ఇస్లాం మరియు ప్రజాస్వామ్యo ఈ అంశం చాల కాలం నుండి విధాన
నిర్ణేతలు, పండితులు, మీడియా, మరియు ప్రపంచంలో అనేక
దేశాల సాధారణ జనాభా దృష్టిని
ఆకర్షిస్తుంది.
ప్రజాస్వామ్యం ఒక ఆలోచనా విధానం. ప్రజాస్వామ్యం యొక్క
సిద్ధాంతాలు పురాతన గ్రీక్ లో ఆవిర్భవించిప్పటికీ దానికి ఒక పాశ్చాత్య భావన గా నాలుగు శతాబ్దాల
చరిత్ర ఉంది.
ముస్లింలు ప్రజాస్వామ్యం గురించి చర్చిoచినప్పుడు, నిజానికి అది పాశ్చాత్యుల
నవీన భావన కాదంటారు. ఇస్లామిక్ స్వర్ణ యుగ ముస్లిం తాత్వికులు /ఆలోచనాపరులు తమ
రచనలలో ప్రజాస్వామ్య భావనలను విస్తృతంగా చర్చించారు. అసలు ప్రాచిన గ్రీక్
తత్వవేత్తల ప్రజాస్వామ్య భావాలను
వెలుగులోనికి తెచ్చింది ముస్లిం స్వర్ణ యుగ తాత్వికులు/ఆలోచనాపరులు. ముస్లిం
స్వర్ణయుగ తాత్వికులు /ఆలోచనాపరులు ప్లేటో, అరిస్తోటిల్ భావాలను విస్తృతంగా
ప్రచారం చేసారు. బాగ్దాద్ లో స్థాపించిన బైత్ ఉల్ హిక్మా ద్వారా అనేక వేల గ్రీక్
గ్రంధాలను అరబిక్ లోనికి అనువదింపబడి పాశ్చాత్య దేశాలకు/యూరప్ కి పరిచయం చేయబడినవి
ఆ తరువాత అవి లాటిన్ లోకి అనువదిoప బడినవి.
ఇస్లామిక్ స్వర్ణయుగ తత్వవేత్త అల్ ఫరాబి ప్రపంచం లో రెండవ ఉపాధ్యాయుడు (“the second
master" of philosophy) (అరిస్టాటిల్ మొదటివాడు) మరియు ప్రపంచం యొక్క
గొప్ప తత్వవేత్తలలో ఒకడుగా పిలువబడతాడు. అరిస్టాటిల్ మరియు ప్లాటోనిక్ ఆలోచనల
విశ్లేషణ లో అతని కృషి గొప్పది. ఇస్లాం
మరియు ప్రజాస్వామ్యం పరస్పర పూరకాలు అని వాదించిన
తత్వవేత్త అల్-ఫరాబి. ప్రజాస్వామ్యంపై అతని భావాలు ఉన్నతమైనవి. పడమటి
దేశాల వారిచే అవెర్రొస్ గా పిలవబడే ఇబ్న్
రష్ద్ ను కొoదరు విమర్శకులు ఆధునిక జ్ఞానోదయం ఉన్న పడమటి అరిస్తోతిల్ అని వర్ణించారు.
ఆధునిక యుగం లోని అమెరికన్ రాజ్యాంగం పై ప్రవక్త ముహమ్మద్ (స)
రచించిన మదీనా చాప్టర్ లేదా మదీనా రాజ్యాంగ ప్రభావం కలదు.ఆధునిక ప్రజాస్వామ్య
భావనలైన స్వేఛ్చ, సమానత్వం, సౌబ్రాతృత్వం, సలహా-సంప్రదింపులు, చర్చా స్వాతంత్ర్యం అనేవి నిజానికి ప్రధానంగా ఇస్లామిక్
ఆశయాలు. మానవ హక్కులు, స్త్రీల
హక్కులు,అల్ప సంఖ్యాకుల హక్కులు, యుద్ద ఖైదీల హక్కులను ను తొలుత ప్రసాదించినది
ముస్లిములే. ఇస్లాం లో ఎన్నిక(election) ఉంది కాని ఎంపిక(selection) లేదు.
సాధారణ పాశ్చాత్య అవగాహన ప్రకారం "ఇస్లాం "
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం మరియు నిరంకుశత్వాన్ని ప్రోత్సహించును. ఉదాహరణకు పద్దెనిమిదవ శతాబ్దం ఒట్టోమన్
సామ్రాజ్యం యొక్క సుల్తానులు లేదా ఇరాన్
యొక్క షా వంటి ముస్లిం నాయకులు, ఓరియంటల్
నియంతృత్వానికి ఉదాహరణలు గా చెప్పవచ్చును.
ఆధునిక యుగంలో కొందరి ప్రకారం ఇస్లామిక్ రాజకీయ సంస్కృతి నిరంకుశత్వాన్ని
ప్రోత్సహించును మరియు ప్రజాస్వామ్య విలువలను
తిరస్కరిస్తుంది.ఇస్లాం భౌతిక శక్తి ద్వారా స్థాపితమైంది.
ఇరవయ్యో శతాబ్దపు హార్వర్డ్ స్కాలర్ సామ్యూల్ P. హంటింగ్టన్ తన “నాగరికతల క్లాష్” థీసిస్ లో ముస్లింలు హింసాత్మక
దొరణులను ప్రోత్సహించడానికి మతం ను ఉపయోగిస్తారు అని అంటాడు. కాని పై భావన ఇస్లామిక్ సమాజాల ఆశయాలకు
విరుద్దంగా ఉంది. నిజానికి మతాన్ని హింసను పెంచడానికి ఉత్తర ఐర్లాండ్, భారతదేశం, శ్రీలంక, మరియు యునైటెడ్ స్టేట్స్
లో ఉపయోగిస్తున్నారు.
ప్రపంచంలోని, అనేక ముస్లిం రాజ్యాలు, ప్రభుత్వాలు పాశ్చాత్యుల
(వెస్ట్) వైపు ఘర్షణ కాకుండా రాజీ పడే
విధానాలను అనుసరించారు. ఇస్లాం హింసను ప్రేరేపిస్తున్నది అనే భావన తప్పు. అంతేకాక
పరిశోధకులు ప్రజాస్వామ్యo పై తమ
అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు ముస్లింల స్పందన పాశ్చాత్యుల (వెస్ట్) స్పందన కు సామ్యం ఉంది. నోరిస్ మరియు
ఇంఘ్లేహర్ట్ ప్రజాస్వామ్య భావనాలను పోలిస్తే ముస్లిం ప్రపంచం మరియు
పాశ్చత్య ప్రపంచం మధ్య తేడా తక్కువ ఉంది
అన్నారు.
అన్నారు.
ప్రజాస్వామ్య నియమాల వినియోగం వలన అధికారనికి నష్టం చేస్తుందనే భయం తో కొందరు ముస్లిం
నాయకులు ప్రజాస్వామ్యంను వ్యతిరేకించారు. మరి
కొoదరు ముస్లిం మత ప్రతినిధులు ప్రజాస్వామ్యం ను లౌకికవాదం యొక్క ఒక ప్రస్తావన గా నమ్మారు. మరియు మతం మరియు రాజకీయాలు రెండు వేరు కాదు అని
నమ్ముతారు.
పై అంశాలు నిజమైన
ఇస్లాం మరియు ప్రజాస్వామ్యం పరస్పర
విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పడం కాదు కేవలం కొందరు నేతలు ప్రజాస్వామ్యానికి
పట్టుగొమ్మలైన పారదర్శకత, జవాబుదారీ తనం లేకుండా పాలించటం అని అర్థం.
పవిత్ర గ్రంథాల సూచనలు
వివరణలు తగినంతగా మరియు ప్రజాస్వామ్య విలువల అమలు చారిత్రాత్మకంగా
ఎక్కువగా ఉంటే, ముస్లిం మెజారిటీ గల
సమాజాల్లో ప్రజాస్వామ్య అభివృద్ధి ఖచ్చితంగా సాధ్యమవుతుంది.
ముస్లిం మత విశ్వాస బోధనలు, నాయకుల పాలన తప్పనిసరిగా ఆచరణలో కమ్యూనిటీ (ummah) ప్రయోజనాల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఎందుకంటే సామాజిక లేదా కమ్యునిటేరియన్ ప్రజాస్వామ్యం ఇస్లామిక్
బోధనలకు అనుకూలంగా ఉండటం కనిపిస్తుంది. ఇస్లాం ప్రకారం సమాజ సంక్షేమం
లోనే వ్యక్తిగత సంక్షేమం ఇమిడి ఉంది.
ముస్లిం సమాజం లోని విస్తృత ప్రజానీకానికి ప్రజాస్వామ్యo పట్ల అకర్షణ ఉంది. ప్రజలు స్పష్టంగా ఇస్లామిక్ విలువలను ప్రజాస్వామ్యం
పట్ల తమ ప్రేరణలలో
ప్రధాన భాగం గా భావించారు.ఇస్లాం నమ్మకాలు మరియు చర్యలు ప్రజాస్వాయ ఆదర్శ అభిరుచులను వివరించును. ఖచ్చితంగా ఈ విశ్వాసం లేదా ఇస్లాం ప్రజాస్వామ్య విలువలకు అనుకూలంగా ఉంది.
No comments:
Post a Comment