ఖడక్వాస్లాలోని నేషనల్
డిఫెన్స్ అకాడమీ (N.D.A) 1954లో స్థాపించబడినప్పుడు మేజర్ జనరల్
ఎనైత్ హబీబుల్లా దాని మొదటి కమాండెంట్.
రెండవ ప్రపంచ యుద్ధం
ముగిసే సమయానికి, పశ్చిమ ఎడారి Western
Desert లో మరియు ఇతర ప్రాంతాలలో భారత సైన్యం అందించిన సేవలకు స్మారక చిహ్నం నిర్మాణం
కోసం సూడాన్ ప్రభుత్వం £100,000 బహుమతిగా
ఇచ్చింది. 1945లో, భారత ప్రభుత్వం ఈ
స్మారక చిహ్నాన్ని మూడు సర్వీసుల భవిష్యత్ అధికారులకు విద్య మరియు శిక్షణ ఇచ్చే
అకాడమీ రూపంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నాలుగు సంవత్సరాల తరువాత, 1949లో, అకాడమీని
డెహ్రాడూన్‌లోని తాత్కాలిక గుడిసెలలో ఏర్పాటు చేశారు, ఖడక్వాస్లాలో
శాశ్వత భవనం నిర్మాణం చేపట్టారు. ఆరు సంవత్సరాల తరువాత, 1955 లో ప్రారంభించినప్పుడు, శాశ్వత అకాడమీ
ఖడక్వాస్లాలో పనిచేస్తోంది.
1953 జనవరి 7న, మేజర్ జనరల్ E. హబీబుల్లా కమాండెంట్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) బాధ్యతలు స్వీకరించారు. జాయింట్ సర్వీసెస్ వింగ్ (JSW) జనరల్ ఆఫీసర్ హోదాలో, అకాడమీని డెహ్రాడూన్ నుండి పూణే సమీపంలోని ఖడక్వాస్లాకు తరలించే బాధ్యత మేజర్ జనరల్ E. హబీబుల్లా పై ఉంది
మేజర్ జనరల్ E. హబీబుల్లా తండ్రి
లక్నో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్. E. హబీబుల్లా క్లిఫ్టన్‌లోని బ్రైటన్ సమీపంలోని
రాటింగ్ డీన్ ప్రిపరేటరీ స్కూల్‌లో ఇంగ్లాండ్‌లో విద్యనభ్యసించారు మరియు RMC శాండ్‌హర్స్ట్
నుండి నియమించబడ్డారు, ఖరక్వాస్లాలోని క్యాడెట్‌ల
విద్యా అవసరాల గురించి మేజర్ జనరల్ E. హబీబుల్లా కు లోతైన అవగాహన ఉంది.”
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)అప్పటి వరకు, అందించే కోర్సు
రెండు సంవత్సరాలు, కానీ మేజర్ జనరల్
హబీబుల్లా విశ్వవిద్యాలయాలు గ్రాడ్యుయేషన్‌గా గుర్తించే విధంగా NDA కోర్సును
రూపొందించాలని కోరుకున్నారు. దీని కోసం, మేజర్ జనరల్ హబీబుల్లా ప్రముఖ విద్యావేత్త R. N. వ్యాస్‌తో తన
కుటుంబ సంబంధాలను ఉపయోగించుకున్నాడు. వ్యాస్ JSW ప్రిన్సిపాల్‌గా చేరారు. NDAలో పాఠ్యాంశాలను
రూపొందించడంలో R. N. వ్యాస్ ముఖ్యమైన
పాత్ర పోషించారు.
షార్ట్ సర్వీస్ రెగ్యులర్
కమిషన్‌ను ప్రవేశపెట్టడంలో మేజర్ జనరల్ హబీబుల్లా
ప్రధాన సహకారం అందించారు..
బ్రిటిష్ ప్రభుత్వం
భారతదేశాన్ని విభజించాలని నిర్ణయించింది మరియు భారత జాతీయ కాంగ్రెస్ 1947లో విభజన
ప్రణాళికను అంగీకరించింది. ఆ సమయంలో, భారత సైన్యంలోని ముస్లిం అధికారులకు పాకిస్తాన్‌కు
వెళ్లడం లేదా భారతదేశంలో నివసించడం అనే ఎంపిక ఇవ్వబడింది. కాని ఇందులో ఒక మెలిక ఉంది. ఒక ముస్లిం అధికారి భారతదేశాన్ని
ఎంచుకుంటే, అతను సైన్యం నుండి
రాజీనామా చేయాల్సి ఉంది..
ఇద్దరు కల్నల్ స్థాయి ముస్లిం
అధికారులు భారతదేశంలోనే ఉండాలని కోరుకున్నారు - ఒకరు ఎనైత్ హబీబుల్లా మరియు మరొకరు
మొహమ్మద్ ఉస్మాన్.
ఎనైత్ హబీబుల్లా కుమారుడు
మరియు భారతదేశపు మొదటి ప్రధాన సమాచార కమిషనర్ వజాహత్ హబీబుల్లా తన పుస్తకంలో ఈ
సంఘటనను వివరించారు.
“భారతదేశాన్ని తన ప్రియమైన
మాతృభూమిగా మరియు భారత సైన్యాన్ని తన నివాసంగా భావించే ఎనైత్ హబీబుల్లా లాంటి
వ్యక్తికి, ఈ ఎంపిక ఆమోదయోగ్యం కాదు.
నెహ్రూతో తన కుటుంబ సంబంధాలను సద్వినియోగం చేసుకుని, ఎనైత్ హబీబుల్లా, మొహమ్మద్ ఉస్మాన్‌తో కలిసి
ప్రధానమంత్రి అప్పాయింట్ కోసం వేచి
ఉన్నారు.
మేజర్ జనరల్ హబీబుల్లా తండ్రి షేక్ మొహమ్మద్ హబీబుల్లా, లక్నో విశ్వవిద్యాలయం మాజీ వీసీ, మోతీలాల్ నెహ్రూ స్నేహితుడు. మేజర్ జనరల్ హబీబుల్లా కూడా జవహర్‌లాల్ నెహ్రూతో బాగా పరిచయం కలిగి ఉన్నారు. కాబట్టి మేజర్ జనరల్ హబీబుల్లా, బ్రిగేడియర్ మొహమ్మద్ ఉస్మాన్‌తో కలిసి నెహ్రూను కలిశారు. అప్పుడు, భారత సైన్యంలోని మరొక కల్నల్ కూడా రక్షణ మంత్రిత్వ శాఖ సలహా (ఒక ముస్లిం అధికారి భారతదేశాన్ని ఎంచుకుంటే, అతను సైన్యం నుండి రాజీనామా చేయాల్సి ఉంది) ను వ్యతిరేకించారు. దాంతో ఆ సలహా రద్దు చేయబడింది."
ముస్లింలు భారత సైన్యంలో పనిచేయడానికి అనుమతించబడ్డారు. బ్రిగేడియర్ మొహమ్మద్ ఉస్మాన్ ఒక సంవత్సరం తర్వాత, జూలై 1948లో, పాకిస్తాన్ ఆక్రమణదారులతో పోరాడుతూ, మహా వీర్ చక్రాన్ని పొందిన మొదటి వ్యక్తిగా నిలిచాడు.. భారతదేశంలోకి విలీనాన్ని నిరోధించడానికి ప్రయత్నిస్తున్న జునాగఢ్ పాలకుడిపై చర్యకు మేజర్ జనరల్ హబీబుల్లా నాయకత్వం వహించాడు.
ముస్లిం అధికారులు మరియు NDA లేకుండా భారత సైన్యాన్ని
ఊహించలేము.
No comments:
Post a Comment