26 October 2019

మహారాష్ట్ర, హర్యానా, 51 అసెంబ్లీ స్థానాలు మరియు 2 లోక్ సభ, 51 అసెంబ్లీ స్థానాలకు జరిగిన బై –పోల్స్ 2019 పలితాలు


మహారాష్ట్ర, హర్యానా, అసెంబ్లీ సాధారణ ఎన్నికల తో పాటు 17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాలలో 51 అసెంబ్లీ సీట్లు, రెండు లోక్‌సభ నియోజకవర్గాలుకు బై-పోల్స్/ ఉప ఎన్నికలు జరిగినవి.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2019:
10 మంది ముస్లిం అభ్యర్థులు గెలుపొందగా, 12 మంది రన్నరప్‌గా నిలిచారు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 10 మంది ముస్లిం అభ్యర్థులను విజేతలుగా ప్రకటించగా, 12 మంది రెండో స్థానంలో నిలిచారు
విజేతలలో ఎన్‌సిపికి చెందిన నవాబ్ మాలిక్ (అనుశక్తి నగర్), సమాజ్ వాదీ పార్టీకి చెందిన అబూ అసిమ్ అజ్మీ (మంఖుద్ శివాజీ నగర్), సమాజ్ వాదీ పార్టీకి చెందిన రీస్ ఖాసిమ్ షేక్ (భివాండి), అమిన్ పటేల్ (మాంబా దేవి) జీషన్ బాబా సిద్దిఖీ (బాంద్రా వెస్ట్) అస్లం షేక్ (మలాద్ -వెస్ట్) కాంగ్రెస్ నుండి, మొహమ్మద్ ఇస్మాయిల్ అబ్దుల్ ఖాలిక్ (మలేగావ్-సెంట్రల్) మరియు AIMIM నుండి షా ఫరూక్ అన్వర్ (ధూలే), అబ్దుల్ సత్తార్ నబీ (సిల్లోడ్) శివసేన, మరియు ఎన్‌సిపి నుండి ముషారఫ్ హుస్సేన్ (కాగిల్).

గెలిచినా వారిలో కాంగ్రెస్స్ నుండి ముగ్గురు, AIMIM నుండి ఇద్దరు, NCP నుండి ఇద్దరు, SP నుంచి ఇద్దరు, శివసేన నుంచి ఒక్కరు ఉన్నారు.
రెండవ స్థానంలో 12 మంది ముస్లిం అభ్యర్థులు నిలిచారు.  .

2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

·        2019 హర్యానా ఎన్నికలలో 03 ముగ్గురు ముస్లిం అబ్యార్ధులు విజయం పొందారు.
·        కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం 03 మంది ముస్లింలు 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో విజయం పొందారు.

·        2014 హర్యానా ఎన్నికలలో కూడా 03 ముగ్గురు ముస్లిం అబ్యార్ధులు విజయం పొందారు గెలిచిన మొత్తం ముస్లింల సంఖ్య 2014 లో వారి సంఖ్యకు సమానం

·        హర్యానాలో ముస్లిం జనాభా 7%, రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. వారి జనాభా మరియు రాష్ట్ర అసెంబ్లీలో సీట్ల సంఖ్య ఆధారంగా, ముస్లింల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండాలి.

2019 హర్యానా ఎన్నికల్లో గెలిచిన ముస్లింల జాబితా
1. కాంగ్రెస్‌కు చెందిన మన్నన్ ఖాన్ (ఫిరోజ్‌పూర్ జిర్కా)
2. కాంగ్రెస్‌కు చెందిన అఫ్తాబ్ అహ్మద్ (నుహ్)
3. కాంగ్రెస్ యొక్క మొహద్ ఇలియాస్ (పున్హానా)

51 అసెంబ్లీ సీట్ల కోసం బై-పోల్:

  

·        51 అసెంబ్లీ సీట్ల కోసం బై-పోల్: బిజెపి యొక్క మునుపటి సంఖ్య తగ్గిoది, కేవలం 17 సీట్లు మాత్రమే గెలిచింది.

·        బిజెపి సంఖ్య హర్యానా మరియు మహారాష్ట్రలలో మాత్రమే కాకుండా, 51 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరిగిన 17రాష్ట్రాల్లో కూడా పడిపోయింది.

·        హర్యానాలో, బి.జే.పి. పార్టీ సంఖ్య 47 నుండి 40 సీట్లకు, మహారాష్ట్రలో 122 నుండి 105 సీట్లకు పడిపోయింది.

·        17 రాష్ట్రాల్లో 51 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక ఫలితాలు యుపి, అస్సాం మినహా బిజెపికి ప్రోత్సాహకరంగా లేవు.

·        పోల్‌కు వెళ్లిన 51 సీట్లలో బిజెపికి 19 సీట్లు ఉన్నాయి. పార్టీ 33 మంది అభ్యర్థులను నిలబెట్టింది. 17 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది, ప్రస్తుతo ఉన్న సంఖ్య కంటే రెండు సీట్లు తక్కువ.

·        మూడు కొత్త సీట్లను గెలుచుకుంది - సిక్కింలో రెండు మరియు గుజరాత్లో ఒకటి
.
·        ఐదు సీట్లను కోల్పోయింది - గుజరాత్, యుపి, రాజస్థాన్, పంజాబ్ మరియు మధ్య ప్రదేశ్లలో ఒక్కొక్కటి.

·        గుజరాత్‌లో, కాంగ్రెస్ టికెట్‌పై 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన అల్పేష్ ఠాకూర్, ధవల్‌సింగ్ జాలా ఈ ఏడాది జూలైలో బిజెపికి ఫిరాయించారు.వారిని ఈ ఉఒప ఎన్నికలలో బిజెపి తమ అభ్యర్థులుగా నిలబెట్టింది, కాని ఇద్దరూ కాంగ్రెస్ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు.గుజరాత్ లో కాంగ్రెస్స్ 3 స్థానాలలో గెలిచింది. బి.జే.పి.  3 స్థానాలు కోల్పోయినది.

 


లోక్ సభ బై  పోల్స్
·        రెండు లోక్ సభ స్థానాలకు జరిగిన లోక్ సభ బై పోల్స్ లో సతారా (మహారాష్ట్ర) నుంచి NCP అబ్యర్ది మరియు సమస్త్రిపూర్ (బీహార్) నుంచి LJP అబ్యర్ది విజయం సాధించారు.  


No comments:

Post a Comment