విజయ గాద.
ఇటీవల ఫలితాలు ప్రకటించిన తరువాత, యుపిపిసిఎస్ UPPCS లో 6 వ ర్యాంకు
సాధించి, ఎస్‌డిఎమ్ SDM (డిప్యూటీ
కలెక్టర్) గా ఎంపికైనందుకు బుష్రా అర్షద్ ప్రశంసలు అందుకుంటున్నారు. సౌరిఖ్
గ్రామానికి చెందిన ఓ అమ్మాయి యుపిపిఎస్సి -2017 లో ఉత్తీర్ణురాలు
అయి ఎస్‌డిఎంగా చేరిన ఏకైక ముస్లిం వనిత. ఈమె యుపిఎస్‌సి UPSC లో కూడా277 వ ర్యాంకు
సాధించి ఐఆర్‌ఎస్IRSకు ఎంపికయ్యారు,
కాని తను సాధించిన విజయాలతో ఆమె సంతృప్తి చెందలేదు.
తన తాజా విజయంతో కూడా ఆమె సంతృప్తి చెందలేదు, IAS లో టాప్ 20 లో ఉండాలనే తన
కలను సాధించటానికి ఆమె మరింత పట్టు మరియు అభిరుచిని చూపిస్తుంది
ఆమె కుటుంబం,
బంధువులు మరియు భర్త అందరూ ఆమె తక్కువ కోసం సిద్దపడదని నమ్ముతారు. వారి నమ్మకానికి కారణం ఉంది: ఒక గ్రామీణ
అమ్మాయి, వివాహం
తరువాత పిల్లలు , నాలుగు
శస్త్రచికిత్సల తరువాత ఆ శస్త్రచికిత్సల బాధను అధిగమించి, ప్రతిష్టాత్మక
పరీక్షలలో ఒకదానిలో ఇంత ఉన్నత ర్యాంకు సాధించినది. ఆమె కు ప్రతిదీ సాధ్యమే. బుష్రా అడ్డoకులను అధిగమించే
ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఆదర్శప్రాయమైన
విజయాలు సాధించ గలగుతుంది.
బుష్రా తండ్రి ఒక రైతు మరియు తల్లి గృహిణి. ఒక సోదరుడు
మరియు ఒక సోదరి. వారు కూడా బాగా
చదువుతారు. తల్లిదండ్రులు ఇద్దరూ గ్రాడ్యుయేట్లు. బుష్రా, తల్లి షామా
మాటలలో
బుష్రా ఖచ్చితంగా “అసాధారణమైన ప్రతిభ”
మరియు దృఢ విశ్వాసం కలది.. బుష్రా నాలుగవ సంవత్సరాల వయసులో నేరుగా రెండవ తరగతికి
చేరింది. ఆమె ఏ తరగతి లోను రెండవ స్థానంలో రాలేదు." బుష్రా టాపర్‌గా ఉండటానికి
అలవాటుపడింది. ఆమె మల్టీ టాలెంటెడ్ అమ్మాయి.
ఆమె కన్నౌజ్ నుంచి పన్నెండో తరగతి వరకు చదువు పూర్తి చేసి
గ్రాడ్యుయేషన్ కోసం కాన్పూర్ వెళ్ళింది బుష్రా పదిహేడేళ్ళ వయసులో పట్టభద్రురాలు
అయినది. ఆమె 20
ఏళ్లు నిండకముందే ఎంబీఏ డిగ్రీ పొందినది.. తరువాత బుష్రా యుపిఎస్‌సి పరీక్షకు
హాజరు అవ్వాలను కొంది. కానీ ఆమెకు UPSC పరీక్షా హాజరు అగుటకు కావలసిన కనీస వయస్సు లేనందున జెఆర్ఎఫ్ పరీక్ష కు హాజరయ్యారు.
ఆమె తన మొదటి
ప్రయత్నంలోనే జెఆర్‌ఎఫ్‌ను క్లియర్ చేసి AMU
నుండి డిస్ట్రెస్ మేనేజ్‌మెంట్‌లో పిహెచ్‌డి సాధించింది.
ఆ తర్వాత, ఆమె అలీఘర్
నివాసి అస్మర్ హుస్సేన్‌ను వివాహం చేసుకుంది. కొంతకాలం తరువాత ఇంజనీర్ అస్మార్
హుస్సేన్, బుష్రా
సౌదీకి వెళ్లారు. అస్మార్ తన అధ్యయనాలను జజాన్ విశ్వవిద్యాలయంలో ప్రారంభించగా, బుష్రా ఉన్నత
స్థాయి ఉద్యోగాన్ని పొందింది.కొంత కాలం
తరువాత ఉన్నత స్థానం మరియు అద్భుతమైన
ప్యాకేజీని వదిలి బుష్రా తన భర్తతో కలిసి భారతదేశానికి తిరిగి వచ్చారు.
బుష్రా ఇలా అంటారు
“మేము భారతదేశానికి తిరిగి రావడానికి ఒకే ఒక కారణం మాతృదేశం
పట్ల అపరిమితమైన ప్రేమ మరియు 'దేశభక్తి', నేను సంపాదించిన
జ్ఞానం, నైపుణ్యాల
వలన నామాతృ దేశం ప్రయోజనం పొందాలని నేను తరచుగా
ఆలోచించేదానిని.
ఇండియా వచ్చిన తరువాత ఆమె భర్తకు కోల్ ఇండియాలో ఉద్యోగం లబించినది
మరియు వారికి
ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆమెకు నాలుగు పెద్ద శస్త్రచికిత్సలు జరిగినవి. కాని లోపల
కలెక్టర్ కావాలన్న కోరిక ఆమెను నిరంతరం ప్రేరేపించింది.
ఆమె భర్త మాటలలో నా భార్య బుష్రా కారు ముందు సీట్లో కూర్చోవడం
ఒక అలవాటుగా మారింది. ఆమె అనుకొన్నది తప్పని సరిగా సాధిస్తుంది
బుష్రా అంటారు “నేను
నా పనిని నిజాయితీగా చేసాను. నేను తల్లిగా నా కర్తవ్యాన్నినిర్వహించాను. ఒక భార్యగా బాధ్యతలను నిర్వర్తించాను. ఇప్పుడు
నేను డిప్యూటీ కలెక్టర్‌గా నియమించబడ్డాను.
కన్నౌజ్‌కు చెందిన మహ్మద్ అక్మల్ అనే యువకుడు అభిప్రాయం లో సౌరిఖ్‌కు
చెందిన ఒక గ్రామీణ అమ్మాయి రికార్డ్ సృష్టించడం ఇది రెండవ సారి. కొన్ని నెలల
క్రితం ఇదే అమ్మాయి అద్భుతాలు(IRS) చేసింది. బుష్రా విజయం పాజిటివిటీకి ఒక ఉదాహరణ.
No comments:
Post a Comment