1928 నవంబర్ 9న లక్నో సైమన్ కమిషన్ సందర్శించవలసి
ఉంది. భారత జాతీయ కాంగ్రెస్ సమ్మెలు, నినాదాలు
మరియు ఇతర పద్ధతులతో సైమన్ కమిషన్ రాకను వ్యతిరేకంగా
నిరసన తెలపాలని నిర్ణయించింది. జవహర్‌లాల్ నెహ్రూ, గోవింద్
వల్లభ్ పంత్, గౌరీ శంకర్ వంటి నాయకులు సైమన్
కమిషన్ రాకను వ్యతిరేకించే నిరసన ప్రదర్శనలలో పాల్గొంటున్నారు.
మహముదాబాద్‌కు చెందిన
మహారాజా సర్ మొహమ్మద్ అలీ మొహమ్మద్ ఖాన్ కూడా సైమన్ కమిషన్ వ్యతిరేక నిరసనలకు తెరవెనుక నుండి
నాయకత్వం వహిస్తున్నాడని బ్రిటష్ ఇండియా పోలీసులు అనుమానించారు.
1928 డిసెంబర్ 5న
కమిషన్ సభ్యుల గౌరవార్థం తాలూక్దార్లు (భూస్వాములు) టీ పార్టీ ఏర్పాటు చేయాలని
నిర్ణయించారు. ఈ పార్టీ గురించి ఏమి చేస్తున్నారని మహముదాబాద్‌కు చెందిన మహారాజా సర్
మొహమ్మద్ అలీ మొహమ్మద్ ఖాన్ కాంగ్రెస్ నాయకులను అడిగాడు
ఆ కాలంలో లక్నోలో అత్యంత
ఉన్నత స్థాయి కాంగ్రెస్ నాయకులలో ఒకరైన చౌదరి కహ్లికుజ్జామాన్, ప్రకారం సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా మహముదాబాద్ మహారాజు ఒక
కొత్త తరహా నిరసనను సూచించినారు అని తెలిపారు.
"సైమన్ గో బ్యాక్" అని వ్రాసి ఉన్న గాలిపటాలు మరియు బెలూన్లను ఎగురవేయమని
మహారాజా సూచించారు. గాలిపటాలు మరియు
బెలూన్ల ఎగిరివేత పథకం ఖరారు చేయబడింది
మరియు అవసరమైన సామాగ్రి కోసం మహారాజా
నిధులు సమకూర్చారు. షెడ్యూల్ చేసిన తేదీన, )
టీ పార్టీ జరిగే ప్రదేశం కైసర్‌బాగ్ ఆకాశం గాలిపటాలు మరియు బెలూన్‌లతో నిండి ఉంది.
గాలిపటాలు టీ పార్టీ వేదిక వద్ద ఎగిరేల చేయబడ్డాయి. ఆ విధంగా, రాకకు వ్యతిరేక సందేశాన్ని నేరుగా సైమన్ కమిషన్‌కు అందించారు.
మహముదాబాద్ మహారాజా కమిషన్‌కు
వ్యతిరేకంగా ఏదో పథకం వేస్తున్నాడని పోలీసులకు నిఘా సమాచారం అందింది మహముదాబాద్ మహారాజు
ఇంటిని గట్టి నిఘాలో ఉంచారు. ఇంట్లో ఉన్నవారిని గృహ నిర్బంధంలో ఉంచారు.
కాంగ్రెస్ మరియు దాని సానుభూతిపరులు
కౌన్సిల్‌లో భారతీయులకు, ముఖ్యంగా మహముదాబాద్ మహారాజాకు
అగౌరవం కలిగించే అంశాన్ని లేవనెత్తారు. అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్) నుండి
ముద్రించబడిన జాతీయవాద వార్తాపత్రిక ది పయనీర్, 1928 డిసెంబర్ 19న
ప్రచురించబడిన ఒక నివేదికలో,
"మహ్ముదాబాద్
మహారాజు ప్రాంతీయ రాజకీయాల్లోనే కాకుండా భారతదేశం అంతటా ప్రసిద్ధ వ్యక్తి. సాధారణ
దుస్తులలో ఉన్న పోలీసులు మహారాజ గదుల్లో ఒకదాన్ని ఆక్రమించారు మరియు మహారాజను ఆయన కుటుంబం
మరియు సిబ్బంది అవమానానికి గురయ్యారు." అని పేర్కొంది.
అలహాబాద్ (ఇప్పుడు, ప్రయాగ్‌రాజ్) నుండి ప్రచురితమైన ది లీడర్, సైమన్ కమిషన్ బహిష్కరణ
ఉద్యమ నాయకులలో ఒకరైన మహముదాబాద్ మహారాజు ను పోలీసులు తమ చర్యల ద్వారా అనుమానించి
అవమానించారు అని నివేదించింది.
ఇండియన్ డైలీ మెయిల్ ప్రకారం యునైటెడ్ ప్రావిన్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మహముదాబాద్ మహారాజాపై పోలీసుల క్రూరత్వ అంశాన్ని కాంగ్రెస్ నాయకుడు చింతామణి
లేవనెత్తినారు. మిస్టర్ చింతామణి మాట్లాడుతూ “తన వద్ద ఉత్తర ప్రత్యుత్తరాలు మరియు
ఛాయాచిత్రాలు ఉన్నాయని, అవి మహారాజా మరియు అతని కుటుంబ సభ్యులు దాదాపుగా పోలీసు కస్టడీలో ఉన్నారని
నిశ్చయంగా నిరూపించాయి. స్పష్టంగా మహారాజా తప్పు ఏమిటంటే,
అతను దేశ ప్రయోజనాలను ఐక్యతను నాశనం చేయడానికి ప్రయత్నించే
మతవాదుల శ్రేణిలో చేరడానికి నిరాకరించాడు. మోతిలాల్ నెహ్రూ నివేదికకు మద్దత్తు
పలికాడు ” అని పేర్కొన్నారు. చింతామణి
నేతృత్వంలోని కౌన్సిల్‌లోని భారతీయ సభ్యులు పోలీసు చర్యకు వ్యతిరేకంగా ఒక
తీర్మానాన్ని ఆమోదించారు.
No comments:
Post a Comment