చెన్నై, తమిళనాడు :
చెన్నైలో యహ్యా అలీ వీధి ఉంది. ఇది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది. దీనిని "యాహాలి" అని కూడా పిలుస్తారు. యాహలి వీధి ఒక ముఖ్యమైన ప్రదేశం మరియు చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. యహ్యా అలీ వీధి- 1,2,3, ఉన్నాయి ఇవి అన్ని అన్నా సాలైని GN చెట్టి రోడ్డుతో టేనంపేట వద్ద కలుపుతాయి.
చెన్నై లోని యాహ్యా అలీ స్ట్రీట్ మద్రాస్
హైకోర్టుకు చెందిన జస్టిస్ యాహ్యా అలీ పేరు నుండి వచ్చింది.యాహ్యా అలీ ఆగస్టు 1893లో నెల్లూరులో జన్మించారు, యాహ్యా అలీ తండ్రి హైదరాబాద్ నిజాంల ఆర్థిక విభాగంలో
అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేశారు. యాహ్యా అలీ 1916లో ప్రెసిడెన్సీ కళాశాల నుండి చరిత్ర మరియు ఆర్థిక
శాస్త్రంలో పట్టభద్రుడయ్యారు మరియు తరువాత న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. యాహ్యా
అలీ నెల్లూరులో ప్రాక్టీస్‌ను ప్రారంబించి ప్రభుత్వ న్యాయవాది మరియు పబ్లిక్
ప్రాసిక్యూటర్ అయ్యారు. యాహ్యా అలీ మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సబ్యునిగా పనిచేసారు.
యాహ్యా అలీ నెల్లూరు మునిసిపాలిటీ చైర్మన్ అయ్యారు.
1926లో, యాహ్యా అలీ జిల్లా న్యాయమూర్తి అయ్యారు, ఆ హోదాలో మద్రాస్ ప్రెసిడెన్సీలోని వివిధ ప్రాంతాలకు
నియమించబడ్డారు. ఆర్థిక విషయాలలో యాహ్యా అలీ కున్న ప్రత్యేకత కారణంగా 1942లో అప్పటి ఇంపీరియల్ ప్రభుత్వం యాహ్యా అలీ ను అప్పిలేట్ ఇన్‌కమ్
టాక్స్ ట్రిబ్యునల్ ఛైర్మన్‌గా నియమించింది,
యాహ్యా అలీ "ఆదాయపు పన్ను చట్టం మరియు విధానాలపై పూర్తి మరియు సమగ్రమైన
జ్ఞానాన్ని కలిగి ఉన్నారు". 1945లో యాహ్యా అలీ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు. యాహ్యా
అలీ ఏప్రిల్ 21, 1949న అనారోగ్యానికి
గురై,
మరణించడం జరిగింది. 1949లో యాహ్యా అలీ సిట్టింగ్ జడ్జిగా మరణించినప్పుడు,
హైకోర్టు ఆయన మరణానికి సంతాపం తెలియజేయడానికి సమావేశమైంది.
యాహ్యా అలీ తెలుగు కవిత్వం లో నిష్ణాతుడు మరియు సంస్కారవంతుడు.
యాహ్యా అలీ తేనాంపేట మసీదుకు ముతవల్లి (ట్రస్టీ లేదా సంరక్షకుడు)గా ఉన్నారు, తేనాంపేట మసీదు ఆవరణలోనే యాహ్యా అలీని ఖననం చేశారు. ఒక ప్రాంతానికి యాహ్యా అలీ పేరు పెట్టారు.
No comments:
Post a Comment