4 October 2019

ఇస్లాం మరియు సుపరిపాలన

ఇస్లాం అనే పదం అరబిక్ పదం సలాం (S L M) నుండి ఉద్భవించింది మరియు దాని అర్ధం లొంగిపోవడం, విధేయత మరియు శాంతి అనగా ఒక వ్యక్తి అన్ని విధాల శక్తివంతమైన దేవునికి పూర్తిగా లొంగిపోయినప్పుడే శారీరక మరియు మానసిక శాంతిని పొందగలడు.

ఇస్లాం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ధర్మాలలో ఒకటి. ప్రపంచంలోని  ప్రతి ఐదుగురిలో ఒకరు ముస్లింలు  మరియు ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్ల మంది ముస్లింలు ఉన్నారు.


ఇస్లాంలో సుపరిపాలన అనే భావన ను వివరించే ముందు పాలన అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. పాలన అనేది విధులు మరియు హక్కుల నియంత్రణ మరియు పంపిణీ మరియు విధుల ను  ఉత్తమ పద్ధతిలో అందించటం మంచి పాలనను  సూచిస్తుంది. ఇస్లాం సంపూర్ణ జీవన నియమావళి కావడం ఆర్థిక, సామాజిక, రాజకీయ మరియు పాలన వ్యవస్థల గురించి మార్గదర్శకాలను అందిస్తుంది.

ఇస్లామిక్ వ్యవస్థ లో సుపాలన అనేది అవినీతి మరియు సామాజిక అన్యాయాల నుండి విముక్తిని సూచించే వ్యవస్థ. ఇస్లామిక్ సుపరిపాలన వ్యవస్థ అడాల్Adal అంటే న్యాయం మీద ఆధారపడి ఉంటుంది మరియు దాని అంతిమ లక్ష్యం ప్రజల సంక్షేమం. ఇస్లాంలో సుపరిపాలన యొక్క ఈ రెండు లక్షణాలను  ఆధునిక సుపరిపాలన భావన స్వీకరించినది. ఇస్లామిక్ భావనలో సుపరిపాలన అనగా సంస్థాగత మౌలిక సదుపాయాలకు మార్గనిర్దేశం చేసే దాని నాయకత్వం అని గమనించవచ్చు.

ఇస్లాంలో సుపరిపాలన యొక్క మార్గదర్శకాలు అందించబడటమే కాకుండా, ఖురాన్లో మంచి పాలన యొక్క సరైన ఆదర్శప్రాయమైన నమూనాలు ఉన్నాయి.ఇస్లాంలో సుపరిపాలన యొక్క నమూనాలు ఆచరణాత్మకమైనవి.

దివ్య  ఖురాన్ సుపరిపాలనను న్యాయ చట్టం, న్యాయమైన మరియు సూత్రప్రాయమైన క్రమం మరియు సమాజంలో హక్కులు మరియు బాధ్యతల సమ్మతి అని వివరిస్తుంది.

దివ్య ఖుర్ఆన్ ఇలా ప్రకటిస్తుంది: భూమిపై  అధికారాన్ని ప్రసాదిస్తే, వారు నమాజును స్థాపిస్తారు. జకాత్ ఇస్తారు, మంచి(మౌరుఫ్ mauruf)  చేయమని ఆజ్ఞాపిస్తారు, చెడు(ముంకర్ munkar)  నుండి నిరోదిస్తారు. (దివ్య ఖురాన్, అల్-హజ్, 22:41)

ఇది ఇంకా ఇలా చెబుతోంది: విశ్వసించిన  ప్రజలారా!అల్లాహ్ కొరకు సత్యం పై స్థిరంగా ఉండండి. న్యాయానికి సాక్షులుగా ఉండండి.(ఏదైనా) వర్గం తో ఉన్న వైరం కారణంగా మీరు ఆవేశానికి లోనయి న్యాయాన్ని(adl)త్యజించకండి. న్యాయం చేయండి. ఇది దైవ భక్తికి సరిసమానమైనది.   దివ్య ఖురాన్ 5:8.

సుపరిపాలన యొక్క ఇస్లామిక్ దృక్పథం గుణాత్మకమైనది మరియు యాంత్రికమైనది కాదు. సుపరిపాలన యొక్క ప్రధాన లక్షణాలను ఏడు ప్రధాన అంశాల కింద నిర్ణయించవచ్చు
1. చట్ట నియమాలు (అస్-షురా) Rules of Law (As-Shura)
2. ఖలీఫా Khilafah
3. జవాబుదారీ
4. పారదర్శకత
5. న్యాయం/ జస్టిస్
6. సమత/ఈక్విటీ
7. అల్-అమర్ బిల్ మరుఫ్ వా నహి ఒక అల్-ముంకర్.

అల్లాహ్ అన్ని విషయాలలో ఇహ్సాన్(శ్రేష్ఠత) ను ఆజ్ఞాపించినాడు అని   హదీసులు ఉదాహరిస్తున్నాయి మరి  రాజకీయాల్లో శ్రేష్ఠత ఎందుకు ఉండకూడదు?ముస్లిం సమాజాలు  ప్రజాస్వామ్యం మరియు స్వేచ్ఛను కలిగి ఉండాలి. ఇస్లాం లో రాజకీయ పాలన ప్రజల స్వేచ్ఛ లేదా ఎంపిక పై ఆధారపడి ఉంటుంది.

ఇస్లాం విలువల సరస్సు మరియు ముస్లింలు ఇస్లామిక్ విలువలను గ్రహించడంపై దృష్టి పెట్టాలి. ప్రస్తుత రాజకీయ ఆదర్శాలకు ప్రత్యామ్నాయంగా ఇహ్సాన్ లేదా శ్రేష్ఠత  ఆధారంగా ముస్లిoలు  రాజకీయ దృక్పథాన్నికలిగి ఉండాలి.

రాజకీయాలలో  ప్రజలు ఎంటువంటి ప్రభావానికి లోను కాకూడదు. ప్రజలు  తమ సొంత అవగాహన మరియు సమాజం పట్ల ఉన్న బాధ్యతల ఆధారంగా తమ జీవితాలను రుపొందించుకొనే  స్వేచ్ఛ కలిగి  ఉండాలి. ప్రజలు మానవత్వం నైతికత  మరియు కరుణ దృక్పథాన్నికలిగి , ప్రేమతో  తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలి.

అందరికీ స్వేచ్ఛ మరియు సామాజిక న్యాయం పట్ల నిబద్ధతతో కూడిన బహిరంగ సమాజం రుపొందాలి. ఇహ్సాన్ అర్థం అందరి శ్రేయస్సు కోసం మానవ మరియు భౌతిక వనరులను సరిగ్గా ఉపయోగించడం. ప్రతి ఒక్కరూ తమ నైతిక విలువలను గ్రహించి, తమ వ్యక్తిత్వం  పరిపూర్ణంగా తీర్చిదిద్దుకొని సామాజిక న్యాయం కొరకు పాటుపడాలి.

  
No comments:

Post a Comment