భారత జాతీయ కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు బద్రుద్దీన్ త్యాబ్జీ
(Badruddin Tyabji, First Mulim President of Indian National Congress)
పంతొమ్మిదవ శతాబ్దం భారతదేశ చరిత్రలో పెను మార్పులు తెచ్చింది. శతాబ్దాల నాటి మొఘల్ సామ్రాజ్యం బలహీనపడి ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ విస్తారమైన దేశంపై తన పరిపాలనా, వాణిజ్య మరియు సైనిక పట్టును బిగించినది. ముస్లింలకు ఇది గణనీయమైన కష్ట కాలం.అక్బర్ మరియు షాజహాన్ల కీర్తి సుదూర జ్ఞాపకాలుగా మిగిలింది. భారతీయ ముస్లిం సమాజం అనిశ్చితి ఎదుర్కొంటున్నది. ముస్లింలు ఆధునిక విద్య మరియు వ్యాపారం మరియు అధికారాన్ని క్రమంగా జారవిడుచుకొన్నారు.
ఇటువంటి పరిస్థితులలో బద్రుద్దీన్ తయాబ్జీ భరూచ్ సమీపంలోని కాంబేలో షియా సులైమాని వోహ్రా కుటుంబంలో అక్టోబర్ 1844 లో జన్మించారు. గుజరాత్కు చెందిన షియా వోహ్రాస్ ప్రాథమికంగా చిన్న వ్యాపారవేత్తలు, వారు యెమెన్ మూలాన్ని కలిగి ఉన్నారు
ఇప్పటికి సులైమాని వోహ్రాస్ భారత దేశం లో 10,000 మంది మాత్రమే ఉన్నారు. వీరు ఎక్కువగా హైదరాబాద్ మరియు వడోదరాలో కేంద్రీకృతమై ఉన్నారు. వారు భారత జాతీయ ఉద్యమం లో పోషించిన పాత్ర మరుపురానిది. 1885 లో స్థాపించబడిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే జాతీయ రాజకీయ సంస్థ యొక్క ప్రాముఖ్యతను త్యాబ్జీ గ్రహించారు.
బొంబాయిలోని ఎల్ఫిన్స్టోన్ కాలేజి లో విద్యనభ్యసించినందున మరియు ఇంగ్లండ్తో సత్సంబంధాలు ఉన్నందున భారత జాతీయ
కాంగ్రెస్ అతని రాకను స్వాగతించింది. బద్రుద్దీన్ తయాబ్జీ ముస్లింలు మరియు దేశం ఇద్దరూ ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకున్న విద్యావంతుడైన ముస్లిం. అతను కాంగ్రెస్ పార్టీకి మూడవ అధ్యక్షుడయ్యాడు మరియు ఇది ఆ రోజుల్లో కాంగ్రెస్ ముస్లింలు మరియు హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్నడనే అభిప్రాయాన్ని కలిగించడానికి సహాయపడింది. బద్రుద్దీన్ తయాబ్జీ బొంబాయి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన మొదటి భారతీయుడు.
బద్రుద్దీన్ తయాబ్జీ కుటుంబం భారత దేశం స్వాగతించే వారసత్వాన్ని కలిగి ఉంది. బద్రుద్దీన్ త్యాబ్జీ కుటుంబ సబ్యుడు అబ్బాస్ త్యాబ్జీ మహాత్మాకు చాలా దగ్గరయ్యారు. దండి ఉప్పు మార్చ్ నిర్వహిణలో ప్రముఖ పాత్ర వహించినాడు
మరియు రెహనా త్యాబ్జీ మరియు ఆమె సోదరి హమీదా గాంధీజీకి సాల్ట్ మార్చ్ నడక
లో సహాయపడినారు. రెహనా గాంధీజీకి ఇష్టమైన భజన్ గాయని.. ఇంకొక మనవరాలు సురయ్య మన జాతీయ జెండాను రూపొందించినది.. అజీమ్ త్యాబ్జీ పాత బరోడా రాష్ట్రంలో ముస్లిం విద్యలో మార్గదర్శకుడు. ఇద్రిస్ భారత వైమానిక దళ చీఫ్ మరియు తరువాత మహారాష్ట్ర గవర్నర్ అయ్యారు.
మనవడు బద్రుద్దీన్ అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ మరియు జపాన్ రాయబారి. ఈ కుటుంభానికి చెందిన మూడవ మరియు నాల్గవ తరాలు దేశాన్ని
సుసంపన్నం చేసారు. జాబితా లో నసీమ్,మరియు భారత కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి జాఫర్ సైఫుల్లా ఉన్నారు.
అక్టోబర్ 10 బద్రుద్దీన్ పుట్టినరోజు, ఆ రోజున భారతీయ ముస్లింలు అతనిని ఘనం గా గుర్తు ఉంచుకొందాము.
No comments:
Post a Comment