస్తాయి. రెంటి దృష్టి మానవ అభివృద్ధి పై ఉంది. మొదటిది లక్ష్యాల సాధనకు ఆల్మైటీ దేవుడు అందు పూర్తి నమ్మకం సూచిస్తుంది, రెండొవది దేశంలో ఒక రాజ్యాంగబద్ధమైన పాలన కోసం ప్రతిజ్ఞ దేవుని పేర చేయమంటుంది.
తన ప్రముఖ ప్రసంగంలో జవహర్ లాల్ నెహ్రూ “మేము ఒక గొప్ప దేశం యొక్క పౌరులo , మరియు మేము ఆదునికత, అధిక ప్రామాణికత అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. మేము అనేక మతాలకూ చెందవచ్చు కాని సమాన హక్కులు, అధికారాలు మరియు బాధ్యతలు కల భారతదేశం యొక్క పిల్లలం. సంకుచితత్వం మతోన్మాద ధోరణి ప్రోత్సహించే ఏ దేశం అబివృద్ది సాధించదు " అని అన్నాడు.
దివ్య రాత్రి అందు అవతరించిన దివ్య ఖురాన్ అనేక చోట్ల న్యాయం, నిజం, లిఖిత ఒప్పందాలను నెరవేర్చుట, ప్రజల హక్కులను కాపాడుట, (Huququlabad), జవాబుదారీతనం మరియు అందరి శ్రేయస్సు కోరుకొంటది. దివ్య ఖురాన్ ప్రకారం “ మీరు మానవులకు సరియిన మార్గదర్శకత్వం చూపటానికి, మంచిని పెంచటానికి చెడు ను నిర్ములించటానికి నిర్దేసింపబడిన ఉత్తములు.” దిని ప్రకారం మానవాళి అందరు సాదరణం గా ఒకే జాతికి చెందిన వారు, ఒకే తండ్రి నుంచి జన్మించిన వారు, ఒకే పెద్ద కుటుంబం కలిగిన వారు, వారి అంతర్గత ఐక్యత ముందు వారిలో తేడాలు చాల స్వల్పమైనవి అవి వారిలో మానవజాతి అందు అత్యుత్తమలు ఎవరు అని నిరూపించడానికి మాత్రమే ఉన్నాయి
క్లుప్త స్వర్ణ యుగం ముగిసిన తరువాత, ముస్లింలు దివ్య ఖురాన్ లో పొదగబడిన ఈ గంభీరమైన సూత్రాలను తమ జీవితంలో మర్చిపోయారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతీయులు కూడా రాజ్యాంగంలోని ఉత్తమ ఆదర్శాలను నిర్వహించడం లో విఫలమైనారు.
.దివ్య ఖురాన్ ఐక్యతను ఆదేశించి నప్పటికీ అనేక దేశాలలోని ముస్లింల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం భారతీయుల మద్య సహోదర భావమును వివరించినప్పటికి మతోన్మాదం వలన సామాన్య భారతీయులు నికృష్ట జీవితం సాగించవలసి వస్తుంది.
27రంజాన్ దివ్య రాత్రి ప్రతి సంవత్సరం వస్తుంది మరియు ముస్లింలకు వారి జీవితంలో దివ్య ఖురాన్ యొక్క సందేశం గుర్తు చేస్తుంది. 27రంజాన్ కూడా పునరావృతమవుతుంది మరియు అందరు భారతీయులకు ముఖ్యంగా దేశంలోని ముస్లిం పౌరులకు రాజ్యాంగం యొక్క ఆత్మ ను మరియు చట్ట సమానత్వానికి విలువ ఇవ్వాలని గుర్తుచేస్తుంది.
రెండు పుస్తకాలు/భారత స్వాతంత్ర్య చట్టం శుభకరమైన రాత్రి లో అవతరించినవి మరియు రెండు అనాగరికతను కాక మానవ నాగరికత అభివృద్ధి ను సమర్ధిస్తాయి. దురదృష్టవశాత్తు, ఇస్లాం మతం మరియు జాతీయవాదం రెండు తరుచుగా మతవాదుల/తీవ్రవాదుల ఆదర్శాలు, అపకీర్తిని , పక్షపాత దోరణిని పెంపొందించడానికి ఉపయోగబడుతున్నవి,
భారతీయు ప్రజలు రాజ్యాంగంలోని ఉత్తమ ఆదర్శాల ను అందుకోవడo లో విఫలమైనారు. ఇక ముస్లింల జీవితం ఖురాన్ మూల ఆదర్శాలకు అనుగుణంగా
లేదు. 27రంజాన్ విలువ నమ్మిన ముస్లింలు వారి దేశానికి అలాగే దివ్య ఖురాన్ పట్ల
విశ్వాసం ప్రకటించి దివ్య ఖురాన్ మరియు భారతదేశం యొక్క
రాజ్యాంగంలోని మూలా సూత్రాలను కాపాడాలి. వారు దివ్య ఖురాన్ లో క్రోడీకరించిన ఆదర్శాల పరిపూర్ణత కోసం మరియు
రాజ్యాంగం లో పొందు పరిచిన ఆదర్శాల కోసం శుభకరమైన రాత్రి అందు ప్రార్ధించాలి.వారు ఈ దీవించిన రాత్రి చేసే ప్రార్థన అందు ప్రేమ, శాంతి మరియు
సోదరభావం సందేశం వ్యాప్తి చేయాలి
శుభకరమైన/దివ్యమైన రాత్రి (Laylatul Qadr) భారత
దేశ ప్రజలను చైతన్య పరచాలి మరియు ముఖ్యంగా భారతీయ ముస్లింలు దివ్య ఖురాన్ చూపిన సత్య
మార్గం లో మరియు డెస్టినీ డే చూపిన
సన్మార్గం లో నడిచి భారత దేశ ఉన్నతికి, అభివృద్దికి తోడ్పడాలి అని
ఆశించుదాము.
No comments:
Post a Comment