ఇస్లాం దైవారాధనలో పాల్గొనమని స్త్రీ మరియు పురుషులు ఇద్దరినీ
ఆహ్వానించింది మరియు దానికి ప్రతిపలం ఇరువురికి సమానం గా ప్రసాదించినది. విశ్వాసం
యొక్క బాధ్యతలను నెరవేర్చడంలో స్త్రీ-పురుషులకు సమాన హోదా లభించింది. ఇస్లాంలో స్త్రీలకు
పురుషుల మాదిరిగానే బాధ్యతలు కూడా ఉన్నాయి. స్త్రీ, పురుషులు ఇద్దరూ
కలసి మెరుగైన సమాజాన్ని సృష్టించగలరు.
సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దివ్య ఖురాన్లో ఇలా చెప్పాడు: “విశ్వాసులైన పురుషులు
మరియు విశ్వాసులైన మహిళలు వారందరూ ఒకరికొకరు సహచరులు, వారు మేలు చేయండి అని
అజ్ఞాపిస్తారు. చెడు చేయవద్దు అని నిరోదిస్తారు. నమాజును స్థాపిస్తారు. జకాత్
ఇస్తారు. అల్లాహ్ పట్ల అయన ప్రవక్త పట్ల విధేయత పాటిస్తారు.”(9:71)
పై ఆయత్ లో విశ్వాసులైన, స్త్రీ-పురుషుల
యొక్క కొన్ని ప్రత్యేక లక్షణాలు ప్రస్తావించబడ్డాయి. పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ
సమాన ప్రాముఖ్యత ఇవ్వబడినది మరియు ఇద్దరూ
కలిసి ప్రస్తావించబడ్డారు. ఇద్దరికీ (స్త్రీ-పురుషులు) సంబంధించి, వారు
వ్యక్తిగతంగా మరియు సమిష్టిగా అమలు చేయాల్సిన పనులు ప్రస్తావించబడ్డాయి. వారు నమాజును
స్థాపించాలని, జకాత్ ఇవ్వాలని మరియు అల్లాహ్ మరియు అతని ప్రవక్త పట్ల విధేయత చూపాలని ప్రస్తావించబడింది.
వారు మేలు చేయండి అని అజ్ఞాపిస్తారు. చెడు చేయవద్దు అని నిరోదిస్తారు
అని ప్రస్తావించబడింది. వారు ఇతరులను కూడా ధార్మిక సేవకు ఆహ్వానించాలి మరియు వారు దానిని అనుసరించేలా
చూడాలి. ఈ పనిలో స్త్రీ-పురుషులు
ఒకరికొకరు సహాయపడతారు
ముస్లిం మహిళలకు సమాజాన్ని సంస్కరించే రంగంలో చాలా అవకాశాలు
ఉన్నాయి. వారు తమ ప్రతిభ ద్వారా తమ కుటుంబానికి
మరియు సమాజానికి మాత్రమే కాకుండా మొత్తం మానవాళికి చాలా మంచి చేయగలరు.
స్త్రీకి కార్యకలాపాల
యొక్క మొదటి ప్రాంతం ఆమె సొంత ఇల్లు. ఆమె కు ప్రత్యక్ష మరియు సన్నిహిత సంబంధం భర్త
తో ఉంది. అతని పై ఆమెకు గల హక్కు అందరి కన్నా ముందు ఉంటుంది. వారు జీవితం లో సమాన
భాగస్వాములు.
సునన్ అబూ దావూద్ లో
పేర్కొన్న ఒక హదీసులో, ప్రవక్త (స)
ప్రార్థన కోసం రాత్రి తనను తాను మేల్కొడమే కాకుండా, తన భర్తను మేల్కొల్పే స్త్రీ పట్ల అల్లాహ్
ను దయ చూపమని ప్రార్థించారు.
తిర్మిజి హదీసులో స్త్రీ తన భర్తకు తన విశ్వాసానికి అనుగుణంగా
ఉండటానికి సహాయపడే ఉత్తమ ఆస్తిగా ప్రకటించబడింది.
స్త్రీ దార్మికవంతురాలు
అయి ఆమె భర్త కానప్పుడు ఆమె బాధ్యత పెరుగుతుంది. ప్రేమ, కరుణ మరియు
సానుభూతి ద్వారా అతన్ని అర్థం చేసుకోవడానికి మరియు ధార్మిక వెలుగు ను చూపించడానికి ఆమె ప్రయత్నించాలి.
ఆమె రెండవ
కార్యాచరణ ప్రాంతం ఆమె పిల్లల సంస్కరణ. బుఖారీ మరియు ముస్లిం ఒక హదీసులో స్త్రీ తన
పిల్లల గురించి తీర్పు రోజున అల్లాహ్ చే ప్రశ్నించబడుతుందని పేర్కొన్నారు. తన పిల్లలకు ధార్మిక
అవగాహన కల్పించడం మరియు ఇస్లాంకు అనుగుణంగా
వారి నైతికత మరియు స్వభావాన్ని తీర్చిదిద్దటం తల్లిగా ఆమె బాధ్యత. పిల్లలను సంస్కరించడంలో ముస్లిం తల్లులు
చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.
ఆమె మూడవ కార్యాచరణ
ప్రాంతం ఆమె కుటుంబం యొక్క సంస్కరణ. ఒక ముస్లిం మహిళ తన సోదరులు, సోదరీమణులు, వారి పిల్లలు
మరియు అత్తమామలను సంస్కరించవచ్చు మరియు విద్యావంతులను చేస్తుంది. ఆమె చిన్నపిల్లలకు
ధార్మిక జ్ఞానం ఇవ్వగలదు. యువతకు ఇస్లాం గురించి సమాచారం ఇవ్వగలదు. ఇస్లాం పట్ల అపోహలను
తొలగించగలదు. యువతరం లోని నైతిక బలహీనతలు సరిదిద్దగలదు. సంక్షిప్తంగా, కుటుంబాన్ని ధార్మిక పరం చేయటంలో విద్యావంతులైన
మహిళ పాత్ర చాలా ముఖ్యం.
ఆమె నాల్గవ కార్యాచరణ
ప్రాంతం ఆమె పరిసరాల సంస్కరణ. ఒక ముస్లిం మహిళ షరీయా పరిమితిలో ఉంటు కూడా ఈ రంగంలో
ముఖ్యమైన సేవలను అందించగలదు. తన ఇంటి వెలుపల తన ధార్మికపరమైన బాధ్యతలను నెరవేర్చడానికి
అవకాశాలు ఉంటే, ఆమె తన ఇరుగుపొరుగు
మరియు తన సొంత పట్టణంలోని మహిళల ఇళ్ళు
లేదా అపార్టుమెంటులకు వెళ్లి వారిని వ్యక్తిగతంగా కలుసుకోవడం ద్వారా ఆమె వారిలో
ధార్మిక భావనలు ప్రచారం చేయగలదు. మహిళలు మరియు పిల్లల కోసం ధార్మిక కార్యక్రమాలు
ఇతర పట్టణంలో జరుగుతుంటే ఆమె సులభంగా మరియు భద్రతతో అక్కడికి చేరుకోగలిగితే, ఆమె అలాంటి
కార్యక్రమాల్లో పాల్గొనాలి.
కొన్ని కారణాల వల్ల, బయటికి వెళ్లడం
సాధ్యం కాకపోతే, ఆమె ఇంట్లో ఉండడం
ద్వారా సంస్కరణ మరియు ధార్మిక విద్యా కార్యకలాపాలను చేయగలదు. సోషల్ మీడియా ఈనాడు భారీగా
విస్తరించింది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కూడిన వాట్సాప్ సమూహాలను
సృష్టించడం ద్వారా, ఆమె వారికి
ప్రయోజనకరమైన ధార్మిక జ్ఞానం షేర్ చేయగలదు.
ఫేస్‌బుక్‌ను గొప్ప వేదికగా ఉపయోగించవచ్చు. ఆమె దివ్య ఖురాన్ మరియు హదీసు పాఠాలు
మరియు ఇతర ఉపన్యాసాలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. ఆమె ఆన్‌లైన్ ధార్మికవిద్యా
మరియు సంస్కరణ తరగతులను నిర్వహించగలదు.
సర్వశక్తిమంతుడైన అల్లాహ్
స్త్రీకి అత్యంత ప్రయోజనకరమైన ప్రతిభను
అందించాడు. దానిని ఉపయోగించడం
ద్వారా ఆమె సమాజ సంస్కరణలో కీలక పాత్ర పోషిస్తుంది.
No comments:
Post a Comment