5 October 2019

ముస్లిం సమాజం మర్చిపోయిన దివ్య ఖురాన్ విధులు Forgotten Duties of Koran




 Image result for holy koran

దివ్య ఖురాన్ అనేక  విషయాలను మరియు మనము నిర్వర్తించవలసిన  అనేక విధులను  సూచిస్తుంది. వాస్తవానికి, సూరా అల్-ఖసాస్: 85 లో దివ్య ఖురాన్ అబ్యసించడం మనపై ఉన్న  విధి అని దివ్య ఖురాన్ స్వయంగా సూచిస్తుంది. అందువల్ల దివ్య ఖురాన్ సూచించే అన్ని ఆజ్ఞలు మనకు విధి లేదా ఫర్జ్. మనం వాటిని నెరవేర్చాలి.  అయినప్పటికీ ప్రార్థన మరియు జకాత్ వంటి విషయాలలో మాత్రమే  దివ్య ఖురాన్ ఆజ్ఞలలో కొన్నిoటిని  మనం నిర్వహించవలసిన  విధులు అని  మనలో కొందరు తప్పుగా అనుకుంటారు. వాటి పైనే దృష్టి పెడతాము కాని దివ్య ఖురాన్లో ప్రస్తావించబడిన అనేక ఇతర ఫర్జ్ లేదా విధుల గురించి మనకు తెలియదు. దీనికి ప్రధాన కారణం దివ్య ఖురాన్ గురించిన అవగాహన లేకుoడటం లేదా  దివ్య ఖురాన్ నుండి సూత్రాల నుండి మనం దూరంగా జరగటం.


దివ్య ఖురాన్లో పేర్కొన్న సామాజిక ప్రవర్తనను నియంత్రించే అనేక నిబంధనలు మరియు నియమాలను మనం మరచిపోయినాము. దివ్య ఖురాన్లో పేర్కొన్న అటువంటి విధుల లో  ఉత్తమమైనది పలకడం.  దివ్య ఖురాన్ (17:53) ఇలా చెబుతోంది: నా దాసులకు వారు తమ నోట ఎల్లప్పుడూ ఉత్తమమైన మాటనే పలుకుతూ ఉండాలి అని చెప్పు.

ఇది ఒక సంపూర్ణ ఆజ్ఞ మరియు దీనికి మినహాయింపులు ఇవ్వబడవు. దివ్య ఖురాన్ కొన్ని ఇతర విషయాలకు సంబంధించి మినహాయింపులు ఇస్తుంది కానీ దివ్య ఖురాన్ ఎల్లప్పుడూ ఉత్తమమైన దాన్ని చెప్పండిఅనే ఆజ్ఞకు మినహాయింపు ఇవ్వదు. దీని అర్థం ఏమిటంటే  మన ప్రత్యర్థులతో కూడా మనం ఎల్లప్పుడూ ఉత్తమమైనదాన్ని మాట్లాడాలి. అందరు  మానవ జీవులు  గౌరవించబడాలి.


దివ్య ఖురాన్ ప్రకారం మనపై విధించబడిన మరొక ఆజ్ఞ ఉంది. దివ్య ఖురాన్ (17:70) ఇలా చెబుతోంది: మేము ఆదాము సంతతికి పెద్దరికాన్ని ప్రసాదిoచాము.”. హిందువులు లేదా ముస్లింలు, యూదులు లేదా క్రైస్తవులు, సయ్యద్‌లు లేదా అన్సారీలు లేదా మతం, కులం అనే తేడా లేకుండా మానవులందరు గౌరవించబడాలి. 

ఇతరులను గౌరవించడం అంటే వారితో మర్యాదగా మాట్లాడటం కాదు. వ్యక్తులుగా వారిని గౌరవించడం, అలాగే వారి అభిప్రాయాలు, వారి విశ్వాసం, వారి మతం మొదలైన వాటిపై గల  వారి హక్కును గౌరవించడం కూడా. ఇతరులను గౌరవించే ఈ విధిని ప్రజలు పాటిస్తే, అది సామాజిక సామరస్యానికి ఎంతోగా  దోహదపడుతుంది.

  చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు.”, అని దివ్య ఖురాన్ (41:34) మనకు చెబుతుంది. ఇది మనపై విధింప బడిన మరో విధి/ఫర్జ్ . ప్రతి-చెడును  చెడుతో  ప్రతిస్పందించడం సమస్యను పెద్దది చేస్తుంది. సమస్య  ఎప్పటికీ పరిష్కరించబడదు. చెడును అధిగమించడానికి ఏకైక మార్గం మంచి చేయడం. ప్రజలు ఈ దివ్య ఖురాన్ బోధన మరియు విధిని ఆచరణలో పెడితే, అది ఎంత మేలు  చేస్తుందో మీరు హించవచ్చు.

ఇక్కడ మరొక దివ్య ఖురాన్ ఆజ్ఞను పరిశీలించండి (6: 108): “అల్లాహ్ ను కాదనీ వేడుకొనే ఇతరులను దూషించకండి. ఎందుకంటే, వారు షిర్క్ కంటే ఇంకా ముందుకు పోయి అజ్ఞానం చేత అల్లాహ్ ను దూషిస్తారేమో.ఇతరుల దేవతలను తిట్టకుండటం ముస్లింల విధి. అది అంతర్-సమాజ సామరస్యాన్ని పెంచే ఒక విధి.

దివ్య ఖురాన్ ప్రకారం మన పై విధింపబడిన మరొక విధి/ఫర్జ్  న్యాయం పాటించడం. దివ్య ఖుర్ఆన్ (16: 90) ఇలా చెబుతోంది: న్యాయం చేయండి అని, ఉపకారం చెయ్యండి అని, బంధువుల హక్కులు నెరవేర్చండి అని అల్లాహ్ అజ్ఞాపిస్తున్నాడు. చెడును, ఆశిల్లతను, అన్యాయాన్ని, మీతిమీరి ప్రవర్తిoచటాన్ని నిషేదిస్తున్నాడు. అయన మీకు హిత బోధ చేస్తున్నాడు,మీరు గుణపాటం నేర్చుకోవాలని.”. ఈ ఆయత్ జుమ్మా ప్రసంగo చివరలో ఉదహరించబడుతుంది.

ఈ ఆయత్ ప్రస్తావించిన మొదటి విషయం ఏమిటంటే న్యాయం పాటించాల్సిన అవసరం లేదా అదల్(adl). న్యాయం చేయడం చాలా ముఖ్యమైన కర్తవ్యం/ఫర్జ్. అదల్ (Adl) యొక్క అర్ధంలో చేర్చబడినది ఇతదల్(etedal) -ఇది నమ్రత, మధ్య మార్గంలో నడవడం మరియు నియంత్రణను సూచిస్తుంది. మనం అన్ని సంబంధాలలో దీనిని ఒక విధిగా పాటిస్తే అది మన వ్యక్తిగత జీవితాలతో పాటు సమాజంపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది.

క్రమం తప్పకుండా ప్రార్థన మరియు ఉపవాసం మొదలైనవి మాత్రమే కాదు ఎల్లప్పుడూ మంచిగా  మాట్లాడటం, మానవులందరినీ గౌరవించడం, చెడును మంచితో స్పందించడం, పొరుగువారికి సహాయం చేయడం, వనరులను  నిల్వ చేయకుండా అందరితో పంచుకోవడం  మరియు న్యాయం చేయడం వంటి విధులను ముస్లింలు పాటిస్తే సమాజ స్వరూపమే మారిపోతుంది. నిజమైన ముస్లింలు ఈ విధుల గురించి జ్ఞానం కలిగి మరియు వాటిని ఆచరణలో పెట్టెవారు. వారు మంచిని గ్రహించడమే కాదు ఇతరులకు మంచిని పంచె వ్యక్తులు.  

నేను దివ్య ఖురాన్ అనువాదం ను అధ్యయనం చేస్తూనప్పుడు దివ్య ఖురాన్ ప్రకారం మనపై ఉన్న విధులను గ్రహించడం జరిగింది  మరియు మానవాళికి సేవ చేయవలసిన ప్రాముఖ్యతను దివ్య ఖురాన్ నాకు నేర్పినది. పై విధులన్నీ దివ్య ఖురాన్ ను అర్ధం చేసుకోవలసిన ప్రాముఖ్యతను సూచిస్తాయి. దివ్య ఖురాన్‌తో నిజమైన అనుసంధానం లేకుండా మరియు దానిని సరిగ్గా అర్థం చేసుకోకుండా మనం నిజమైన అర్థంలో ముస్లింలుగా మారలేము. దివ్య ఖురాన్ మనలను  ముస్లింలా ఉండడం నేర్పుతుంది.

ఈ రోజు, ముస్లిం సమాజం ముందు  ఉన్న  అతిపెద్ద సవాలు దివ్య ఖురాన్తో అనుసంధానించబడటం మరియు దివ్య ఖురాన్ బోధనల ప్రకారం జీవించడం మరియు మరచిపోయిన దివ్య ఖురాన్ విధులను గుర్తుంచుకోవడం.






No comments:

Post a Comment