1. 1.ఖురాన్
వ్యాఖ్యానం,
అనువాదం : ఆర్థర్ జె అర్బెర్రీ
The Koran
Interpreted, translated by Arthur J Arberry
అరబిక్ నుండి దివ్య ఖురాన్
అనువాదం సాధ్యం కాదని చాలా మంది ముస్లింల అభిప్రాయం.అయితే, ఆర్థర్ జె అర్బెర్రీ Arthur J Arberry
దివ్య ఖురాన్ ను ఆంగ్లంలోకి
అనువదించడానికి
చేసిన ప్రయత్నం మాత్రం చాలా ఉత్తమ ప్రయత్నం. ఆర్థర్ జె అర్బెర్రీచేసిన అనువాదం ఖచ్చితమైనది
మాత్రమే కాదు, అసలు/మూలం/ఒరిజినల్ (దివ్య
ఖురాన్) యొక్క
లయ మరియు కవితలను కూడా ప్రతిoబించినద. అర్బెర్రీ భక్తిపరుడైన క్రైస్తవుడు,
అయినప్పటికీ ఇస్లాం యొక్క ఆధ్యాత్మిక ను బలంగా
గుర్తించాడు.
2.ది ఖురాన్:
మైఖేల్ కుక్ రాసిన చాలా చిన్న పరిచయం
The Koran: A Very
Short Introduction by Michael Cook
మీరు ఎంత మంచి అనువాదం చదివినా (లేదా మీరు దానిని అరబిక్‌లో చదవగలిగినా), ఖురాన్ యొక్క
వచనానికి ఇంకా చాలా వివరణ మరియు కొంత సందర్భం అవసరం .పండితుడు,
వివేకవంతుడు, చమత్కారి అయిన మైకిల్ కుక్ ఆంగ్లములో 150 పేజీలలో రాసిన సంక్షిప్త దివ్య
ఖురాన్,పరిచయం బహురమ్యంగా ఉంటది.దివ్య ఖురాన్ అధ్యయనాలలో నిపుణుడు కూడా అయిన మైకిల్ కుక్
యొక్క అద్భుతమైన
సమర్థవంతమైన అనువాదoము నుండి
కొంత నేర్చుకొనే అవకాశం
మనకు ఉంది. ఈ
పుస్తకం ఎలా అనువాదం చేయాలో అనే దానికి
ఒక నమూనాగా
ఉపయోగపడుతుంది.
.3. ది మాంటిల్ అఫ్ ది ప్రోఫేట్: ఇరాన్లో మతం మరియు రాజకీయాలు- రాయ్ మోతాహదేహ్
The Mantle of the Prophet: Religion and Politics in
Iran by Roy Mottahedeh
ఇలాంటి పుస్తకం మరొకటి లేదు. అమెరికన్ ప్రిన్సిటన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ మోటాహెడెహ్ ఇరాన్లో తన ఆధ్యాత్మిక జీవితం గురించి ఒక ఇరానియన్ ముల్లాతో జరిపిన సుదీర్ఘ ఇంటర్వ్యూల ఆధారంగా ముల్లా బాల్యం పవిత్ర నగరమైన కొమ్లో నుండి వృత్తి రీత్యా సీనియర్ ఇరాన్ మతాధికారి హోదాలో ఉన్నత స్థాన౦o వరకు జరిగిన ప్రయాణాన్ని
వర్ణించారు. షియ ఇస్లాం యొక్క ఆధ్యాత్మిక మరియు మేధో జీవితం యొక్క శోధనతో బాటు ఈ ప్రాంతంలోని ఆధునిక రాజకీయ మరియు సామాజిక ఉద్రిక్తతలు కూడా ఈ పుస్తకం లో అన్వేషించబడ్డాయి
4. ఇరవయ్యవ శతాబ్దానికి చెందిన సూఫీ సన్యాసి. షేక్
అహ్మద్ అల్ –అలావి- మార్టిన్ లింగ్స్
A Sufi Saint of the Twentieth Century. Shaikh Ahmad
al-'Alawi by Martin Lings
జీవిత దృక్పదాన్ని మార్చిన గొప్ప
పుస్తకం ఇది..ఇందులో ఉత్తర ఆఫ్రికా కు చెందిన గొప్ప అల్జీరియన్ సూఫీ
ఆధ్యాత్మిక గురువు సెయింట్. షేక్ అహ్మద్ అల్-'అలవి యొక్క కెరీర్ మరియు బోధనల యొక్క ఉత్తేజకరమైన వర్ణన ఉంటుంది. పవిత్ర
వ్యక్తి మరియు లోతైన ఆలోచనాపరుడు అయిన అల్-అలవి ఉత్తర ఆఫ్రికన్
సూఫీ తరికా/ఆర్డర్స్ లలో ఒకదాన్ని
స్థాపించాడు. ఇస్లాం స్వీకరించిన మార్టిన్
లి౦oగ్స్, తన “ఇరవయ్యవ శతాబ్దానికి చెందిన సూఫీ సన్యాసి. షేక్
అహ్మద్ అల్ –అలావి’ పుస్తకం లో
అల్-అలవి బోధనల గురించి మరియు అల్-అలవి వివరించిన ప్రామాణికమైన సూఫీయిజం గురించి వివరణను ఇస్తాడు. పశ్చిమాన
విస్తృతంగా అందుబాటులో ఉన్న సూఫీ తత్వం కు భిన్నంగా ఈ పుస్తకం సమాచారం ఇస్తుంది.. ముస్లింలు అల్లాహ్ను ఎందుకు, ఎలా విశ్వసిస్తున్నారో మీకు కొంత అవగాహన కలిగించే పుస్తకం ఇది
5. సూఫియిజ౦o పై కార్ల్ ఎర్నెస్ట్ రచించిన శంభాల గైడ్ The
Shambhala Guide to Sufism by Carl Ernst
ఇది ఇస్లామిక్ అధ్యయనాలలో భాగం గా సూఫీయిజం
గురించి అకాడెమిక్ స్పెషలిస్ట్ కార్ల్ ఎర్నెస్ట్ రాసిన అద్భుత పుస్తకం. దివ్య ఖురాన్
లోని ఆధ్యాత్మిక అంశాలను మరియు మధ్యయుగ
కాలం నాటి గొప్ప
సూఫీ తరికాలను/ఆర్డర్స్ చరిత్రను
ఎర్నెస్ట్ వివరంగా వివరిస్తాడు ఎర్నెస్ట్
రచనలో గొప్ప సూఫీ
కవులైన హఫీజ్ మరియు రూమిలపైనే కాకుండా సమకాలీన సూఫీయిజంపై కూడా చాలా
ఆసక్తికరమైన అధ్యాయం ఉంది.
6.
మార్షల్ GS హోడ్గ్సన్ రాసిన ది వెంచర్ ఆఫ్ ఇస్లాం: కాన్సైన్స్ అండ్ హిస్టరీ ఇన్ ఎ వరల్డ్
సివిలైజేషన్ (3) వాల్యూమ్‌లు
The Venture of Islam: Conscience and History
in a World Civilization (3 volumes) by Marshal GS Hodgson
ఇస్లాం యొక్క ఈ
భారీ సాంస్కృతిక చరిత్రను పూర్తి చేయడానికి ముందే హాడ్గ్సన్ Marshal GS Hodgson మరణించాడు, అయినప్పటికీ, ఇది అభ్యాసం మరియు
సాంస్కృతిక సానుభూతి యొక్క గొప్ప స్మారక చిహ్నంగా మిగిలిపోయింది. ఇస్లామిక్ చరిత్ర
సాంప్రదాయకంగా ఎలా వ్రాయబడిందో హోడ్గ్సన్ పునరాలోచించడానికి ప్రయత్నించాడు మరియు హోడ్గ్సన్ ఓరియంటలిస్ట్ అనే ముసుగును తొలగించాలని అనుకున్నాడు. హోడ్గ్సన్ పుస్తకం చాలా ప్రభావవంతంగా ఉంది మరియు పెర్షియన్, టర్కిష్ మరియు భారతీయ ముస్లింల విజయాలపై రాయబడిన ఉత్తమ గ్రంధం
7.
ఫ్రాన్సిస్ రాబిన్సన్ రాసిన “అట్లాస్ ఆఫ్ ది
ఇస్లామిక్ వరల్డ్” Atlas of
the Islamic World by Francis Robinson
ఇస్లామిక్
సంస్కృతిపై హోడ్గ్సన్ Hodgson పునరాలోచన ద్వారా
ప్రభావితమైన పుస్తకాలలో అట్లాస్ ఆఫ్ ది ఇస్లామిక్ వరల్డ్ ఒకటి. పెర్షియన్ సూక్ష్మచిత్రాలు, మొఘల్ వాస్తుశిల్పం, ఆఫ్రికన్ మసీదులు, ఆధునిక రాజకీయ పోస్టర్లు మరియు మరోన్నే మనోహరమైనవి ఇందులో వర్ణించబడినవి వచనం. ఇస్లాం అరబ్బుల
గుత్తాధిపత్యం కాదని మరియు 11వ శతాబ్దంలో ఉన్నత ఇస్లామిక్ సంస్కృతి ఒక్కసారిగా ఆగిపోలేదని రాబిన్సన్ మనకు గుర్తు చేస్తున్నారు.
8. ఆల్బర్ట్ హౌరానీ రాసిన “ఎ హిస్టరీ ఆఫ్ ది అరబ్ పీపుల్స్”
A History of the Arab Peoples by Albert
Hourani
ఇస్లాం అరబ్బుల
గుత్తాధిపత్యం కానప్పటికీ,
దాని ప్రచారంలో వారు పెద్ద పాత్ర పోషించారు. హౌరానీ ఒక చురుకైన స్టైలిస్ట్
మరియు ఈ పుస్తకం,
అరబ్ విజయాల యొక్క ప్రకాశవంతమైన మరియు సానుభూతితో కూడిన ఖాతా, హౌరానీ చివరి
కళాఖండం. కథనం చక్కటి స్వరూపాన్ని కలిగి ఉంది మరియు చెప్పలేని
ప్రదేశాలలో పోరాడటానికి బయలుదేరిన ముస్లిం వ్యక్తుల
గురించి వివరణ ఉంది.
మధ్యప్రాచ్యానికి
వెళ్లాలని అనుకునే ఎవరైనా దీన్ని మొదట చదవాలి.
9. రాబర్ట్ హిల్లెన్బ్రాండ్ రచించిన ఇస్లామిక్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్
Islamic Art and Architecture by Robert
Hillenbrand
బ్రిటన్లో ఇస్లామిక్ కళపై హిల్లెన్బ్రాండ్ నిపుణుడైన వ్యక్తి మరియు ఇస్లామిక్ కళ మరియు వాస్తుశిల్పంపై హిల్లెన్బ్రాండ్ అనేక విస్తృత అద్యనాలు
ఉన్నాయి. ఇస్లామిక్
కళ పై హిల్లెన్బ్రాండ్ పుస్తకం కాంపాక్ట్ మరియు సచిత్ర వివరణాత్మకం గా
ఉంది. హిల్లెన్బ్రాండ్ గద్యం యొక్క నాణ్యత మరియు అతను వివరించే వస్తువులపై దాని ప్రభావం
అద్భుతమైనది. ఉదాహరణకు, అల్హంబ్రా (Alhambra) గురించి
హిల్లెన్బ్రాండ్ వివరణ ఉత్కంఠభరితమైనది
10. ముస్లింలు: వారి
మత విశ్వాసాలు మరియు ఆచారాలు-ఆండ్రూ
రిప్పిన్ Muslims: Their Religious Beliefs and Practices by Andrew Rippin
ముస్లింలు ఏమి నమ్ముతారో
దాని గురించి ఇది బహుశా ఉత్తమ సాధారణ కథనం. రిప్పిన్ తన పాఠకులకు ఇస్లామిక్ చరిత్ర
యొక్క అంశాలు మరియు వేదాంతశాస్త్రం మరియు చట్టం యొక్క పరిణామం, అలాగే హజ్, సలాత్, రంజాన్ మరియు జిహాద్ వంటి వాటి
యొక్క అర్థాన్ని బోధిస్తాడు. షియా మరియు సున్నీల మధ్య తేడాలను రిప్పిన్ వివరిస్తారు.
ఆధునిక ముస్లింలు ఎదుర్కొంటున్న సవాళ్లు,,అవకాశాలు, ఆధునికత, స్త్రీవాదం మరియు ప్రజాస్వామ్యంతో
సమకాలీన ఇస్లాం యొక్క ఎన్‌కౌంటర్ అన్నీ ఆలోచనాత్మకంగా అన్వేషించబడతాయి.
మూలం: ది గార్డియన్,
రచయిత రాబర్ట్ ఇర్విన్,
రచయిత :రాబర్ట్ ఇర్విన్, రచయిత మరియు బ్రాడ్కష్టర్Broadcaster/ప్రసారకుడు. రాబర్ట్ ఇర్విన్ “ది అల్హాంబ్రా’,ది అరేబియన్ నైట్స్: ఎ కంపానియన్ అండ్ ది డెజర్ట్: యాన్ ఆంథాలజీ ఆఫ్ క్లాసికల్ అరబిక్ లిటరేచర్” మరియు ఆరు నవలల రచయిత కూడా. రాబర్ట్ ఇర్విన్ ఇటివలే ఓరియంటలిజం చరిత్ర రాయడం పూర్తి చేశాడు.
No comments:
Post a Comment