1 June 2025

1,000 సంవత్సరాల తరువాత, దర్బ్ జుబైదా ఇప్పటికీ మక్కా ప్రయాణికులకు సేవలు అందిస్తోంది 1,000 years on, Darb Zubaydah still serves travelers to Makkah

 


అరేబియా ద్వీపకల్పంలోని అత్యంత ప్రముఖ చారిత్రక రహదారులలో ఒకటైన దర్బ్ జుబైదా, ఇరాక్‌లోని కుఫా నుండి ఉత్తర సౌదీ అరేబియా మీదుగా మక్కా వరకు విస్తరించి, సౌది అరేబియా ఉత్తర సరిహద్దు ప్రాంతంలోని రఫ్హా సమీపంలో వెళుతున్న ప్రధాన ఇస్లామిక్-యుగ హజ్ మార్గంగా పరిణామం చెందింది.

సుమారు 1,400 కిలోమీటర్లు విస్తరించి ఉన్న దర్బ్ జుబైదా లేదా జుబైదా రహదారి హజ్ తీర్థయాత్రలకు  మరియు బంజరు ఎడారుల గుండా ప్రయాణాన్ని సులభతరం చేసింది, ఇస్లామిక్ నాగరికత ఇంజనీరింగ్ వైభవానికి  దర్బ్ జుబైదా ఉదాహరణగా నిలిచింది.

మొదటి అబ్బాసిద్ కాలిఫేట్ యుగంలో దర్బ్ జుబైదా అత్యంత ముఖ్యమైన హజ్ మరియు వాణిజ్య మార్గాలలో ఒకటిగా మారింది. ఖలీఫా అబూ జాఫర్ అల్-మన్సూర్ మనవరాలు మరియు ఖలీఫా హరున్ అల్-రషీద్ భార్య అయిన క్వీన్ జుబైదా పేరు మీద దర్బ్ జుబైదా  రహదారి పేరు పెట్టబడింది.

దర్బ్ జుబైదా రహదారి మౌలిక సదుపాయాలకు క్వీన్ జుబైదా చాలా నిధులు సమకూర్చింది, దర్బ్ జుబైదా రహదారి ప్రణాళిక బద్దంగా ఏర్పాటు చేయబడిన స్టేషన్లు, విశ్రాంతి స్థలాలు మరియు నీటి సేకరణ వ్యవస్థలకు ప్రసిద్ధి చెందింది.

176 AH సంవత్సరంలో హజ్ యాత్రకు రాణి జుబైదా తన ప్రయాణంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాత దర్బ్ జుబైదా రహదారి నిర్మించాలనే ఆలోచనకు  వచ్చింది. ఆ తర్వాత రాణి జుబైదా లోయల మార్గాల్లో విశ్రాంతి ప్రాంతాలు మరియు చెరువులను చక్కగా వ్యవస్థీకృత పద్ధతిలో నిర్మించాలని ఆదేశించింది, వర్షపు నీరు, వాగులు మరియు నీటి కాలువలలో ప్రవాహాన్ని సేకరించడానికి సహాయపడింది.దారి  పొడవునా, ప్రయాణికులకు చెరువులను నిర్మించారు మరియు యాత్రికుల కోసం నీటిని సేకరించడానికి ప్రణాళికాబద్ధమైన వ్యవధిలో ఏర్పాట్లు చేశారు.

నీటి సరఫరాను అందించడానికి లోతైన బావులను తవ్వారు. రోడ్డు మార్గాన్ని సూచించడానికి నిర్దిష్ట దూరంలో రాతి గుర్తులు ఏర్పాటు చేయబడినవి. సాధారణంగా యాత్రికులకు మరియు ప్రయాణికులకు మార్గనిర్దేశం చేయడానికి నీటి వనరులు మరియు కూడళ్ల దగ్గర జెండాలు ఏర్పాటు చేయబడ్డాయి.జెండాలు సాధారణంగా మార్గం మధ్యలో ఉంచబడ్డాయి మరియు దూరం నుండి సులభంగా కనిపించేలా ఉంచబడ్డాయి.

దర్బ్ జుబైదా ముఖ్యమైన చారిత్రక మరియు ఇంజనీరింగ్ లక్షణాలను కలిగి ఉంది.మక్కాకు పురాతన మార్గాలలో ఒకటైన జుబైదా రహదారి యాత్రికులకు సేవ చేయడంలో మరియు ఎడారి మార్గాలను నిర్వహించడంలో తోడ్పడినది.  

2022లో సౌదీ అరేబియా దర్బ్ జుబైదా రహదారి ను UNESCO ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడానికి సమర్పించింది.

"అబ్బాసిద్ కాలంలో మక్కాను ఇరాకీ నగరాలైన కుఫా మరియు బాగ్దాద్‌లకు అనుసంధానించిన రహదారిని దర్బ్ జుబైదా (జుబైదా రహదారి ) అని పిలుస్తారు, అబ్బాసిద్ ఖలీఫా హరున్ అల్-రషీద్ భార్య జుబైదా బింట్ జాఫర్, కాలిబాట వెంట ఉన్న అనేక స్టేషన్లలో దాతృత్వ పనులకు మద్దతు ఇచ్చారు. ఇది 750 నుండి 850 CE మధ్య అబ్బాసిద్ ఖలీఫా సమయంలో అత్యంత ముఖ్యమైన హజ్ మార్గం, ఇది ముస్లిం నాగరికత యొక్క స్వర్ణయుగంగా ప్రసిద్ధి చెందింది" అని UNESCO దర్బ్ జుబైదా పరిచయంలో పేర్కొన్నది.

"అబ్బాసిద్ ఖలీఫా - 8వ శతాబ్దం చివరి నుండి 10వ శతాబ్దం ప్రారంభం వరకు ఉత్తర ఆఫ్రికా నుండి చైనా పశ్చిమ సరిహద్దుల వరకు విస్తరించి ఉన్న విస్తారమైన సామ్రాజ్యాన్ని పాలించింది అని UNESCO పేర్కొన్నది.

దర్బ్ జుబైదాపై నిర్మించడం అనేది శక్తివంతమైన మరియు సంపన్న వ్యక్తులు దాతృత్వంలో పోటీ పడటానికి ఒక మార్గంగా ఎలా మారిందో యునెస్కో మరింత వివరించినది. విశ్రాంతి గృహాలు, బావులు మరియు నీటి కుంటలకు వాటి స్పాన్సర్ల పేరు పెట్టారు, ఇది సంపన్న దాతల మధ్య నిజమైన పోటీని పెంచింది.

"'జుబైదా' మరణం తర్వాత శతాబ్దంలో, కుఫా-మక్కా రహదారిపై ఉన్న అనేక ఆశ్రయాలు, హాస్టళ్లు, బావులు మరియు జలాశయాలను 'జుబైదా' లేదా 'ఉమ్ జాఫర్' అని పిలిచేవారు, అని యునెస్కో పేర్కొన్నది. .

 

No comments:

Post a Comment