భారతదేశ
జైలు వ్యవస్థలో మానసిక ఆరోగ్యం తీవ్రంగా నిర్లక్ష్యం చేయబడిన కోణంగా ఉంది ఖైదు చేయబడిన వ్యక్తుల మానసిక అవసరాలు విస్మరించబడుతున్నాయి.
భారతీయ జైళ్లలో వేలాది మంది ఖైదీలు అత్యంత ప్రాథమిక మానసిక ఆరోగ్య సేవలను
పొందకుండా ఒంటరిగా బాధపడుతున్నారు.
రాఘవన్
మరియు రబియా (2018) పరిశోధన ప్రకారం, “ప్రిజన్ మెంటల్ హెల్త్ ఇన్ ఇండియా: రివ్యూ మానసిక రుగ్మతలు Prison Mental Health in India: Review,
psychiatric disorders”,: స్కిజోఫ్రెనియా, డిప్రెషన్, వంటి
మానసిక రుగ్మతలు భారతీయ ఖైదీలలో అసమానంగా ప్రబలంగా ఉన్నాయి. మరణించిన ఖైదీలపై
నిర్వహించిన ఒక అధ్యయనo ప్రకారం దాదాపు 8%
శవపరీక్షలలో మరణానికి ఆత్మహత్య కారణమని కనుగొన్నారు...2000 మరియు 2017 మధ్య,
భారతదేశంలో
కేవలం 12 పరిశోధన అధ్యయనాలు
మాత్రమే ప్రిజన్ మెంటల్ హెల్త్ సమస్యను క్రమబద్ధంగా అన్వేషించాయి,
ఖైదు
చేయబడిన వ్యక్తుల మానసిక ఆరోగ్యo జైలు వాతావరణం ద్వారా కూడా తీవ్రతరం అవుతుంది,. రద్దీ మరియు సిబ్బంది కొరత తో కూడిన భారతీయ జైళ్లు భావోద్వేగ
మరియు మానసిక ఒత్తిడికి నిలయాలు. గోప్యత లేకపోవడం, శారీరక
మరియు భావోద్వేగ హింసకు గురికావడం, ఎక్కువ
కాలం నిర్బంధంలో ఉండటం, చట్టపరమైన ఫలితాల గురించి
అనిశ్చితి, పేలవమైన పారిశుధ్యం మరియు
బయటి ప్రపంచంతో తగినంత సంబంధం లేకపోవడం ఇవన్నీ మానసిక ఒత్తిడిని పెంచుతాయి.
భారతదేశ
జైలు జనాభాలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది ఉన్న విచారణ ఖైదీలు
సంవత్సరాలుగా నిర్బంధించబడి,
విచారణ
కోసం ఎదురు చూస్తున్నారు.
2017 మానసిక ఆరోగ్య సంరక్షణ
చట్టం ప్రకారం స్పష్టమైన చట్టపరమైన ఆదేశం ఉన్నప్పటికీ, భారత జైళ్లలో మానసిక ఆరోగ్య సేవల స్థితి చాలా
తక్కువగా ఉంది. ఈ చట్టం ప్రకారం అన్ని రకాల జైలు వైద్య అధికారులు మానసిక ఆరోగ్య సంరక్షణలో
శిక్షణ పొందాలి మరియు ప్రతి రాష్ట్రంలో అంకితమైన మానసిక ఆరోగ్య సౌకర్యంతో కనీసం ఒక
జైలును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో వాస్తవికత వేరే కథ
చెబుతుంది.
ఇండియా
జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న 1,330 జైళ్లకు సేవ చేయడానికి కేవలం 25 మంది మనస్తత్వవేత్తలు లేదా మనోరోగ వైద్యులు
మాత్రమే అందుబాటులో ఉన్నారు - అంటే ప్రతి 22,929 మంది ఖైదీలకు ఒక మానసిక ఆరోగ్య నిపుణుడు మాత్రమే. ఇది
మోడల్ ప్రిజన్ మాన్యువల్ 2016 నుండి చాలా దూరంగా ఉంది, ప్రిజన్ మాన్యువల్ 2016 ప్రతి 500 మంది ఖైదీలకు ఒక ప్రొఫెషనల్‌ని సిఫార్సు చేస్తుంది.
25 రాష్ట్రాలు మరియు
కేంద్రపాలిత ప్రాంతాలలో జైలు సిబ్బందిలో మనస్తత్వవేత్తలు లేదా మనోరోగ వైద్యులు
లేరు. బన్సాల్ మరియు మోతియాని (2025)
ఇటీవల
నిర్వహించిన అధ్యయనం, ‘రీథింకింగ్ ఆన్ ది ఇంటర్‌ప్లే ఆఫ్ సబ్‌స్టెన్స్
అబ్యూస్ అండ్ మెంటల్ హెల్త్ ఇన్ ఇండియన్ ప్రిజన్స్: ఎ క్రిటికల్ అనాలిసిస్’, ప్రకారం దీర్ఘకాలిక నిధుల కొరత
మరియు శిక్షణ పొందిన నిపుణుల తీవ్రమైన కొరత సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి.
తీహార్
జైలులో ప్రవేశపెట్టబడిన విపశ్యన ధ్యానం మరియు సుదర్శన క్రియా యోగా ఖైదీల భావోద్వేగ
శ్రేయస్సుపై సానుకూల ప్రభావాలను ప్రదర్శించాయి.
తక్కువ భావోద్వేగ మేధస్సు మరియు బలహీనమైన కోపింగ్ మెకానిజమ్స్ ఉన్న వ్యక్తులు మానసిక విచ్ఛిన్నాలకు ఎక్కువగా గురవుతారు. అటువంటి ఖైదీలను గుర్తించి మద్దతు ఇవ్వగల శిక్షణ పొందిన కౌన్సెలర్లు లేదా సామాజిక కార్యకర్తలు లేకపోవడం మానసిక సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది.
ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి. మొదటిది, పూర్తి సమయం మానసిక వైద్య విభాగాలను జైళ్లలో,
ముఖ్యంగా పెద్ద కేంద్ర జైళ్లలో పొందుపరచాలి. రెండవది,
మానసిక ఆరోగ్య ప్రథమ చికిత్సలో జైలు సిబ్బందికి శిక్షణ
ఇవ్వడం. మూడవది, ముఖ్యంగా ప్రత్యేక
సంరక్షణ అవసరమయ్యే సందర్భాలలో ఖైదీలను సమీపంలోని మానసిక ఆరోగ్య సంస్థలతో
అనుసంధానించడానికి బలమైన రిఫెరల్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి,.
ఖైదీలందరికీ ప్రవేశ సమయంలో, శిక్ష సమయంలో మరియు విడుదలకు ముందు సాధారణ మానసిక అంచనాలను
ప్రవేశపెట్టడం కూడా అంతే ముఖ్యం. ఖైదీలలో
మానసిక సంక్షోభాన్ని
పరిష్కరించడానికి చట్టపరమైన మరియు విధాన చట్రాలు ఇప్పటికే ఉన్నాయి. మానసిక ఆరోగ్య
సంరక్షణ చట్టం నుండి మోడల్ జైలు మాన్యువల్ వరకు, సంరక్షణ భాష కాగితంపైనే ఉంది. అయితే,
ఈ ఆదేశాలను అమలు చేయగల పరిస్థితులు లేవు.
జైలులో ఉంచిన వారి మానసిక ఆరోగ్యాన్ని విస్మరించటం వారి ఆరోగ్య హక్కును ఉల్లంఘించడమే కాకుండా,
వ్యక్తుల సంస్కరణ మరియు పునరేకీకరణ అవకాశాన్ని కూడా
దెబ్బతీస్తుంది. ఇందుకు జైలు నిర్వాహకులు, మానసిక ఆరోగ్య నిపుణులు మరియు పౌర సమాజం కలిసి రావాల్సిన
సమయం ఆసన్నమైంది.
No comments:
Post a Comment