నగరాలు ప్రజలచే నిర్మించబడ్డాయి మరియు వ్యక్తుల
మాదిరిగా నగరాలు కూడా కథలు చెబుతాయి.
భారతదేశములో ముంబై, కోల్‌కతా, జైపూర్, హైదరాబాద్ మరియు అలీగర్ వంటి నగరాల్లో ముస్లింలు
గణనీయమైన సంఖ్యలో ఉన్నారు.వీరు సమాజంలో మతపరంగా
వేరుచేయబడి సోఫాన పద్ధతిలో
అట్టడుగున ఉన్నారు. ఘెట్టోస్ లేదా ఎన్క్లేవ్స్ లో నివసిస్తున్నారు..
అందరిలాగే ముస్లింలకు కూడా తమ నివాస స్థలాన్ని
ఎన్నుకునే స్వేచ్ఛ ఉందని వాదించవచ్చు కాని నిజాలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి.. ముస్లిం అయినందున, ముఖ్యంగా భారతదేశంలోని అతి ముఖ్యమైన మెట్రోపాలిటన్ నగరాల్లో, గృహ హక్కులు నిరాకరించబడిన అనేక ఉదంతాలు కలవు
కానీ, హింస ముప్పు అతి పెద్ద
అంశం.ఉదాహరణకు, ముంబైలోని
ముంబ్రా ఏరియా ను గమనించండి., ఇక్కడ 85% మంది ముస్లింలు ఉన్నారు, వీరిలో ఎక్కువ
మంది నగరంలోని ఇతర ప్రాంతాలలో బాబ్రీ మసీదు దాడి తరువాత జరిగిన మత ఘర్షణల సమయంలో
అక్కడకు వలస వచ్చారు.
అదేవిధంగా, హైదరాబాద్, మీరట్ మరియు అహ్మదాబాద్లలో, ‘మత ఘర్షణ’ లేదా అల్లర్లు, ముస్లింలను వారి ఆస్తి
మరియు వ్యాపారాన్ని విడిచిపెట్టి వారు ‘సురక్షితంగా’ భావించే ప్రాంతాలకు వెళ్ళేట్టు చేసినాయి.
అల్లర్ల సమయంలో, మైనారిటీ ముస్లిం
జనాభా, పెద్ద సంఖ్యలో నగరంలోని
పాత మరియు పేద ప్రాంతాలలో ఉన్న మొహల్లాస్కు వలస వెళ్ళవలసి వస్తుంది. దీనితో ముస్లిం
మొహల్లాస్ ‘మినీ-పాకిస్తాన్లు’లేదా దేశ వ్యతిరేక
నిలయాలుగా కొన్ని శక్తులచే ముద్ర వేయపడినాయ
‘భారతీయ నగరాల్లో
వేరుచేయడం(‘segregation in
Indian cities’) పై అనేక పరిశోధనా పత్రాలు ఉన్నప్పటికీ, వివక్షకు గురైన సమూహంలోని సభ్యుల వేరుచేయడం పరిశిలించాలి. ఈ
సంధర్మం లో 1987 లో సామాజిక శాస్త్రవేత్త విలియం జె. విల్సన్ ఉపయోగించిన ‘అండర్ క్లాస్’ అనే భావనను
దృష్టిలో పెట్టుకోవడం ముఖ్యం. ముఖ్యంగా, అండర్‌క్లాస్
మరియు దిగువ తరగతుల సభ్యుల మధ్య వ్యత్యాసం ఏమిటంటే, అండర్‌క్లాస్/
పరిసరాలు వారి ఉపాంత ఆర్థిక స్థితిని తెలుపుతాయి.
'లోయర్ క్లాస్' అనే పదం వనరుల కొరతను సూచిoచును., 'అండర్ క్లాస్' విస్తృత పరిధిని
కలిగి ఉంది, ఇందులో సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు
మానసిక పక్షపాతాలు ఒక సమూహాన్ని లేదా దాని సభ్యులను ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి/ పొరుగు కు వేరుచేయబడతారు.
భారతదేశ పట్టణ ముస్లిం జనాభాకు ఈ భావన ఎలా వర్తిస్తుందో అన్వేషించడంలో అపారమైన
విలువ ఉంది.
మొదటిది చాలా మంది ముస్లింలు ఇతర మత సమూహాల కంటే
అధ్వాన్నమైన పరిసరాల్లో నివసిస్తున్నారు - పాఠశాలలు, ఆసుపత్రులు
మొదలైన వనరులకు యాక్సెస్ /ప్రాప్యత లేదు. ఈ అవరోధాలు సమాజం యొక్క చైతన్యంపై బలమైన ప్రభావాన్ని
కలిగి ఉంటాయి. ఒక అధ్యయనం
ప్రకారం భారతదేశంలో
ముస్లింలు మాత్రమే ఆర్ధికంగా అభివ్రుది చెందని సాంఘిక-మత సమూహం (socio-religious
group).
రొండోవది ‘అండర్‌క్లాస్’ వారికి ఉద్యోగ
అవకాశాలు కొరత ఉన్నందున వారిలో ప్రత్యామ్నాయ ఆదాయ-ఉత్పాదక కార్యకలాపాల అవకాశాలు
సర్వసాధారణం. వివక్షత కారణంగా, భారతీయ ముస్లింలు
ఎక్కువగా వారి సంప్రదాయక నివాస ప్రాంతాలు
మరియు వృత్తులకే పరిమితం అవుతున్నారు.
‘వ్యవస్థలో పక్షపాతం, ముస్లిం సమాజానికి
వ్యతిరేకంగా’ సూచిస్తుంది. ఇది MGNREGA (ప్రభుత్వ ప్రధాన
సామాజిక రక్షణ పథకం) కింద కూడా ముస్లింలను ఉద్యోగాలు పొందకుండా నిరోధిస్తుంది. బ్యాంకుల
ద్వారా ముస్లింలకు క్రెడిట్ మరియు / లేదా ఇతర ఆర్థిక సహాయాన్ని తిరస్కరించడం
జరుగుతుంది. సచార్ కమిటీ నివేదిక ప్రకారం “చాలా బ్యాంకులు ముస్లిం కేంద్రీకృత ప్రాంతాలను‘ ప్రతికూల లేదా ఎరుపు మండలాలు గా భావిస్తున్నాయి., ఇది ముస్లిం సమాజ సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఆటంకం.
పర్యవసానంగా, 17.22 కోట్ల మంది
భారతీయ ముస్లింలలో 11.61 కోట్ల మంది ‘కార్మికులు కానివారు’ గా నమోదు చేయబడ్డారు, ప్రస్తుతం ముస్లిం సమాజంలో కేవలం 33% మాత్రమే పనిచేస్తున్నారు. 2000 నుండి, ముస్లింలలో నిరుద్యోగం భారతదేశంలోని ఇతర సమూహాలతో వేగంగా
పెరిగింది.. పట్టణ భారతదేశంలోని ‘స్వయం ఉపాధి’ లో 46% ముస్లింలు
ఉన్నారు.
పొరుగు (neighbourhood) నాణ్యత పాఠశాల
నమోదు మరియు డ్రాప్-అవుట్ రేట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని విస్తృతంగా
అంగీకరించబడింది. ముస్లిం పిల్లలు ఉన్నత విద్యలో చేరిన విద్యార్థులలో కేవలం 4.4% మాత్రమే ఉండటంలో ఆశ్చర్యం లేదు, ఇది ఇతర సామాజిక-మత సమూహాల కంటే చాలా తక్కువ. ముస్లిం సమాజం
నిరక్షరాస్యత మరియు సరిపోని క్రెడిట్ సపోర్ట్ సిస్టమ్ (ఉపాధిని సంపాదించడానికి
లేదా ఉత్పత్తి చేయడానికి రెండూ అవసరం) పరిస్థితిని ఎదుర్కొంటున్నది.
‘అండర్ క్లాస్’ యొక్క మరొక ముఖ్యమైన లక్షణం. చాలా రాష్ట్రాల్లో, ఖైదు చేయబడిన జనాభాలో ముస్లింల శాతం దాదాపు మూడు రెట్లు
లేదా మొత్తం జనాభాలో వారి శాతానికి రెట్టింపు ఉంది. . ఉత్తర ప్రదేశ్ లో ముస్లిం దోషుల convicts వాటా 19% వారి సమూహం యొక్క మొత్తం జనాభాతో సరిపోతుంది. అలాగే విచారణలో
ఉన్నవారిలో, ముస్లిమ్స్ వాటా 27% ఉంది. భారతదేశ ముస్లింల విషయంలో స్టేట్ వివక్ష, పోలీసు నిఘా మరియు నకిలీ ఆరోపణలు వంటి అంశాలు ఉన్నవి.
వ్యక్తిగత
పేదరికం యొక్క నిస్సహాయత సంఘం యొక్క పేదరికంతో కూడి ఉంటుంది.
చివరగా, ‘అండర్ క్లాస్’ యొక్క కీలకమైన
లక్షణం నిరంతర అభద్రత మరియు బెదిరింపులు. భారతీయ ముస్లింలకు గురించి సమగ్ర పరిశీలన
అవసరం. భారతీయ ముస్లింలు
“దేశ వ్యతిరేక” మరియు అదే సమయంలో ‘అప్పిజ్మేంట్Appsement” భావన ను ఎదుర్కొంటున్నారు.
ముస్లిం సమాజంలోని
సభ్యులు, పెద్ద సమూహం నుండి
తమను తాము దూరం చేసుకుంటున్నారు. ఇది మొత్తం సమూహం యొక్క అవకాశాలపై హానికరమైన
ప్రభావాన్ని చూపుతుంది. సమూహం యొక్క సాంస్కృతిక గుర్తింపు వృద్ధి చెందడానికి
మధ్యతరగతి మరియు శ్రామిక-తరగతి కుటుంబాల ఉనికి ముఖ్యమైనది.రెండవది, ‘ది అదర్’ అనే భావన సామాజిక
మినహాయింపును (social exclusion)పెంచుతుంది. ఇది ‘అండర్ క్లాస్’ యొక్క మరొక
లక్షణం.
చాలావరకు, భారతదేశ ముస్లింలను ‘పిడితులు’ గా వర్గీకరించవచ్చు.ప్రతికూల
పరిస్థితులు ఉన్నప్పటికీ, భారతీయ ముస్లింలు
ఇతరులతో మంచిగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తారు, కానీ హౌసింగ్
మార్కెట్లో వివక్ష అనేది దేశంలోని అతిపెద్ద మైనారిటీ సమూహానికి మరింత లేమి మరియు
నిరాశకు ఆధారం అవుతుంది.
No comments:
Post a Comment