18 May 2025

బీబీ కమల్: బీహార్ యొక్క మొట్టమొదటి మహిళా సూఫీ సెయింట్ Bibi Kamal: Bihar’s First Female Sufi Saint

 



 

1296లో మరణించిన  బీబీ కమల్, సమాధి పాట్నా సమీపం కాకో షరీఫ్ వద్ద ఉంది. బీబీ కమల్ భర్త సమాధి ఆమె సమాధి నుండి కేవలం 1-2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంకానగర్‌లో ఉంది.

బీహార్‌లోని జెహానాబాద్ జిల్లాలోని కమలాబాద్ లేదా   కాకో షరీఫ్‌లో, 1211లో జన్మించి బీబీ కమల్  గా పిలువబడే బీబీ సయ్యదా హదియా బింట్ ఖాజీ సయ్యద్ షాబుద్దీన్ సుహ్రావర్ది, సూఫీ సాధువు సూఫీయిజం మరియు ఇస్లామిక్ ఆధ్యాత్మికతకు చేసిన గణనీయమైన కృషికి ప్రసిద్ధి చెందింది.

సూఫీ పీర్ ఖాజీ సయ్యద్ షాబుద్దీన్ సుహ్రవర్ది కుమార్తె బీబీ కమల్, కు 'కమల్' అనే బిరుదు కలదు  అనగా 'అద్భుతం' లేదా 'పరిపూర్ణత' అని అర్ధం.. బీబీ కమల్, 1274లో కాకో షరీఫ్‌కు తన పిల్లలు బీబీ దౌలతి మరియు షా అతుల్లా కాక్వి మరియు భర్త సుహ్రవర్దియా క్రమం నుండి ప్రముఖ సూఫీ సాధువు సులైమాన్ లంగర్ జమీన్ బిన్ షేక్ అబ్దుల్ అజీజ్ బిన్ ఇమామ్ ముహమ్మద్ తాజ్ ఫకీహ్ హష్మితో కలిసి నివాసం ఏర్పర్చుకొన్నది.

కాకో షరీఫ్‌లోని బీబీ కమల్ మందిరం ఒక ప్రముఖ తీర్థయాత్ర స్థలంగా మారింది, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను కోరుకునే అనుచరులను మరియు బీబీ కమల్ ఆధ్యాత్మిక బోధనలపై ఆసక్తి ఉన్న పరిశోధకులను ఆకర్షిస్తుంది.బీబీ కమల్ మందిరం ప్రార్థనా స్థలంగా మాత్రమే కాకుండా, సూఫీ అభ్యాసాల అధ్యయనానికి మరియు ఆధ్యాత్మిక అంతర్దృష్టులకు కేంద్రంగా కూడా పనిచేస్తుంది.

బీబీ కమల్ 1296లో మరణించారు మరియు బీబీ కమల్ సమాధి సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్, షేర్ షా సూరి మరియు యువరాణి జహాన్ అరా వంటి ప్రముఖ వ్యక్తులను ఆకర్షించింది, వారు బీబీ కమల్ సూఫీ  సాధువుకు నివాళులర్పించారు.

 

No comments:

Post a Comment