1857 మే10న ప్రారంభమైన భారతదేశ మొదటి స్వాతంత్ర్య
యుద్ధంలో, హిందువులు, ముస్లింలు మరియు సిక్కులు ఐక్యంగా
గొప్ప సామ్రాజ్యవాద శక్తి అయిన బ్రిటన్‌ను సవాలు చేశారు; 1857మే 11న విప్లవకారులు భారతదేశo
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన నుండి విముక్తి పొందినదని ప్రకటించారు, బహదూర్ షా జాఫర్‌ను నిజమైన మొఘల్ చక్రవర్తిగా
ప్రకటించారు. ఈ అసాధారణ ఐక్యత, ఫిరంగి(బ్రిటిష్)లను కలవరపెట్టింది మరియు వారి
పాలన భారతదేశంలో కొనసాగాలంటే, హిందువులు మరియు ముస్లింలు మతపరంగా
విభజించబడినప్పుడు మాత్రమే జరుగుతుందని అర్థమైంది. బ్రిటిష్ వారు హిందువులు మరియు
ముస్లింల మధ్య శత్రుత్వాన్ని సృష్టించడానికి వ్యూహం పన్నారు.భారతీయుల మద్య ఉమ్మడి భావన రాకుండా నిరోధించడానికి చర్యలు
తీసుకొన్నారు.
తెల్ల పాలకులు హిందువులు మరియు ముస్లింలు రెండు
వేర్వేరు దేశాలకు చెందినవారని సూచించే రెండు దేశాల సిద్ధాంతాన్ని రూపొందించారు.
రెండు దేశాల సిద్ధాంతం భారతీయ సమాజాన్ని ముక్కలు చేయడంలో బ్రిటిష్ పాలకులకు
సహాయపడటానికి ప్రత్యేకంగా సృష్టించబడింది.
బ్రిటిష్ వారి ప్రచారానికి వ్యతిరేకంగా 1857 భారతదేశ మొదటి స్వాతంత్ర్య
యుద్దానికి వాస్తవంగా నానా సాహిబ్, బహదూర్ షా జాఫర్, మౌల్వి అహ్మద్ షా, తాంత్యా తోపే, ఖాన్ బహదూర్ ఖాన్, రాణి లక్ష్మీబాయి, హజ్రత్ మహల్, అజీముల్లా ఖాన్ మరియు ఫిరోజ్‌షా
వంటి నాయకులు సంయుక్తంగా నాయకత్వం వహించారు, వారు వివిధ మతాలకు చెందిన విప్లవకారుల సముదాయం.
ఇది ఒక విముక్తి పోరాటం, దీనిలో మౌల్వీలు, పండితులు, గ్రoథిలు, జమీందార్లు, రైతులు, వ్యాపారులు, న్యాయవాదులు, సేవకులు, మహిళలు, విద్యార్థులు మరియు వివిధ
కులాలు, మతాలు మరియు ప్రాంతాల నుండి
ప్రజలు తూర్పు ఇండియా కంపెనీ యొక్క అమానవీయ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తమ
ప్రాణాలను అర్పించారు.
163వ స్వాతంత్ర్య సంగ్రామ వార్షికోత్సవం సందర్భంగా, హిందూ-ముస్లిముల మద్య మత రాజకీయాలను నడిపెవారికి మనం చెప్పాల్సిన విషయం ఏమిటంటే, 1857 మే 11న మొఘల్ రాజు బహదూర్ షా
జాఫర్‌ను భారతదేశ స్వతంత్ర పాలకుడిగా ప్రకటించిన విప్లవ సైన్యంలో డెబ్బై శాతం కంటే
ఎక్కువ మంది హిందూ సైనికులు ఉన్నారు. నానా సాహిబ్, తాంత్య తోపే మరియు లక్ష్మీబాయి, వంటి హిందూ నాయకులు బహదూర్ షా జాఫర్‌ను మరోసారి రాజుగా చేయడంలో
కీలక పాత్ర పోషించారు.
నేటికీ అందుబాటులో ఉన్న ఆ కాలపు సమకాలీన
పత్రాలు పరిశిలించిన హిందువులు మరియు ముస్లింలు స్వతంత్ర భారత దేశం కొరకు ఐక్యంగా
అత్యున్నత త్యాగాలు చేయడం చూడవచ్చు.
అయోధ్య:
1857లో, అయోధ్యలో మౌల్వీలు, మహంతులు, సాధారణ హిందూ-ముస్లిం ప్రజలు
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలిచి పోరాడారు., కంపెనీ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం లో
బ్రిటిష్ వారు అయోధ్యకు
చెందిన ప్రసిద్ధ మౌల్వీ మౌలానా అమీర్ అలీ మరియు అయోధ్యలోని ప్రసిద్ధ హనుమాన్ గర్హి
(హనుమాన్ ఆలయం) పూజారి బాబా రామచరణ్ దాస్ ను బంధించి అయోధ్యలోని కుబేర్ టీలా (ఇప్పుడు
ఫైజాబాద్ జైలులో ఉంది) వద్ద చింతపండు చెట్టుకు కట్టి ఉరితీశారు.
అదే విధంగా అయోధ్య ప్రాంతం కు చెందిన రాజా దేవిబక్ష్ సింగ్ సైన్యాన్ని అచ్చన్
ఖాన్ మరియు శంభు ప్రసాద్ శుక్లా
సంయుక్తంగా నడిపించారు. కంపెనీ సైన్యం కు వ్యతిరేకంగా జరిగిన పోరాటం లో ఆంగ్లేయులు
బహిరంగా క్రూరంగా వారి తలలను క్రూరంగా
నరికివేశారు.
1857లో
మాతృభూమిని విముక్తి చేయడానికి హిందువులు మరియు ముస్లింలు తమ రక్తం ప్రవహించిన అయోధ్య, తరువాత రెండు వర్గాల మధ్య శాశ్వత ఘర్షణకు ఎందుకు
మూలంగా మారిందో అర్థం చేసుకోవడం కష్టం మేమి కాదు.
రాజస్థాన్-కోటా:
కోటా రాజ్యాన్ని(ప్రస్తుతం
రాజస్థాన్‌లో ఉంది) బ్రిటిష్ వారికి
అధీనుడైన మహారావు పాలించాడు.,
మహారావు
బ్రిటిష్ వారితో సహకరిస్తున్నాడని తెలుసుకున్నప్పుడు, ప్రముఖ సాహితీవేత్త లాలా జైదయాళ్ భట్నాగర్,
మహారావు సైన్యాధిపతి మెహ్రబ్ ఖాన్‌తో చేతులు కలిపి రాజ్యం లో తిరుగుబాటు
ప్రభుత్వాన్ని స్థాపించాడు. కోటాను బ్రిటిష్ దళాలు తిరిగి స్వాధీనం
చేసుకొన్నప్పుడు , భట్నాగర్-మెహ్రబ్ ఖాన్ కలిసి
1859 వరకు కోటా ప్రాంతంలో పోరాటం
కొనసాగించారు. ఒక ఇన్ఫార్మర్ చేత మోసం చేయబడిన వారిద్దరినీ సెప్టెంబర్ 17, 1860న బ్రిటిష్ వారు కోటలో ఉరితీశారు.
హర్యానా:
హంసి పట్టణం (ప్రస్తుతం హర్యానాలో ఉంది)
ముస్లింలు మరియు జైనులు కలసి విదేశీ పాలనను నిర్భయంగా సవాలు చేసి తమ ప్రాణాలను త్యాగం చేయడంలో కూడా వెనుకాడలేదని చరిత్ర చెబుతుంది. అందిస్తుంది. హంసి
పట్టణం లో హుకుంచంద్ జైన్ మరియు మునీర్ బేగ్ అనే ఇద్దరు సన్నిహితులను బహదూర్షా జాఫర్ విప్లవాత్మక ప్రభుత్వం
సలహాదారులుగా ఢిల్లీ పశ్చిమ ప్రాంతంలో కమాండర్లుగా నియమించింది.
హుకుంచంద్ జైన్ మరియు మునీర్ బేగ్ ఈ ప్రాంతంలో
అనేక విజయవంతమైన సైనిక ప్రచారాలకు నాయకత్వం వహించారు కానీ పాటియాలా, నభా, కపుర్తల, కాశ్మీర్ మరియు పటౌడీలను చెందిన స్థానిక పాలకుల
ద్రోహం కారణంగా కీలకమైన యుద్ధంలో ఓడిపోయి పట్టుబడ్డారు.
జనవరి 19, 1858న హన్సిలో ఒకే చెట్టుకు హుకుంచంద్ జైన్ మరియు మునీర్ బేగ్ కట్టి
ఉరితీసిన తర్వాత, హుకుంచంద్ జైన్‌ను ఖననం చేసి, వారి మతాల ఆచారానికి విరుద్ధంగా మునీర్ బేగ్‌ను
దహనం చేశారు. హుకుంచంద్ జైన్ యొక్క 13 ఏళ్ల
మేనల్లుడు ఫకీర్ చంద్ ఈ చర్యను నిరసించినప్పుడు అతన్ని కూడా ఎటువంటి నేరాపణ
లేకుండా నిర్దయగా ఉరితీశారు,
మధ్య భారతదేశం
ఝాన్సీ: బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా
ఝాన్సీ రాణి లక్ష్మీ బాయి వీరోచిత
ప్రతిఘటన చేసింది మరియు గ్వాలియర్‌లో బ్రిటిష్ దళాలతో పోరాడుతూ మరణించినది. నది.
గురించి మనందరికీ తెలుసు. రాణి లక్ష్మీ బాయి యొక్క ముస్లిం కమాండర్లు గులాం ఘౌస్
ఖాన్ (ఫిరంగిదళ అధిపతి), ఖుదా బక్ష్ (పదాతిదళ అధిపతి)
గొప్ప ప్రతిఘటనను చేసారు. కాని వీరిద్దరూ జూన్ 4, 1858న ఝాన్సీ కోటను కాపాడుతూ అమరులయ్యారు. రాణి లక్ష్మీ బాయి వ్యక్తిగత
అంగరక్షకురాలు అయిన ఒక యువ ముస్లిం మహిళ ముంజార్, జూన్ 18, 1858న గ్వాలియర్‌లోని కోటా-కి-సారాయ్ యుద్ధంలో రాణి
లక్ష్మీ బాయితో కలిసి ప్రాణాలను అర్పించింది.
మాల్వా:
అప్పటి సెంట్రల్ ప్రావిన్స్ (ఇప్పుడు
మధ్యప్రదేశ్)లోని మాల్వా ప్రాంతం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తాటియా తోపే, రావు సాహెబ్ (పాండురంగ సదాశివ్), లక్ష్మీ బాయి, ఫిరోజ్‌షా
మరియు మౌల్వి ఫజల్-ఉల్-హక్ ల ఉమ్మడి కమాండ్ 70-80 వేల మంది యోధులతో కూడిన భారీ తిరుగుబాటు సైన్యాన్ని
సమీకరించగలిగింది. భారతీయ విప్లవ వీరుల సైన్యం బ్రిటిష్ వారిపై లెక్కలేనన్ని
యుద్ధాలను గెలుచుకుంది. అయితే,
రానోడ్
వద్ద జరిగిన కీలకమైన యుద్ధంలో,
తాటియా
తోపే, ఫిరోజ్ షా మరియు మౌల్వీ
నేతృత్వంలోని విప్లవ సైన్యం చుట్టుముట్టబడినప్పుడు, మౌల్వీ
ఫజల్-ఉల్-హక్ బ్రిటిష్ దళాలకు అడ్డుగా ఒక
శిలలా నిలిచాడు. మౌల్వీ ఫజల్-ఉల్-హక్ మరియు అతని 480 మంది
సహచరులు డిసెంబర్ 17, 1858న తమ ప్రాణాలను అర్పించారు, కానీ తాటియా తోపే, రావు సాహెబ్ మరియు ఫిరోజ్ షాలతో సహా ప్రధాన
సైన్యాన్ని రక్షించగలిగారు. మౌల్వీ ఫజల్ హక్ మరియు అతని సహచరుల త్యాగం ద్వారా
రక్షించబడిన తాటియా తోపే 1859 ప్రారంభం వరకు యుద్ధం
కొనసాగించాడు.
రోహిల్‌ఖండ్:
ప్రస్తుత బరేలీ, షాజహాన్‌పూర్, బదౌన్ మరియు బిజ్నోర్ ప్రాంతం మొదటి నుండి
విప్లవకారులకు బలమైన స్థావరంగా ఉంది. మే 11, 1857న ఢిల్లీలో స్వతంత్ర భారత ప్రభుత్వం ఏర్పాటు ప్రకటించిన
వెంటనే, రోహిల్‌ఖండ్ లో ఖాన్ బహదూర్
ఖాన్ మొఘల్ చక్రవర్తి వైస్రాయ్‌గా నియమితులయ్యారు. ఖాన్ బహదూర్ ఖాన్ బాధ్యతలు స్వీకరించిన
వెంటనే రోహిలా ఖండ్ వ్యవహారాలను నిర్వహించడానికి
హిందువులు మరియు ముస్లింలతో కూడిన ఎనిమిది మంది సభ్యుల కమిటీని నియమించారు, ఖాన్ బహదూర్ ఖాన్ డిప్యూటీ ఖుషీ రామ్. స్థానిక
హిందువుల మనోభావాలను గౌరవిస్తూ ఈ ప్రభుత్వం గోవధను నిషేధించింది. ఖాన్ మరియు ఖుషీ
రామ్ నేతృత్వంలోని దళాలు బ్రిటిష్ వారిని మరియు వారి అనుచరులను అనేక యుద్ధాలలో
ఓడించాయి కానీ బరేలీలో జరిగిన కీలకమైన యుద్ధంలో ఓడిపోయారు. ఖాన్ మరియు ఖుషీ రామ్ ఇద్దరినీ
మార్చి 20, 1860న పాత కొత్వాలి వెలుపల వారి
వందలాది మంది అనుచరులతో ఉరితీశారు.
ఢిల్లీ:
భారత సైనికుల విప్లవ సైన్యానికి మహమ్మద్ బఖ్త్
ఖాన్, అజీముల్లా ఖాన్, షామ్ సింగ్ దూగా, సిర్ధారా
సింగ్, గౌస్ మొహమ్మద్, హీరా సింగ్ మరియు ఒక 'దోబీ బ్రాహ్మణుడు'తో కూడిన ఉమ్మడి కమాండ్ నాయకత్వం వహించింది.
బ్రిటిష్ గూఢచారులు ఢిల్లీవాసుల మధ్య మత ఘర్షణను సృష్టించడంలో విజయం సాధించకుండా
ఉండటానికి, విప్లవ సైన్యం యొక్క కమాండర్
జనరల్ బఖ్త్ ఖాన్ గోవధను నిషేధించారు.
షాజహాన్ కాలం నాటి ఉపయోగించకుండా పడి ఉన్న భారీ
కానన్‌ను బయటకు తీసి, మరమ్మతులు చేసి, మొదటి కానన్‌ను కాల్చడానికి ముందు బహదూర్ షా
జాఫర్ మరియు ఇతర సైనిక అధికారుల సమక్షంలో, హిందూ
పూజారులు ఆరతి ఇచ్చి, పూలమాలలు వేసి, వేద శ్లోకాలతో ఆశీర్వదించారు.
మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధంలో హిందూ-ముస్లిం
ఐక్యత ఒక ప్రాంతానికి లేదా జనాభాలోని ఒక వర్గానికి పరిమితం కాలేదు. ఈ ఐక్యత మొత్తం
దేశాన్ని అన్ని స్థాయిలలో వ్యాపించింది.
మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధంలో అనేక మంది
మహిళలు కూడా తిరుగుబాటు లో పాల్గొని తమ ప్రాణాలను త్యాగం చేసారు.
Ø ముజఫర్ నగర్ జిల్లాలో
(ఇప్పుడు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఉంది) ఉన్న థానా భవన్ అనే చిన్న పట్టణంలో, వివిధ మతాలు మరియు కులాలకు చెందిన 11 మంది ధైర్యవంతులైన మహిళలను బ్రిటిష్ పాలనకు
వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టినందుకు కలిసి ఉరితీయడం లేదా సజీవ దహనం చేయడం జరిగింది.
Ø 45 ఏళ్ల అస్ఘరి బేగం ఒక సంపన్న కుటుంబానికి
చెందినది మరియు ఆ ప్రాంతంలో తిరుగుబాటును నిర్వహించినందుకు సజీవ దహనం చేయబడింది.
Ø 28 ఏళ్ల ఆశా దేవి, హిందూ గుజర్ కుటుంబానికి
చెందినది సైనిక తిరుగుబాటులో పాల్గొని ఉరితీయబడింది.
Ø మరో అమరవీరురాలు యువ భగవతి
దేవి, ఫిరంగీ పాలనకు వ్యతిరేకంగా
అనేక యుద్ధాలలో పోరాడిన రైతుల త్యాగి కుటుంబంలో జన్మించింది.
Ø ముస్లిం గుజర్ కుటుంబానికి
చెందిన 24 ఏళ్ల హబీబా, పొరుగు ప్రాంతాలను బ్రిటిష్ నిరంకుశత్వం నుండి
విముక్తి చేయడానికి అనేక యుద్ధాలలో నిర్భయంగా పోరాడింది. బ్రిటిష్ వారు హబీబా ను
బంధించి 1857లో ఉరిశిక్ష విధించారు.
Ø డిల్లి ప్రాంతానికి చెందిన గొర్రెల కాపరి కుటుంబానికి
చెందిన మరో ధైర్యవంతురాలైన మహిళ మామ్ కౌర్, 25
సంవత్సరాల చిన్న వయసులోనే ఉరితీయబడింది.
Ø డిల్లి ప్రాంతానికి చెందిన
మరో ధైర్యవంతురాలైన మహిళ భక్తవారీ కూడా బ్రిటిష్ పాలకులతో పోరాడుతూ తన ప్రాణాలను
అర్పించింది.
Ø ఈ ప్రాంతానికి చెందిన జాట్
ముస్లిం కుటుంబంలో జన్మించిన ధైర్యవంతురాలైన మహిళ 26 ఏళ్ల ఉమ్డా బ్రిటిష్ దండయాత్రను ప్రతిఘటిస్తూ
తన ప్రాణాలను త్యాగం చేసింది.
Ø
1833లో జన్మించిన సిక్కు కుటుంబం
నుండి వచ్చిన రాజ్ కౌర్ థానా భవన్
ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతూ అత్యున్నత త్యాగం చేసింది.
అజీముల్లా ఖాన్ 1857 నాటి తిరుగుబాటు గురించి ఇలా అన్నారు:
· Hum haeniss ke malik,
Hindoostan hamaaraa/Paak watan hae qaum kaa Jannat se bhee piyaaraa
హమ్ హేనిస్ కే మాలిక్, హిందుస్తాన్ హమారా/పాక్ వతన్ హే క్వామ్ కా
జన్నత్ సే భీ పియారా.
[మేము దాని యజమానులము, అది మనకు చెందినది. ఇది మన పవిత్ర భూమి, స్వర్గం కంటే సుందరమైనది.]
· Hindoo-Mussalmaan-Sikh
hamaaraa bhai piyaaraa-piyaaraa/yeh hae azaadi kaa jhanda isse salaam hamaaraa.
హిందూ-ముస్సల్మాన్-సిక్కు హమారా భాయ్
పియారా-పియారా/యే హే అజాది కా ఝండా ఇస్సే సలాం హమారా.
హిందూ-ముస్లిం-సిక్కులు మన ప్రియమైన సోదరులు. ఇది స్వాతంత్ర్య జెండా, దీనికి వందనం.]
168 సంవత్సరాల క్రితం జరిగిన ప్రధమ భారత స్వాతంత్ర్య యుద్ధం హిందూ-ముస్లిం
ఐక్యత యొక్క అద్భుతమైన సంఘటన.
రచయిత:ఢిల్లీ
విశ్వవిద్యాలయ రిటైర్డ్ ప్రొఫెసర్ షంసుల్ ఇస్లాం
No comments:
Post a Comment