19 March 2025

కిలకరై ‘సీతకథి’‘ లేదా వర్తక యువరాజు’ షేక్ అబ్దుల్ ఖాదిర్ Kilakarai ‘Seethakathi’ or ‘merchant prince’ Shaikh Abdul Qadir

 


సీతకథి Seethakathi గా ప్రసిద్ధి చెందిన వర్తక యువరాజు merchant princeషేక్ అబ్దుల్ ఖాదిర్ గురించి తమిళ జానపద కథలలో అనేక ప్రస్తావనలు కలవు. 17వ శతాబ్దంలో డచ్ మరియు బ్రిటిష్ వారితో వ్యాపారం చేసిన తొలి ప్రాంతీయ వ్యాపారులలో షేక్ అబ్దుల్ ఖాదిర్ ఒకరు. " సీతకథి/ షేక్ అబ్దుల్ ఖాదిర్ ఒక విజయవంతమైన వ్యాపారవేత్త

తమిళంలో, సీతకథి అనేది దాతృత్వానికి పర్యాయపదంగా వాడుతారు. . 'సేఠుం కోడై కొడుత్తన్ సీతకథి' (మరణంలో కూడా సీతకథి ఉదారంగా దానం చేసేవాడు) అనేది ప్రసిద్ది చెందిన తమిళ సామెత.

అసలు సీతకథి ఎవరు, లేదా కిలవన్ సేతుపతి ఇచ్చిన విజయ రఘునాథ పెరియతంబి మరక్కాయర్ అనే బిరుదును కూడా కలిగి ఉన్న షేక్ అబ్దుల్ ఖాదిర్ ఎవరు?

మల్లా సాహిబ్ పెరియ తంబి మరక్కాయర్ మరియు సయ్యద్ అహ్మద్ నాచియార్ Malla Sahib Periya Thambi Marakkayar and Syed Ahmed Nachiyar దంపతులకు గల  ముగ్గురు కుమారులలో రెండవవాడిగా జన్మించిన సీతకథి/షేక్ అబ్దుల్ ఖాదిర్ సెల్వర్కులం Selvarkulam నుండి వచ్చారు..

మరక్కాయర్లు Marakkayar (మరకల రాయర్ Marakala Rayar యొక్క సంక్షిప్త రూపం) చారిత్రక గ్రంథాలలో ప్రస్తావించబడిన ఐదు ప్రారంభ తమిళ ముస్లిం సమాజాలలో ఒకటి (మిగిలినవారు సోనకర్, లబ్బాయి, తుర్కి మరియు రౌథర్ Sonakar, Labbai, Turki and Rowther).

మరక్కాయర్ సమాజం సముద్ర వాణిజ్యానికి ప్రసిద్ధి చెందింది మరియు సీతకథి/ షేక్ అబ్దుల్ ఖాదిర్ మిరియాలు, బియ్యం, ముత్యాలు మరియు చేనేత వస్త్రాలు, ఇతర వస్తువుల వాణిజ్యం తో సంపదను ఆర్జించాడు.

తమిళనాడు ప్రస్తుత రామనాథపురం జిల్లాలోని తీరప్రాంత పట్టణం కిలకరై Kilakarai కు చెందిన  'వర్తక యువరాజు' షేక్ అబ్దుల్ ఖాదిర్ గురించి తమిళ జానపద కథనాలలో అనేక ప్రస్తావనలు కలవు., షేక్ అబ్దుల్ ఖాదిర్ ను తమిళం లో 'సేదకడి' లేదా 'సిదక్కలి Seydakadi’ or ‘Sidakkali’' అని వివిధ రకాలుగా పిలుస్తారు. షేక్ అబ్దుల్ ఖాదిర్ గురించిన వాస్తవ ఆధారాలు 17వ శతాబ్దం చివరి నాటి కొన్ని రికార్డులు మరియు శాసనాలలో మాత్రమే కలవు.

కిలకరై ప్రకృతి దృశ్యానికి కేంద్రంగా ఉన్న గ్రాండ్ జుమ్మా మసీదు 17వ శతాబ్దంలో ద్రావిడ శైలి నిర్మాణ శైలిలో నిర్మించబడింది, ఇక్కడ సీతాకథి లేదా 'వర్తక యువరాజు' షేక్ అబ్దుల్ ఖాదిర్ ఖననం చేయబడినాడు..

కిలకరై గ్రాండ్ జుమ్మా మసీదు సీతకథి జీవితకాలంలో నిర్మించబడిందని చెబుతారు, కిలకరై గ్రాండ్ జుమ్మా మసీదు లో సీతకథి అన్నయ్య పట్టతు మరైక్కర్‘Pattathu Maraikkar’’ మహమ్మద్ అబ్దుల్ ఖాదిర్ మరియు సీతకథి లేదా 'వర్తక యువరాజు' షేక్ అబ్దుల్ ఖాదిర్ గురువు సూఫీ సాధువు-పండితుడు షేక్ సదఖతుల్లా (స్థానికంగా సదఖతుల్లా అప్ప Sadaqatullah Appa) గోపుర సమాధి కూడా ఉంది. సీతకథి లేదా 'వర్తక యువరాజు' షేక్ అబ్దుల్ ఖాదిర్ తన తమ్ముడు షేక్ ఇబ్రహీం మరక్కాయర్ సమాధిని వెతలైలో ఏర్పాటు చేశాడు.

" కిలకరై గ్రాండ్ జుమ్మా మసీదు లో రాతితో తయారు చేయబడిన 110 స్తంభాలు ఉన్నాయి. జుమ్మా మసీదు లోని అన్ని స్తంభాలు పూల నమూనాలతో అలంకరించబడ్డాయి మరియు కొన్ని సహజ సముద్రపు గవ్వలతో పొదిగబడినవి. "

ఇస్లాం రాకముందే అరబ్బులు మరియు పర్షియన్లు భారత ద్వీపకల్పంతో వ్యాపారం చేస్తున్నారు. కాలక్రమేణా, అరబ్ వ్యాపారులు దక్షిణ భారతదేశ తీరప్రాంతంలో స్థిరపడ్డారు మరియు ఇస్లాం రాకతో, స్థానిక జనాభాతో కలిసిపోయారు. ఈ ప్రాంతాలలోని చాలా మంది తమిళం మాట్లాడే ముస్లింలు అరబ్ పూర్వీకులను కలిగి ఉన్నారు.

దక్కన్‌లో ఇస్లాం ప్రభావం 13వ శతాబ్దం చివరి నుండి గుర్తించబడింది, కానీ అది 17వ శతాబ్దం మధ్యకాలం తర్వాత, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు (1658-1707) పాలనలో మాత్రమే గరిష్ట స్థాయికి చేరుకుంది.

 సీతకథి/షేక్ అబ్దుల్ ఖాదిర్,  విజయ రఘునాథ తేవర్ లేదా కిలవన్ సేతుపతికి సన్నిహిత స్నేహితుడు. కిలవన్ సేతుపతి, చొక్కనాథ నాయక్ యొక్క నమ్మకమైన సామంతుడు. చొక్కనాథ నాయక్ మైసూర్ సైన్యంతో జరిగిన యుద్ధంలో తిరుమల నాయక్‌కు సహాయం చేశాడు.

1792లో కిలవన్ సేతుపతి రామలింగ విలాసం ప్యాలెస్‌ను నిర్మించాడు. రామలింగ విలాసం ప్యాలెస్‌లో సీతకథి/షేక్ అబ్దుల్ ఖాదిర్ పేరున్న రాతి ఫలకం కూడా  ఉంది.

విజయ రఘునాథ పెరియ తంబిఅనే బిరుదు, సీతకథి/షేక్ అబ్దుల్ ఖాదిర్ కు తన రాజ స్నేహితుడి కిలవన్ సేతుపతి పట్ల కలిగి ఉన్న ప్రేమ మరియు నమ్మకాన్ని సూచిస్తుంది.

బెంగాల్‌లో మొఘల్ ఖలీఫా

తన ఆద్యాత్మిక గురువు సూఫీ సన్యాసి షేఖ్ సదకతుల్లా సిఫార్సు పై సీతాకథి/ షేక్ అబ్దుల్ ఖాదిర్ ను  చక్రవర్తి ఔరంగజేబు మొఘల్ ఖలీఫా’ (రీజెంట్)గా బెంగాల్‌కు పంపారని కూడా చెబుతారు. అయితే, కొత్త వాతావరణం అతనికి సరిపోకపోవడంతో కొంతకాలం తర్వాత సీతాకథి/షేక్ అబ్దుల్ ఖాదిర్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు.

సీతాకథి/షేక్ అబ్దుల్ ఖాదిర్ సముద్ర వాణిజ్య నైపుణ్యం 17వ శతాబ్దంలో డచ్ మరియు బ్రిటిష్ వారితో వ్యాపారం చేసిన తొలి ప్రాంతీయ వ్యాపారులలో ఒకరిగా మారడానికి సహాయపడింది. సీతాకథి/షేక్ అబ్దుల్ ఖాదిర్ కోరమండల్ తీరం నుండి శ్రీలంక (సిలోన్) వరకు వ్యాపారాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. 17వ శతాబ్దం మధ్యలో బ్రిటిష్ వారు సీతాకథి/షేక్ అబ్దుల్ ఖాదిర్ తో సంబంధాలు ఏర్పరచుకున్నారు.

1953లో నైనార్ రాసిన సీతాకథి వల్లల్ అనే పుస్తకం 1686-1690లో సీతాకథి/షేక్ అబ్దుల్ ఖాదిర్ మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏజెంట్లు విలియం గైఫోర్డ్ మరియు ఎలిహు యేల్ మధ్య మిరియాలు మరియు బియ్యం వ్యాపారంపై చర్చలు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను సూచిస్తుంది. డచ్ వారు కూడా సీతాకథి/షేక్ అబ్దుల్ ఖాదిర్ తో మొదట వ్యాపార ప్రత్యర్థులుగా, ఆపై సహకారులుగా వ్యవహరించారు.

కళల పోషకుడు

సీతకథి/ షేక్ అబ్దుల్ ఖాదిర్ కళా ​​పోషకుడు.  ఉమరు పులావర్, పడికాసు తంబిరాన్, కందసామి పులావర్ మొదలగు కవులను సీతకథి/ షేక్ అబ్దుల్ ఖాదిర్ పోషించినాడు

ఉమరు పులవర్ తమిళంలో ముహమ్మద్ ప్రవక్త(స) జీవిత చరిత్రను 5,000 చరణాల పద్యాలతో కూడిన సీర పురాణం Seera Puranam రాశారు. నైనార్ పుస్తకంలో సీతకథి/ షేక్ అబ్దుల్ ఖాదిర్ పై రెండు సాహిత్య రచనలు కూడా ఉన్నాయి: సీతకతి నొంది నాడగం (తమిళ మోనో-డ్రామా(a Tamil mono-drama) మరియు తిరుమణ వాజ్త్తు (సీతకథి వివాహానికి వ్రాసిన శుభాకాంక్షలు felicitation written for Seethakathi’s wedding).

కిలకరై ప్రధాన రహదారిని 'వల్లల్ సీతకథి సలై' అని పిలుస్తారు మరియు కిలకరై పట్టణ శివార్లలో సీతకథి మీద ఉన్న గొప్ప స్మారక తోరణం సందర్శకులను స్వాగతిస్తుంది. సీతకథి గౌరవార్థం ప్రతి సంవత్సరం ' సీతకథి విజా Seethakathi Vizha’ 'ను పద్యాలు మరియు ప్రసంగాలతో నిర్వహిస్తారు.

 

 

మూలం: ది హిందూ, అక్టోబర్ 27, 2023

No comments:

Post a Comment