ముస్లింలు ఒకప్పుడు అనగా
ఇస్లామిక్ స్వర్ణ యుగం (8-14శతాబ్దాల) లో అనేక విజ్ఞాన,శాస్త్ర, సాంకేతిక రంగాలలో నాయకులుగా ఉన్నారనేది వాస్తవం.
దీనినీ చాలా మంది ముస్లిమేతర పండితులు కూడా
అంగీకరించారు. పడమటి దేశాలలో వివిధ విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాలలో నేటికి ప్రారంబ ముస్లిం ఆలోచనాపరుల (Early Muslim
Thinkers) రచనలు ప్రామాణికంగా పరిగణిoచ బడుతున్నాయి.
ఇంతటి ప్రగతి అనేక
శతాబ్దాల క్రితం ఎందుకు ఆగిపోయింది? అని అనేక మంది తరచుగా అడుగుతారు. ఒకప్పుడు సైన్స్
మరియు జ్ఞాన(knowledge) సంపాదన లో
ముందంజలో ఉన్న ముస్లింలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తక్కువ విద్యావంతులైన ప్రజలుగా ఎలా
ఉన్నారు? అనేది అందరు అడిగే ప్రశ్న.
దీనికి సులభమైన నమ్మదగిన సమాధానం ఉంది.
సైన్స్ మరియు అభ్యాసన(learning) రంగాలలో ముస్లింల మేధా క్షీణతకు కారణం ముస్లింలు దివ్య ఖురాన్
మరియు దాని బోధనల నుండి దూరం కావడం ప్రారంభించారు. ముస్లింలు దివ్య ఖురాన్ సూత్రాల
నుండి నుండి దూరంగా జరగటం ప్రారంభించినప్పుడు, వారి జ్ఞానం మరియు అభ్యాసం యొక్క అవగాహన కూడా మారడం
ప్రారంభమైంది
దివ్య ఖురాన్ లోని
జ్ఞానం (ఇల్మ్ilm) యొక్క అవగాహన సమగ్రమైనది. దివ్య ఖురాన్ లోని అనేక ఆయతులు ప్రకృతి
యొక్క వివిధ దృగ్విషయాలను అర్ధం చేసుకోమని ప్రజలను ప్రోత్సహిస్తాయి. ఉదాహరణకు, దివ్య ఖురాన్ (3: 190) ఇలా చెబుతోంది: “ఆకాశం మరియు భూమి
యొక్క నిర్మాణం గురించి వివేకవంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి”. ఇలాంటి ఆయతులు దేవుని
సృష్టి గురించి జ్ఞానాన్ని పెంపొందించడానికి ప్రోత్సహిస్తాయి. జ్ఞానం దేవుని పట్ల
మన అవగాహన పెరగడానికి ఒక సాధనం. జ్ఞానం గురించి
దివ్య ఖురాన్ వివరణతో ప్రేరణ పొందిన, చాలామంది ప్రారంభ ముస్లింలు ఈ రోజు ‘సైన్సెస్’ అని పిలువబడే
వివిధ విజ్ఞాన, శాస్త్ర, సాంకేతిక, కళ మరియు లిటరేచర్ మొదలగు జ్ఞాన రంగాలలో అద్భుతమైన కృషి చేశారు.
అయితే, తరువాతి శతాబ్దాలలో, ముస్లింలు దివ్య ఖురాన్ బోధనల నుండి దూరం అవడం ప్రారంభించగానే, జ్ఞానం యొక్క ఈ సంపూర్ణ అవగాహన త్వరలోనే మరుగున పడింది.
జ్ఞానం కృత్రిమంగా మరియు ఏకపక్షంగా ‘మత’ (దీని ) మరియు ‘ప్రాపంచిక’ (దునియావి) అనే రెండు విభిన్న వర్గాలుగా విభజించబడింది. దివ్య
ఖురాన్లో అటువంటి వ్యత్యాసం లేదు.
అల్లాహ్ మానవులకు అన్ని
రంగాలలో జ్ఞానాన్ని పొందగల సామర్థ్యాన్ని ఇవ్వగా, కొంతమంది ముస్లింలు మత (దీని)జ్ఞానాన్ని
మాత్రమే అనుసరించాలని ప్రకటించారు, వారు ‘ప్రాపంచిక’ (దునియావి) జ్ఞానాన్ని నిషేధించారు లేదా తక్కువ
ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా ముస్లింలు జ్ఞానం
యొక్క వివిధ విషయాలలో అగ్రగామి స్థానం నుండి చివరి స్థానం కు చేరారు.
ముస్లింలు వదిలిన జ్ఞాన
సంపద ఆధారంగా పశ్చిమ దేశాలవారు శాస్త్ర, సాకేంతిక మొదలగు బిన్న జ్ఞాన రంగాలలో
ముందు ఉండి అనేక వైజ్ఞానిక ఆవిష్కరణలు రూపొందించారు. ఈనాడు నోబెల్ బహుమతులు అన్ని పడమటి దేశాల వారికే
లబిస్తున్నాయి. ముస్లిం దేశాలలో అక్షరాస్యత ముఖ్యంగా మహిళా అక్షరాస్యత అల్పంగా
ఉంది. ఇప్పటికైనా ముస్లింలలో అక్షరాస్యత పెరగకపోతే వారి జీవన పరిస్థితులు మారవు.
దివ్య ఖురాన్ లో అల్లాహ్ అంటాడు: ఏ జాతి తన్ను తానూ స్వయంగా మార్చు కోకపోతే వారి
పరిస్థితులను అల్లాహ్ కూడా మార్చలేడు.”
No comments:
Post a Comment