11 October 2019

2019 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత: ఇథియోపియన్ ప్రధాన మంత్రి అబి అహ్మద్ అలీ.




Image result for abi ahmed ali


ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతిని పురస్కార కమిటీ ప్రకటించింది. 2019 ఏడాదికి గానూ ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్‌ అలీకి నోబెల్‌ శాంతి పురస్కారాన్ని అందజేస్తున్నట్లు వెల్లడించింది .శాంతి మరియు అంతర్జాతీయ సహకారాన్ని సాధించడానికి చేసిన కృషికి గాను ఇథియోపియన్ ప్రధాన మంత్రి అబి అహ్మద్ అలీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వబడింది ముఖ్యంగా తమ సరిహద్దు దేశమైన ఎరిట్రియాతో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేసిన కృషికి అబీ అహ్మద్‌కు అరుదైన గౌరవం దక్కింది.

ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతికి అబి ప్రధానమైన పోటిదారునిగా ఉన్నారు. అయితే నోబెల్ కమిటీ 50 సంవత్సరాలుగా అభ్యర్థుల పేర్లు లేదా నామినేషన్లను వెల్లడించలేదు.

1901 నుండి 99 నోబెల్ శాంతి బహుమతులు వ్యక్తులకు మరియు 24 సంస్థలకు ఇవ్వబడ్డాయి. ఇతర బహుమతులను  స్టాక్‌హోమ్‌లో ప్రకటించగా, శాంతి బహుమతిని నార్వేజియన్ రాజధాని ఓస్లోలో ప్రదానం చేస్తారు.

నోబెల్ బహుమతి మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్త్రీ, సాహిత్యంలో మరియు శాంతి రంగంలో ఇవ్వబడుతుంది.

బహుమతి క్రింద 9 మిలియన్ క్రోనర్ (18 918,000డాలర్ల ) నగదు అవార్డు, బంగారు పతకం మరియు డిప్లొమా ఇస్తారు. వస్తుంది. బహుమతి మొత్తాన్ని స్వీడిష్ క్రోనర్‌లో ఇస్తారు. నార్వేజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్ ఏప్రిల్ 2018 నుండి ఇథియోపియా నాయకుడైన అబి స్వదేశంలో ప్రారంభించిన "ముఖ్యమైన సంస్కరణలను" ప్రశంసించింది. ఛైర్ వుమన్ బెరిట్ రీస్-అండర్సన్ మాట్లాడుతూ, "అబి అహ్మద్ ప్రయత్నాలకు గుర్తింపు అవసరం మరియు ప్రోత్సాహం అవసరం" అని అన్నారు.

అబీ అహ్మద్‌ అలీ 2018 ఏప్రిల్‌ 2న ఇథియోపియా ప్రధాన మంత్రి గా ప్రమాణస్వీకారం చేశారు.ఇదియోపియా లో విస్తృతమైన నిరసనలు, దీర్ఘకాలo గా అధికారం లో ఉన్న  పాలక సంకీర్ణo  అధికారంలో వైదొలిగిన తరువాత    ఆఫ్రికాలో  యొక్క అతి పిన్న వయస్కుడు గా 43 ఏళ్ల మాజీ ఆర్మీ ఇంటెలిజెన్స్‌ అధికారి అబి అహ్మద్‌ ఇదియోపియా నాలుగో ప్రధానిగా అధికారం చేపట్టారు.

 దశాబ్దాల నాటి ఇథియోపియో-ఎరిట్రియా సరిహద్దు వివాద పరిష్కారం కోసం అబీ అహ్మద్‌ ఎంతగానో కృషి చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఎరిట్రియా అధ్యక్షుడితో పలుమార్లు చర్చలు జరిపి వివాదాన్ని పరిష్కరించారు మరియు స్వదేశం లో  కొన్ని వేగవంతమైన సంస్కరణలను ప్రకటించాడు ఇథియోపియా ప్రజల భవిష్యత్‌ కోసం ఆర్థిక సంస్కరణలు చేపట్టారు.దీనితో ఇదియోపియాలో "అబిమానియా" ప్రారంభమైంది.

దీర్ఘకాలంగా అల్లకల్లోలంగా ఉన్న హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతంలోని  ఇథియోపియా ఎరిట్రియాతో శాంతి ఒప్పందాన్ని అంగీకరిoచి ఆఫ్రికా యొక్క దీర్ఘకాలిక సంఘర్షణలలో ఒకదానికి అబి అహ్మద్ ముగింపు పలికినారు.ఎరిట్రియా నాయకుడు అడిస్ అబాబాను సందర్శించాడు మరియు సమాచార మరియు రవాణా సంబంధాలు పునరుద్ధరించబడ్డాయి. రెండు దశాబ్దాలలో మొదటిసారిగా, దీర్ఘకాలంగా విభజించబడిన కుటుంబాలు కన్నీటి పున:కలయికలు చేయబడినవి.  సంబంధాలు మెరుగుపడటం వలన ప్రపంచంలోని అత్యంత ఒంటరి,పేద  దేశాలలో ఒకటైన ఎరిట్రియాపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలను ఎత్తివేసింది.

దేశ అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ప్రధాని బాధ్యతలు చేపట్టిన తొలి 100 రోజుల్లో అత్యయిక స్థితిని ఎత్తేశారు. రాజకీయ నేరస్థులను జైళ్ల నుంచి విడుదల చేశారు. అవినీతికి పాల్పడ్డ సైనిక, పౌర అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించారు ప్రతిపక్షాలపై నిషేదాలు తొలగించ బడినవి.  ప్రజలు సోషల్ మీడియాలో తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేశారు.

2020 లో ఇథియోపియా స్వేచ్ఛాయుతమైన మరియు న్యాయమైన ఎన్నికలను నిర్వహిస్తుందని అబి అహ్మద్ ప్రకటించారు. రాజకీయాలు, ఇతర రంగాల్లో మహిళల పాత్ర పెంచేందుకు కృషి చేశారు. తన కేబినెట్‌లో సగం మంది మహిళలను తీసుకున్నారు ప్రపంచంలోని కొద్ది "లింగ-సమతుల్య"gender-balanced " క్యాబినెట్లలో యుధోపియా  ఒకటి మరియు యుధోపియా ఒక మహిళా అధ్యక్షురాలును కలిగి ఉంది అది  ఆఫ్రికాలో అరుదైన పరిణామం.

మొదటిసారి ఇథియోపియన్ జైళ్ళలో జర్నలిస్టులు లేరు అని ప్రపంచ మీడియా గ్రూపులు గత సంవత్సరం గుర్తించాయి.

కొత్త ప్రధాని అబి అహ్మద్ ఇథియోపియా ప్రభుత్వoయొక్క కఠినమైన నియంత్రణలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ప్రారంభించినట్లు ప్రకటించారు, ప్రధాన ప్రభుత్వ యాజమాన్యంలోని రంగాలలో ప్రైవేట్ పెట్టుబడులు స్వాగతించబడతాయని చెప్పారు - ఈ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతుంది.

అబి అహ్మద్ గ్లోబల్ డార్లింగ్‌గా మారగా, స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో మాట్లాడుతూ ఉండగా స్వదేశం లో  ఇబ్బందులు తలెత్తాయి. రాజధానిలో అతని పై  గ్రెనేడ్ విసిరబడింది మరియు అతని  సంస్కరణలను అరికట్టే ప్రయత్నం విద్రోహ సైనికుల ద్వారా జరిగింది. అబి అహ్మద్ త్వరలోనే పరిస్థితిని చక్కదిద్దారు.

ఇథియోపియా లో పెరుగుతున్న జాతి ఉద్రిక్తతలు మరియు అణచివేతకు గురైన ప్రజలు ఇప్పుడు దీర్ఘకాలిక మనోవేదనలపై ఉన్నారు. అబి అహ్మద్ పాలనలో  1,200 మంది మరణించారు మరియు 1.2 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. వచ్చే ఏడాది ఎన్నికలకు ముందే అశాంతి పెరుగుతుందని దానిని అరికట్టవలసిన భాద్యత అబి అహ్మద్ పై ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.


No comments:

Post a Comment