ముస్లింలలో అక్షరాస్యత రేటుతో పాటు, శ్రామిక శక్తిలో ముస్లిము మహిళల వాటా కూడా ఇటీవలి సంవత్సరాలలో పెరిగిందని ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది
రాజ్యసభలో మైనారిటీ వ్యవహారాల కేంద్ర మంత్రి కిరణ్ రజ్జు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో, 2023-24 సంవత్సరానికి సంబంధించిన పిరియాడిక్ లేబర్ ఫోర్సు సర్వే PLFS డేటా ప్రకారం ముస్లింలలో (ఏడు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) అక్షరాస్యత 79.5%గా అంచనా వేయబడింది, అయితే ఇది ఇతర అన్ని మత సమూహాల 80.9% స్థాయి కంటే తక్కువగా ఉంది,
2001 జనాభా లెక్కల ప్రకారం, ముస్లింలలో
అక్షరాస్యత 59.1% గా అంచనా వేయబడింది. 2001లో అఖిల భారత అక్షరాస్యత రేటు 64.8%. గా ఉంది.
2011లో ముస్లింలలో అక్షరాస్యత రేటు 68.5%గా ఉంది. 2011లో అఖిల
భారత అక్షరాస్యత రేటు 73%గా ఉంది.
అందువల్ల 2001 జనాభా లెక్కలతో పోలిస్తే 2011 జనాభా
లెక్కల్లో ముస్లింలలో అక్షరాస్యత రేటు 9.4% శాతం పాయింట్లు పెరిగిందని రిజ్జు
అన్నారు
మరొక ప్రశ్నకు సమాధానమిస్తూ, 2001-22
మరియు 2023-24 మధ్య, ముస్లింలలో
మహిళా కార్మికుల శాతం 2001-22లో 15% నుండి 2023-24లో 21.4%కి ఆరు శాతం పాయింట్లకు పైగా
గణనీయమైన పెరుగుదలను ప్రతిబింబిస్తుందని మైనారిటీలపై PLFS డేటాను
రిజ్జు ఎత్తి చూపారు. వాస్తవానికి ఇది 2022-23లో 14.2%కి పడిపోయింది.
No comments:
Post a Comment