కన్నడ రచయిత్రి బాను ముష్తాక్ తన కన్నడ కథా సంకలనం 'హార్ట్ లాంప్' కు బుకర్ బహుమతిని గెలుచుకున్నారు.
గీతాంజలి శ్రీ మరియు అనువాదకురాలు డైసీ రాక్‌వెల్ రాసిన 'టూంబ్ ఆఫ్ సాండ్' (రెత్ కా సమాధి Ret ka Samadhi) నవలకు 2022 అవార్డు గెలుచుకున్న తర్వాత మూడు సంవత్సరాలలో అంతర్జాతీయ బుకర్ బహుమతిని గెలుచుకున్న
రెండవ భారతీయ పుస్తకం ఇది.
1950లలో కర్ణాటకలోని హసన్ పట్టణంలో మిడిల్ స్కూల్‌లో ఉన్నప్పుడు బాను ముష్తాక్ తన
మొదటి చిన్న కథను రాసింది. 77 ఏళ్ల రచయిత్రి, న్యాయవాది మరియు కార్యకర్త అయిన బాను
ముష్తాక్ అనువాదకురాలు దీపా భస్తితో కలిసి అంతర్జాతీయ బుకర్ బహుమతిని గెలుచుకోవడం
ద్వారా ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న మొదటి కన్నడ రచయిత్రిగా చరిత్ర
సృష్టించారు,
విజేత పుస్తకం ‘హార్ట్ లాంప్’, 30 సంవత్సరాల కాలంలో రాసిన 12 చిన్న కథల సంకలనం, ఇది కర్ణాటకలోని ముస్లిం మహిళల దైనందిన జీవితాలను అద్భుతంగా చిత్రీకరిస్తుంది.
ప్రపంచగా వ్యాప్తంగా పోటికి వచ్చిన ఉన్న ఐదు ఇతర పుస్తకాలను అధిగమించి విజేత గా నిలిచినది.ఆంగ్లంలోకి
అనువదించబడిన ఉత్తమ ఫిక్షన్ వార్షిక బహుమతిని గెలుచుకున్న మొదటి చిన్న కథా సంకలనం ‘హార్ట్
లాంప్’.
హార్ట్ లాంప్ పుస్తకం ఇంగ్లిష్ అనువాదకరాలుదీపా భస్తి ఇంటర్నేషనల్ బుకర్ గెలుచుకున్న తొలి భారతీయ
అనువాదకురాలిగా నిలిచింది.రచయిత మరియు అనువాదకుడు ఒక్కొక్కరికి 25,000 పౌండ్లు అందుకుంటారు.
బుకర్ ప్రైజ్ సంస్థ ప్రకారం "దక్షిణ
భారతదేశంలోని ముస్లిం సమాజాలలో మహిళలు మరియు బాలికల దైనందిన జీవితాలను బాను ముష్తాక్
అద్భుతంగా చిత్రికరించారు.‘హార్ట్ లాంప్’ కన్నడ ముస్లిం మహిళల
జీవితాలు, పునరుత్పత్తి హక్కులు, విశ్వాసం, కులం, అధికారం మరియు అణచివేత గురించి వివరిస్తుంది’.
కర్ణాటకలో ప్రసిద్ధ పేరున్న భాను ముష్తాక్ 1970లలో రచనలు ప్రారంభించి,
మహిళల హక్కులు మరియు స్వేచ్ఛల కోసం
బహిరంగంగా పోరాడి, బెదిరింపులు, సామాజిక బహిష్కరణలు మరియు కత్తి దాడి నుండి బయటపడి సాహిత్యలోకం లో తన
స్థానాన్ని సంపాదించుకుంది.
No comments:
Post a Comment