13 March 2025

మొఘలులు మరియు సూఫీలు ​​- మొఘల్ పాలనలో సూఫీ ప్రభావం The Mughals and the Sufis’-The Sufi influence in Mughal rule

 








శక్తివంతమైన మొఘల్ ఆస్థాన సంస్కృతి మరియు ఇస్లామిక్ మార్మికవాదం మధ్య మంచి సంబంధాలు కలవు.

 16వ శతాబ్దం ప్రారంభంలో జహీరుద్దీన్ ముహమ్మద్ బాబర్ మరియు నసీరుద్దీన్ ముహమ్మద్ హుమాయున్ తో ప్రారంభమైన మొఘల్ సామ్రాజ్యం చక్రవర్తి జలాలుద్దీన్ ముహమ్మద్ అక్బర్ కాలం లో దృఢంగా స్థాపించబడింది.

చిష్తి, సుహ్రవర్ది, ఫిర్దౌసి, షత్తారి మరియు ఖాదిరి వంటి వివిధ సూఫీ తరికాలు మొఘలుల కలం లో భారతదేశంలో చురుకుగా ఉన్నాయి. మొఘలులు అజ్మీర్‌కు చెందిన ఖ్వాజా గరీబ్ నవాజ్ మొయినుద్దీన్ చిష్తి వంటి ప్రసిద్ధ సూఫీ సాధువులు మరియు పుణ్యక్షేత్రాలను పోషించారు మొఘలులు మధ్య ఆసియా సూఫీ తరికా నక్ష్బందీల నుండి దూరాన్ని కొనసాగించారు.  

మొఘల్-సూఫీ సంబంధాలు  సమ్మిళిత లక్షణాన్ని సూచిస్తుంది. సంతులిత మొఘల్ సామ్రాజ్య సంస్కృతి భారతీయ రాజపుత్రులు మరియు ఇరానియన్ షియాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది, చిష్తిలు మరియు ఖాదిరీలు సమర్థించిన భక్తి ఆచారాల విలువను అర్థం చేసుకుంది

17వ శతాబ్దపు చిష్తి-సబిరి క్రమానికి చెందిన మరియు అవధ్ కు చెందిన సూఫీ పండితుడు షేక్ అబ్దుర్ రెహమాన్ చిష్తి (1683లో మరణించాడు), తన రచన మీరాతుల్ అస్రార్ Mir’atul Asrar లో సూఫీ జీవిత చరిత్రలను,  సూఫీల కొన్ని ముఖ్యమైన లక్షణాలను  వివరణాత్మక వివరణతో ఇచ్చాడు. ఇస్లాం చాయలో ఉండి, భారతీయ సూఫీలు  ఎలా వైవిధ్యంగా ఉండగలరో వివరించాడు.

భారతీయ సూఫీలకు మాజబ్ no mazhab లేదా ఏదైనా సున్ని న్యాయశాస్త్రం any juridical school of Sunni Islam పట్ల గాని నిబద్ధత, commitment లేదు.  

ప్రముఖ నక్ష్బందీ సూఫీ షేక్ అహ్మద్ సిర్హిండి (1624లో మరణించారు) తన కాలంలోని ముస్లింల మధ్య ఒక ప్రవక్త పంపబడితే, అతను ఇస్లాం యొక్క హనాఫీ వివరణను ఆచరించేవాడని వ్యాఖ్యానించారు.

17వ శతాబ్దం మధ్యలో ఔరంగజేబు అధికారం చేపట్టే సమయానికి నక్ష్బందీ సూఫీలు  ప్రత్యేక హక్కులు పొందారు నక్ష్బందీ సూఫీ షేక్ అహ్మద్ సిర్హిండి కుమారులు మరియు మనవళ్లు చక్రవర్తి కి దగ్గిర స్థానం పొందగలిగినారు. నక్ష్బందీలు మధ్య ఆసియాలో వారి ఆధ్యాత్మిక వంశం యొక్క ప్రారంభ పూర్వీకులు అనుభవించిన అధికారం మరియు ప్రతిష్టను కోరుకున్నారు.ఔరంగజేబు కాలం లో నక్ష్బందీలు మొఘల్ కోర్టులో మరియు వెలుపల స్థిరపడ్డారు.

ఔరంగజేబు పాలన ముగిసే సమయానికి రాజకీయం గా పూర్తిగా అల్లకల్లోలం ఏర్పడింది. నక్ష్బందీ-ముజాద్దిదీ సూఫీలు సమర్ధించిన పాలకులు పాలనను గందరగోళానికి గురిచేశారు. చిష్తీ మరియు ఖాదిరీ తరికాలకు చెందిన సామాజిక మరియు రాజకీయ సిద్ధాంతాలు స్వీకరించిన దారా షికో మరియు అతని సోదరి జహానారా (1681లో మరణించారు) మరణించారు.

దారా షికో పర్షియన్ భాషలో యోగవాసిష్ఠ యొక్క కొత్త అనువాదంపై పండితుల బృందంతో కలిసి పనిచేశాడు. 17వ శతాబ్దం మధ్యలో దారా షికో కాలం నాటికి సుల్-ఇ కుల్ sulh-i kull , అందరితో శాంతి అనే విధానానికి అనుగుణంగా అనువాదాల ద్వారా హిందూ సంప్రదాయాలు తెలుసుకోవడం ప్రారంభించారు.ఇస్లాం మరియు హిందూ సంప్రదాయాల ఉమ్మడి పునాదిని కోరుకునే మజ్మా-ఉల్-బహ్రెయిన్ Majma-ul-Bahrain మరియు ఇతర గ్రంథాల అనువాదాలు జరిగినవి.

దారా షికోకు సూఫీజం మరియు ఖాదిరి సూఫీ సాధువుల పట్ల అనుబంధ౦ ఉండేది. హిందువులు మరియు ముస్లింల మధ్య ఎటువంటి తేడా లేదని అద్వైత వేదాంతం లాంటి వహ్దతుల్ వుజుద్, అంటే ఉనికి యొక్క ఐక్యత అనే సిద్ధాంతం సమర్థించింది.

.ఔరంగజేబ్ సోదరీమణులు జహానారా మరియు రౌషనారా (1671లో మరణించారు), మరియు అతని మేధావి కుమార్తె జెబున్ నిసా (1701లో మరణించారు).జహానారా తన తండ్రి షాజహాన్ మరియు అన్నయ్య దారా షికోహ్ లకు దగ్గరగా ఉండేది మరియు వారిని అనుసరించి, సూఫీ మతానికి అత్యంత అంకితభావంతో, మొయినుద్దీన్ చిష్టి మరియు అతని మందిరం పట్ల లోతైన అనుబంధాన్ని కలిగి ఉండేది.

జహానారా కాశ్మీర్‌లోని ప్రముఖ ఖాదిరి సూఫీ ముల్లా షా బదక్షి (1661లో మరణించారు) శిష్యురాలు కూడా అయ్యింది మరియు జహానారా సూఫీ మతంపై రెండు పుస్తకాలు రాసింది. వారసత్వ యుద్ధంలో, జహానారా దారా షికోహ్ పక్షాన ఉండి, ఔరంగజేబుతో తెలివి కోసం తర్కించడానికి ప్రయత్నించింది, కానీ విజయం సాధించలేదుఔరంగజేబు తరువాత జహానారా కు ఎటువంటి ఇబ్బందులు సృష్టించలేదు

తన కాలంలో అత్యంత ధనవంతురాలైన మొఘల్ యువరాణిగా, జహానారా చిష్టి మందిరాల పరిచారకులకు పంపిణీ చేయడానికి మూడు కోట్ల రూపాయల మొత్తాన్ని వదిలి వెళ్ళింది, కానీ ఔరంగజేబు దానిలో మూడో వంతు మాత్రమే పంపిణీ చేయడానికి అనుమతించాడని తెలుస్తుంది.

జహానారా యొక్క సోదరి రౌషనారా, అధికారం కోసం పోరాటంలో ఔరంగజేబు పక్షాన నిలిచింది. రౌషనారా కు  యువ నక్ష్బంది-ముజాద్దిది సూఫీ షేక్ సైఫుద్దీన్ తో పరిచయం కలదు.  సైఫుద్దీన్ రౌషనారా ను సూఫీ ఉపాధ్యాయురాలిగా, కవిగా మరియు రచయితగా భావించాడు 53 సంవత్సరాల వయస్సులో రౌషనారా అకాల మరణానికి ఔరంగజేబు కారణమని ప్రజలు అనుమానించారు,

ఔరంగజేబు తండ్రిగా కుమార్తె జెబున్ నిసా ను అధికంగా ప్రేమించాడు , జెబున్ నిసా ను ఆ కాలంలోని ఉత్తమ ఉపాధ్యాయుల వద్ద విద్య నేర్పించాడు. జెబున్ నిసా కవితా రచనలను చదవడం మరియు స్వంతంగా కొన్నింటిని కంపోజ్ చేయడంచేసేది.  జెబున్ నిసా మఖ్ఫీ Makhfi అనే కలం పేరుతో రచనలు చేసిది. జెబున్ నిసా నక్ష్బందీ వృద్ధుడు మరియు షేక్ అహ్మద్ సిర్హిండి మనవడు, షేక్ అబ్దుల్ అహద్ వహ్దత్ (1713లో మరణించాడు) తో ఉత్తర-ప్రత్యుత్తరాలు జరిపేది. వహ్దత్ గుల్ (గులాబీ) అనే కలం పేరుతో రాసిన మంచి కవిగా ప్రసిద్ధి చెందాడు జెబున్ నిసా మరణ వార్త విని ఔరంగజేబు ఏడ్చాడు మరియు జెబున్ నిసా సమాధి నిర్మించమని ఆదేశించాడు.  

తన జీవితాంతం ప్యూరిటానికల్ నక్ష్బందీలకు ప్రత్యేక హక్కులు కల్పించినప్పటికీ, ఔరంగజేబును దక్కన్‌లోని ఖుల్దాబాద్‌లోని చిష్టి కేంద్రంలో ఖననం చేశారు (1707). చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ సుదూర రంగూన్‌లో  బాధాకరమైన సూఫీ కవిత్వాన్ని పఠిస్తూ మరణించాడు.

 

 

 

No comments:

Post a Comment