31 May 2025

అమ్రోహా నుండి ఇస్రో వరకు ఖుష్బూ మీర్జా అద్భుతమైన ప్రయాణం Khushboo Mirza's incredible journey from Amroha to ISRO

 

భారతీయ ముస్లిం మహిళ విద్యాసాదికారికత:

ఉత్తరప్రదేశ్‌లోని పట్టణం అమ్రోహా నుండి వచ్చిన ఖుష్బూ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్ర అన్వేషణ కార్యక్రమంలో కీలక పాత్ర వహించుట ద్వారా జాతీయ స్థాయికి ఎదిగింది. అమ్రోహా దేశానికి ఖుష్బూ మీర్జా వంటి శాస్త్రీయ మనస్సును బహుమతిగా ఇచ్చింది అని అమ్రోహా పట్టణ వాసులు గర్వపడతారు.ఖుష్బూ మీర్జా అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం యొక్క గర్వించదగిన పూర్వ విద్యార్థిని,

ఖుష్బూ మీర్జా ఏడేళ్ల వయసులో తండ్రి సికందర్ మీర్జాను కోల్పోయినది కానీ తల్లి, ఫర్హత్ మీర్జా తన దివంగత భర్త పెట్రోల్ పంపును నిర్వహిస్తూ, ముగ్గురు పిల్లలను అందుబాటులో ఉన్న ఉత్తమ పాఠశాలల్లో చేర్పించింది మరియు ముగ్గురు పిల్లలు ఇంజనీర్లు కావాలనే తన భర్త కలను గౌరవించింది.

ఖుష్బూ 2006లో AMU నుండి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బంగారు పతకంతో పట్టభద్రురాలైంది. ఖుష్బూ వాలీబాల్ క్రీడాకారిణి కూడా మరియు ముఖ్యంగా AMU చరిత్రలో విద్యార్థి సంఘం ఎన్నికలలో పోటీ చేసిన మొదటి మహిళ.

AMU నుండి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన తరువాత ఖుష్బూ ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరింది, చివరికి చంద్రయాన్-1 మిషన్ కోసం చెక్అవుట్ బృందానికి నాయకత్వం వహించింది చంద్రయాన్-1 మిషన్ చంద్రుని ఉపరితలంపై నీటి ఉనికిని నిర్ధారించింది. ఖుష్బూ చంద్రయాన్-1 మిషన్ బృందంలోని అతి పిన్న వయస్కురాలు మాత్రమే కాదు, మిషన్ విజయానికి కీలక పాత్ర పోషించింది.

ఖుష్బూ తరువాత చంద్రయాన్-2 కు దోహదపడింది మరియు 2015లో ఇస్రో టీమ్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించబడింది. నేడు, ఖుష్బూ ఇస్రో యొక్క ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో సేవలందిస్తోంది, భారతదేశ ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యక్రమంలో తన పనిని కొనసాగిస్తోంది.

నేడు, ఖుష్బూ ఉత్తరప్రదేశ్‌లోని పాఠశాలలు మరియు కళాశాలలలో గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాలలో బాలికల విద్య కోసం ప్రసంగించడానికి తరచూ అతిథి వక్తగా ఆహ్వానిoచబడుతుంది. ముస్లిం బాలికలు STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు గణితం)లో ఉన్నత విద్య మరియు కెరీర్‌లను కొనసాగించాలని ఖుష్బూ ప్రోత్సహిస్తుంది. బాలికలు ఇప్పుడు ఖుష్బూ నుండి ప్రేరణ పొంది ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లలో చేరుతున్నారు.

"చంద్రయాన్ ఎక్కడ ప్రస్తావించబడినా, ఖుష్బూ మీర్జా పేరు అక్కడ తప్ప్రక స్తావించబడుతుంది. ఖుష్బూ కథ దేశవ్యాప్తంగా ఉన్న ప్రయోగశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు బోర్డు గదులలో మహిళలకు స్పుర్తిదాయకం.

ఒక చిన్న పట్టణం అమ్రోహా నుండి ఇస్రో మరియు చంద్రుని వరకు ఖుష్బూ మీర్జా ప్రయాణం విద్య యొక్క పరివర్తన శక్తికి నిదర్శనం.

No comments:

Post a Comment