Sher Ali Afridi, photograph taken after he
killed Lord Mayo
షేర్ అలీ అఫ్రిది, లార్డ్ మాయోను చంపిన తరువాత
తీసిన ఛాయాచిత్రం
షేర్ అలీ గా పిలువబడే షేర్ అలీ అఫ్రిది 1872 ఫిబ్రవరి 8 న భారత వైస్రాయ్ లార్డ్ మాయో(Lord Mayo)ను చంపినందుకు ప్రసిద్ది చెందాడు.
ఆ సమయంలో అతను అండమాన్ మరియు నికోబార్ దీవులలో హత్య నేరం క్రింద శిక్ష అనుభవిస్తున్నాడు.
షేర్ అలీ ఖైబర్ ఏజెన్సీలోని తిరా
లోయ ప్రాంతానికి చెందిన వాడు మరియు
పెషావర్ కమిషనర్ కోసం పనిచేశాడు. అతను అంబాలాలోని బ్రిటిష్ అశ్వికదళ రెజిమెంట్‌లో పని చేశాడు. అతను 1857 నాటి భారత తిరుగుబాటు
సమయంలో రోహిల్‌ఖండ్ మరియు ఔధ్‌లోని ప్రెసిడెన్సీ సైన్యాలలో (అంటే ఈస్ట్ ఇండియా
కంపెనీకి) పనిచేశాడు. తన మంచి వ్యక్తిత్వం కారణంగా, షేర్ అలీ
యూరోపియన్లలో బాగా ప్రాచుర్యం పొందాడు.
షేర్ అలీ తన కుటుంబ తగాదాలలో భాగంగా
తన బంధువులలో ఒకరైన హైదూర్ ను పెషావర్ వద్ద చంపాడు మరియు అతను తనను నిర్దోషిగా
వాదించినప్పటికి అతనికి 2 ఏప్రిల్ 1867 న మరణశిక్ష విధించబడింది.కల్నల్ పొల్లాక్ అతని మరణశిక్షను రద్దు చేశాడు,
మరియు ద్విపాoతరవాస శిక్ష విధించారు. షేర్ అలీని పోర్ట్ బ్లెయిర్‌కు, ప్రత్యేకంగా వైపర్ ద్వీపానికి తరలించారు. జైలు లో సత్ప్రవర్తన కారణంగా పోర్ట్ బ్లెయిర్ వద్ద మంగలిగా పనిచేయడానికి
అతనికి అనుమతి లభించింది.
పోర్ట్ బ్లెయిర్ 1789 లో బ్రిటిష్ వారి వ్యూహాత్మక అవుట్ పోస్ట్
మరియు శిక్షా కాలనీగా ఎంపిక అయ్యింది కాని అక్కడ మలేరియా ప్రబలిన కారణంగా ఏడు సంవత్సరాల తరువాత
వదిలివేయబడింది.. పోర్ట్ బ్లెయిర్ 1824 లో బర్మాపై దాడి
చేసినందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క దళాలకు స్టేజింగ్ పోస్టుగా పనిచేసింది.
1857 తిరుగుబాటు తరువాత పోర్ట్ బ్లెయిర్ శిక్షా కాలనీ పునరుద్ధరించబడినది మరియు అక్కడి ఖైదీలు రోడ్లు, భవనాలు మరియు జైళ్ళను నిర్మించారు. అక్కడ పరిస్థితులు భయంకరమైనవి, మరియు చాలామంది ఉరితీయబడ్డారు లేదా స్థానిక
నివాసులను ఎదుర్కొన్నప్పుడు మరణించారు. 1872 నాటికి పోర్ట్
బ్లెయిర్‌లో 7,000 మందికి పైగా ఖైదీలు ఉన్నారు, వారిలో ప్రమాదకరమైనవారు వైపర్ ద్వీపంలో ఉంచ బడినారు. వారిలో షేర్ అలీ ఒకడు.
1869 లో రిచర్డ్ సౌత్‌వెల్
బోర్క్, మాయో యొక్క 6 వ ఎర్ల్ మరియు 4 వ వైస్రాయ్ ఆఫ్ ఇండియా (Richard
Southwell Bourke, the 6th earl of Mayo and the 4th Viceroy of India) పోర్ట్ బ్లెయిర్ పర్యటనకు వచ్చారు. మరియు వైపర్ మరియు రాస్ ద్వీపాలలో పర్యటించారు. అప్పుడు ద్వీపం సమూహాoను భారతదేశం నుండి వచ్చిన నేరస్థులు మరియు రాజకీయ
ఖైదీల కోసం బ్రిటిష్ శిక్షా కాలనీగా ఉపయోగించేవారు. లార్డ్ మాయో ద్వీపాల యొక్క
ప్రధాన పట్టణం పోర్ట్ బ్లెయిర్ యొక్క పరిపాలన నిబంధనలను రూపొందించినారు.
సాయుధ అంగరక్షకుల కాపలా మద్య వైస్రాయ్
రోజంతా ద్వీపాలలో పర్యటించాడు.
ఫిబ్రవరి 8 న, వైస్రాయ్
తన తనిఖీని దాదాపుగా పూర్తి చేసి, రాత్రి 7:00 గంటలకు లేడీ మాయో కూడా వేచి ఉన్న తన పడవ వద్దకు తిరిగి వస్తున్నప్పుడు, షేర్ అలీ అఫ్రిది చీకటిలో పొంచి ఉండి అతనిని పొడిచి చంపాడు. షేర్
అలీని వెంటనే లార్డ్ మాయో యొక్క పన్నెండు మంది భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు.
లార్డ్ మాయో త్వరలోనే మరణించాడు. ఈ సంఘటన, ద్వీప సమూహం లోని హ్యారియెట్ పర్వతం వద్ద జరిగింది.
బ్రిటీష్ క్రౌన్ నియమించిన భారత
అత్యున్నత అధికారి వైస్రాయ్ హత్య బ్రిటన్ మరియు బ్రిటిష్ ఇండియా అంతటా షాక్
తరంగాలను పంపింది. షేర్ అలీ అఫ్రిది తనకు విధించిన శిక్షకు ప్రతీకారంగా సూపరింటెండెంట్ మరియు
వైస్రాయ్ లను చంపాలని అనుకున్నాడు. అతను సమయం కోసం వేచి ఉన్నాడు మరియు సాయంత్రం
వైస్రాయ్ను చంపడానికి అవకాశాన్ని పొందాడు. తాను దేవుని సూచనల మేరకు చంపానని మరియు ఈ చర్యలో అతను దేవుని భాగస్వామిగా
పేర్కొన్నాడు. ఈ హత్య లో అతను మినహా ఇతర
ఖైదీలు ఎవరికీ సంభందం లేదని బ్రిటిష్ వారు తమ విచారణ లో తేల్చారు. షేర్ అలీ అఫ్రిది మరణశిక్షకు గురయ్యాడు మరియు
వైపర్ ఐలాండ్ జైలు లో 11 మార్చి 1873 న ఉరిలో ఉరితీయబడ్డాడు.
వైస్రాయ్‌ను హత్య కేవలం వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన నేరపూరిత చర్యగా చెప్పబడింది. అయినప్పటికీ, కొంతమంది ఆధునిక పండితులు
దీనిని మరో విధంగా అర్థం చేసుకుంటున్నారు.
వైపర్ ద్వీపంలో లార్డ్ మాయో యొక్క
విగ్రహం ఉంది, కానీ
షేర్ అలీ అఫ్రిది గురించి, ఎక్కడా ప్రస్తావనే లేదు
No comments:
Post a Comment