తిరుచ్చి, తమిళనాడు లోని మక్కా మసీదు
తమిళనాడులోని పురాతన ఇస్లామిక్ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఒక లిఖిత ఫలకం మక్కా మసీదు 734 A.D./ అల్-హిజ్రీ క్యాలెండర్ యొక్క 116 సంవత్సరం నాటిదిగా సూచిస్తుంది.
తిరుచ్చి, తమిళనాడు లోని మక్కా మసీదు వయస్సును అరబిక్‌లో 'మిహ్రాబ్' ('కిబ్లా' లేదా ప్రార్థన దిశను సూచించే గూడు) పైన చెక్కబడిన రాతి ఫలకం ద్వారా ధృవీకరించబడింది
పురాతన కాలం నుండి ముస్లిం సమాజం తిరుచ్చిలో చాలా కాలంగా మరియు సామరస్యపూర్వకంగా ఉంది. మక్కా మసీదు హజ్రత్ థాబుల్ ఆలం బధుసా నాథర్వాలి దర్గా కు సమిప దూరంలో ఉంది, క్రీ.శ. 927లో సమర్కండ్ సమీపంలోని సుహార్వర్డిలో సుల్తాన్ ముతాహిర్రుద్దీన్‌గా జన్మించిన టర్కిష్-సిరియన్ వంశానికి చెందిన హజ్రత్ థాబుల్ ఆలం బధుసా నాథర్వాలి దక్షిణ ఆసియాలో ఇస్లాం సందేశాన్ని వ్యాప్తి చేయడానికి తన జీవితాన్ని త్యాగం చేశాడు. సూఫీ సాధువు అయిన హజ్రత్ థాబుల్ ఆలం బధుసా నాథర్వాలి ప్రస్తుత ప్రదేశంలో స్థిరపడటానికి ముందు మక్కా మసీదు ప్రాంగణంలో నివసించాడని చెబుతారు.
పూర్వపు ఆర్కాట్ నవాబులు నిర్మించిన మసీదులు కూడా తిరుచ్చి లో కలవు. 2వ శతాబ్దపు చోళ రాజవంశం రాజధాని అయిన వొరైయూర్(తిరిచ్చి శివారు ప్రాంతం), అరబ్ వ్యాపారులకు తెలుసు.. ఇస్లాం పుట్టిన తర్వాత, అరబ్-ముస్లిం మిషనరీలు వొరైయూర్(తిరిచ్చి శివారు ప్రాంతం)కు ప్రయాణించడం ప్రారంభించారు. ఇస్లాం భారతదేశంలోని దక్షిణ భాగంలో చాలావరకు శాంతియుతంగా మరియు స్వచ్ఛందంగా వ్యాపించినది.
పల్లవ పాలనలో తమిళ లోతట్టు ప్రాంతంలో నివసించిన ముస్లిం నివాసితుల కోసం మక్కా మసీదును నిర్మించి ఉండవచ్చు. “తమిళనాడు తిరిచ్చి మక్కా మసీదు తమిళ నాడు రాష్ట్రంలో మరియు దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో సమకాలీన తేదీ శాసనం ఉన్న ఏకైక మస్జిద్”
“‘మిహ్రాబ్’ పైన ఉన్న దీర్ఘచతురస్రాకార గ్రానైట్ స్లాబ్‌లోని అరబిక్ శాసనం ప్రకారం, తిరిచ్చి మక్కా మసీదును హిజ్రీ 116/734 ADలో మొహమ్మద్ ఇబ్న్ హమీద్ ఇబ్న్ అబ్దుల్లా నిర్మించాడు. నలుగురు ఖలీఫాలు (ప్రవక్త ముహమ్మద్ వారసులు) - అబూ బకర్, ఉమర్, ఉత్మాన్ మరియు అలీ - పేర్లు కూడా శాసనంలో ప్రస్తావించబడ్డాయి, దీనిని పండితులు 8వ శతాబ్దానికి చెందినవిగా అంగీకరించారు.
తిరిచ్చి మక్కా మసీదులో శుక్రవారం ప్రార్థనలకు సుమారు 200 మంది హాజరవుతారు,
మసీదు ప్రాంగణంలోని దర్గాలో ఇస్లామిక్ నెల రజబ్ 28వ రోజున మొహమ్మద్ ఇబ్రహీం మరియు తాహిరా బీబీలను స్మరించుకునే వార్షిక 'ఉర్స్' (పండుగ) జరుగుతుంది. దానికి అనేక మతాలకు చెందిన వ్యక్తులు హాజరు అవుతారు. ఉర్స్ లో ఇచ్చే ప్రజా విందు కోసం ఉదారంగా విరాళాలు ఇస్తారు, పాల్గొంటారు..
తిరిచ్చి మక్కా మసీదులోని పురాతన కళాఖండాలలో పవిత్ర ఖురాన్ యొక్క పురాతన కాపీ ఒకటి కలదు..
తిరుచ్చిలో
వస్త్ర వ్యాపారి అయిన అబ్దుల్ రెహమాన్ వంశస్తులు అనేక తరాలుగా మక్కా మస్జద్
ట్రస్టీ గా ఉన్నారు.
No comments:
Post a Comment