బఖర్ ఈద్ లేదా బక్రీదు పండుగను అరబ్బి లో ఈద్ అల్-అజ్ హా లేదా ఈదుజ్జుహా అని అందురు. అల్లాహ్ ఆదేశం ప్రకారం ఇబ్రాహీం ప్రవక్త తనకుమారుడైన ఇస్మాయీల్ ను బలి ఇవ్వడానికి తీసుకెళ్ళే సాంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచంలోని ముస్లింలు ఈ పండుగను జరుపు కొంటారు. ఈ పండుగకు ప్రామాణికం ఖురాన్.
ఇస్లామీయ కేలండర్ ప్రకారం 12వ నెల యైన జుల్ హజ్జా 10వ తేదీన ఈ పండుగ జరుపుకొంటారు. ఈ పండుగ రంజాన్ పండుగ జరిగిన 70 రోజుల తరువాత జరుపుకుంటారు. ఈ పండుగను 3 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ నెలలోనే హజ్ తీర్థయాత్రగూడా చేస్తారు. ఈ యాత్రకొరకు సౌదీ అరేబియా లోని మక్కా నగరానికి వెళ్ళి మస్జిద్-అల్-హరామ్ లోని కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు.
పండుగ రోజు స్త్రీలు, పురుషులూ, పెద్దలు మరియు పిల్లలూ క్రొత్త బట్టలు ధరించడం ఈద్ నమాజ్ కు తయారు గావడం చేస్తారు తక్బీర్ ను పఠిస్తూ ప్రార్థనలకు పోవడం రివాజు మరియు ఈద్ గాహ్ లలో ఈద్ నమాజ్ ను ఆచరించడం ఈద్ ముబారక్ శుభాకాంక్షలు ఒకరినొకరు తెలుపుకోవడం చేస్తారు.
బక్రీదు పండుగనాడు ప్రార్థనలు ఖుత్బా (ధార్మిక ప్రసంగం) తో ప్రారంభమౌతుంది. ఖుర్బానీ ఇవ్వడం (పెంపుడు జంతువులు గొర్రె, మేక, పొటేలు ఎద్దు లేదా ఒంటె లను అల్లాహ్ మార్గమున ఇబ్రాహీం ప్రవక్త సంస్మణార్థం బలి ఇవ్వడం) జరుగుతుంది. ఈ ఖుర్బానీ ఇవ్వబడిన మాంసముము మూడు భాగాలు చేసి ఒక భాగము తమకొరకు ఉంచుకొని, రెండవభాగము బంధువులకు మరియు స్నేహితులకునూ, మూడవభాగము పేదలకు పంచుతారు. ఖుర్బానీ మాంసమును ప్రజలకు పంచడం ఈద్ లోని భాగం.
ఈదుల్ అజ్ హా(బక్రీద్) ను
ఒక్కక్క దేశం లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు.
మొరాకో, అల్జీరియా, ట్యునీషియా, ఈజిప్టు, మరియు లిబియా మొదలగు దేశాలలో 'ఈద్ అల్-కబీర్' అని,భారతదేశం, పాకిస్తాన్ లో 'బడీ ఈద్' లేదా బక్రీద్ అని,బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా లో'ఖుర్బానీ ఈద్' అని టర్కీ, అజర్‌బైజాన్ లో, 'కుర్బాన్ బైరామి' అని, రష్యా లో 'కుర్బాన్ బైరామ్' అని, ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ లో'ఈద్ ఎ ఖోర్బాన్' అని, చైనా మరియు ఉయ్ ఘుర్ భాషలో'కుర్బాన్ ఈత్' అని, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా మరియు బ్రూనై లో'ఈదుల్ అద్ హా' అని పిలుస్తారు.
బక్రీద్ పండుగ రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 మిలియన్ జంతువులను బలి (ఖుర్బాని) ఇవ్వడం జరుగుతుంది. ఒక్క పాకిస్తాన్ లోనే సుమారు 10 మిలియన్ జంతువులను ఖుర్బానీ ఇవ్వడం జరుగుతుంది. పండుగ రోజు పేదవారికి ఖుర్బాని మాంసం లబించేటట్లు చూడటం జరుగుతుంది. ఖుర్బానీ సొంతం గా ఇవ్వగల స్తోమత లేని కొంతమంది కలసి ఒక సమూహంగా ఏర్పడి ఖుర్బానీ ఇచ్చి ఖుర్బానీ మాంసం ను పేదవారికి పంచుతారు. కొన్ని దేశాలలో ఈ పండుగను ఐదు రోజులు చేస్తారు, మొదటి రోజు ఖుర్బానీ మరియు ప్రార్ధనలు చేస్తారు మిగతా నాలుగు రోజులు ప్రార్ధనలతో గడుపుతారు. బక్రీద్ పండుగ రోజు ప్రత్యెక మాంస వంటకాలు చేస్తారు.
ఈద్-ఉల్-అదా పండుగ రోజు ముస్లింలు ఖుర్బానీ ఇవ్వబడిన జంతువు మాంసం తో రకరకాల వంటకాలు చేస్తారు. స్నేహితులకు,బంధువులకు మాంస వంటకాలు బహుమతిగా ఇస్తారు. కార్జ్యం వేపుడు , మాంసం కబాబులు, హలీం, ఖుర్మా మొదలగు పదార్ధాలు చేస్తారు.
పలావ్,బిర్యానీ వంటకాలు దక్షిణ ఆసియా దేశాలలో
ప్రసిద్ది. టర్కీ దేశం మరియు బాల్కన్ దేశాలలో
లో కార్జ్యం (liver) తో చేయబడిన కోకోరి లోకప్రియమైన వంటకం. సాఫ్ట్
డ్రింక్స్ తీసుకొంటారు. టర్కీ లో రాజధాని అంకారా లోని అతి పెద్ద మస్జిద్ కోకాట్పి
మసీదులో పెద్ద సంఖ్య లో ముస్లింలు ప్రార్ధనలు నిర్వహించెదరు మరియు వేలాది
జంతువులను ఖుర్బాని ఇచ్చెదరు
అమెరికా లో ఈద్-అల్-అదా సెలవ రోజు
కానప్ప్పటికి కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించును లేదా పని గంటలు
తగ్గించును. ఇక్కడ ఈద్-అల్-అదా మూడు రోజులు
పాటు నిర్వహించబడును.
అమెరికా/కెనడా/ఆస్ట్రేలియా/బ్రిటన్ లోని ముస్లింలు పండుగ రోజు మస్జిద్/సమావేశ హాల్స్ లో తమ కుటుంభ సబ్యుల తో కలసి నూతన వస్త్రాలు ధరించి ప్రార్ధనలు, సాంఘిక సమావేశాలలో గడిపెదరు.పండుగ రోజు అనేక చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడును. అమెరికా లోని చికాగో, ఓర్లాండో, మొదలగు ప్రాంతాలలో నివసిస్తున్న ఉత్తర ఆఫ్రికా, భారత ఉపఖండము, తూర్పు యూరప్ కు చెందిన ముస్లిం లు తమ సాంప్రదాయకదుస్తులు దరించి ప్రార్ధనలలో పాల్గోనేదరు మరియు సముహ విందులను ఏర్పాటు చేసి తమ సాంప్రదాయక భోజన పదార్ధాలను ఆరగించేదరు. పేదలకు ఆహార పదార్ధాలను, నగదు/వస్తువులను బహుమతులు గా పంచేదరు. అమెరికా ముస్లిం లు వ్యాపార, విద్యా, సామాజిక రంగాలలో అమెరికా పురోభివృద్ది కి సహాయపడిన దానికి గుర్తుగా గత సంవత్సరాలలో అమెరికా ప్రభుత్వం రంజాన్,బక్రీద్ పండుగల సందర్భం గా ప్రత్యెక తపాల బిళ్ళలు జారి చేసింది.
ఇరాన్ లో ముస్లింలు దీనిని 3వ అతి ముఖ్యమైన పండుగగా
జరుపుకొంటారు. ఇరాన్, ఇరాక్ దేశాల లో మరియు మద్య ఆసియా ప్రాంతాలలోని ముస్లింలు
నూతన వస్త్రాలు ధరించి ఈద్-అల్-అదా రోజు ప్రార్ధనలతో గడుపుతారు మరియు ఖుర్బాని కార్యక్రమం లోపాల్గొంటారు.
ఆవు/పోటేల్/ఒంటె/గొర్రె ను అల్లాహ్ పేర ఖుర్బాని ఇవ్వడం చేస్తారు. స్నేహితులతో,
బంధువులతో గడుపుతారు. బీదవారికి బహుమతులు, ఆహారపదార్ధాలు,నగదు సహాయం చేస్తారు.
అదేవిధంగా భారత,బంగ్లాదేశ్, పాకిస్తాన్ లలోని ముస్లిం లు కుడా నూతన వస్త్రాలను ధరించి, ఈద్గా లలో నమాజ్ చదివి, జంతువులను ఖుర్భాని ఇస్తారు, ఖుర్బాని మాంసమును స్నేహితులకు, బంధువులకు, బీదవారికి పంచుతారు మరియు ఈద్ ముబారక్ తెల్పుతూ అత్యంత ఉత్సాహం తో పండుగ రోజు గడుపుతారు.
కొన్ని దేశాలలో పిల్లలకు బహుమతులు, తీపి
పదార్ధాలు, నగదు ఈది గా ఇవ్వబడుతుంది మరికొన్ని చోట్ల పేదవారికి పండుగ “ఈదిగా” బహుమతులు ఇవ్వబడతాయి.కొంతమంది ఈ నెలలో హజ్ యాత్ర చేస్తారు. ఇందుకుగాను అనేక దేశాలలో ప్రత్యెక హజ్
ప్యాకేజ్ టూర్స్ నిర్వహిoచబడతాయి.ఇండోనేషియా, జోర్డాన్, మలేషియా, టర్కీ,అరబ్
ఎమిరేట్స్ లాంటి దేశాలలో పండుగ రోజు జాతీయ సెలవ దినం గా ప్రకటించబడుతుంది.
రష్యా మరియు మద్య ఆసియా ప్రాంతాలలో లో ఈద్-ఉల్-అదా
పండుగను 'కుర్బాన్
బైరామ్' అని అందురు. ఈ పండుగ రష్యా లో మూడు రోజులపాటు
జరపబడును.పండుగ రోజు మాస్కో నగరం లోని అన్ని మస్జిద్లు అనగా మాస్కో కoగ్రెషనల్ మస్జిద్(సెంట్రల్ మాస్కో),మాస్కో క్యాతేడ్రల్ మస్జిద్
మొదలగునవి మరియు ఇతర ప్రార్ధన స్థలాలు అన్ని
ప్రార్ధనల కోసం ముస్లిం లతో నిండి పోవును. ప్రార్ధనల అనంతరం
జంతువులను బలి (ఖుర్బానీ)ఇచ్చెదరు, ఖుర్బాని మాంసం స్నేహితులు, బంధువులు మద్య
పంచబడును.మాస్కో లో 20 లక్షల మంది ముస్లిం లు ఉన్నారు.రష్యా ప్రధాని మేద్విడేవ్
మరియు అద్యక్షుడు పుతిన్ రష్యన్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపినారు.
చైనా లోని లక్షలాది ముస్లిం లు సాంప్రదాయక కోర్బాన్ లేదా ఈద్-ఉల్-గుర్బాన్ లేదా ఈద్-ఉల్-అదా పండుగను సాంప్రదాయక పద్దతులలో జరుపుకొందురు. ఉదయాన్నే మస్జిద్ లకు చేరి ప్రార్ధనలను నిర్వహించెదరు. చైనా లోని నాలుగు ముస్లిం తెగలు తమ తమ సంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా ఈద్-ఉల్-అదా పండుగను నిర్వహించెదరు. చైనా లోని వాయువ్య ప్రాంతం లో ముస్లింలు అధికం గా ఉన్నారు.
కుటుంబ సబ్యులందరూ,స్నేహితులు, బంధువులతో కలసి పండుగ ఉత్సవాలలో పాల్గొందురు. ఈద్-ఉల్-అదా సందర్భంగా పిండివంటలు తయారు చేయబడును. పురుషులు ఉదయాన్నే లేచి ప్రార్ధనలకు వెళ్ళెదరు. ప్రార్ధనల అనంతరం ఖుర్బాని ఇవ్వబడును ఖుర్బాని మాంసం ను మూడు భాగాలు చేసి ఒక భాగం కుటుంబమునకు, రొండోవ భాగం స్నేహితులు, బంధువులు, మూడోవ భాగం అభాగ్యులకు, బీధవారికి పంచబడును. చైనా లో సుమారు రెండు కోట్ల మంది ముస్లిం లు ఉన్నారు. కమ్యునిస్ట్ పార్టి తరుపున ఈద్ శుభాకాంక్షలు అందచేయబడును.
దాదాపు అన్ని
దేశాలలోని ముస్లింలు తమ తమ సాంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా ఈద్-ఉల్-అదా పండుగను
నిర్వహించెదరు. ప్రార్ధనలలో పాల్గొందురు.జంతువులను ఖుర్బాని యిచ్చేదరు. రకరకాల
పదార్ధాలతో వంటకాలు చేయుదురు. పూర్వికులను స్మరించుకొందురు. స్నేహితులు, బంధువులతో
సమయం గడిపెదరు. కుటుంబ సబ్యులకు,పిన్నలకు బహుమతులు (ఈది) కానుకలు ఇచ్చెదరు. సంతోషం
గా కాలం గడిపెదరు.
No comments:
Post a Comment