3 November 2019

భారత దేశం లో ఇరుకైన మరియు కిక్కిరిసిన జైళ్లు

.
 'ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా 2017' నివేదిక ప్రకారం

జైళ్ల సంఖ్య
·        జాతీయ స్థాయిలో మొత్తం జైళ్ల సంఖ్య 2015 లో 1,401 నుండి 2017 లో 1,361 కు తగ్గింది, 2015-2017 మద్య  2.85 శాతం తగ్గింది.
·        దేశంలో 1,361 జైళ్లలో 666 సబ్ జైళ్లు, 405 జిల్లా జైళ్లు, 142 సెంట్రల్ జైళ్లు, 64 ఓపెన్ జైళ్లు, 41 స్పెషల్ జైళ్లు, 22 ఉమెన్ జైళ్లు, 19 బోర్స్టల్ స్కూల్, మరో ఇతర 2 జైళ్లు ఉన్నాయి.
·        జైళ్ల వాస్తవ సామర్థ్యం 2015 లో 3,66,781 నుండి 2017 లో 3,91,574 కు పెరిగింది, 2015-2017లో 6.8% పెరిగింది.
·        2017 లో 1,361 జైళ్లలో మొత్తం సామర్థ్యం 3,91,574 లో, దేశంలోని సెంట్రల్ జైళ్లలో అత్యధిక ఖైదీలు (1,74,412), తరువాత జిల్లా జైళ్లు (1,53,383 మంది ఖైదీల సామర్థ్యం) మరియు సబ్ జైళ్లు ( 44,577 మంది ఖైదీల సామర్థ్యం).

భారత దేశం లో కొన్ని రాష్ట్రాలు జైళ్ల సంస్కరణలను అమలు చేసినప్పటికీ  భారతదేశంలో జైళ్లు రద్దీగా ఉన్నాయి.సగటు ఆక్యుపెన్సీ రేటు 115% తో, భారతీయ జైళ్లు రద్దీగా మరియు ఇరుకుగా కొనసాగుతున్నాయి అని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో యొక్క ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా - 2017” నివేదిక సంఖ్యలు వెల్లడించాయి. నివేదికలో పొందుపరిచిన 28 రాష్ట్రాలలో 16 లో, ఉత్తర ప్రదేశ్ (165%), ఛత్తీస్‌గర్  (157.2%), డిల్లి  (151.2%) మరియు సిక్కిం (140.7%) వంటి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో  ఆక్యుపెన్సీ రేటు 100% కంటే ఎక్కువగా ఉంది
ఖైదీల సంఖ్య
·        వివిధ జైళ్ళలో ఉన్న ఖైదీల సంఖ్య 2015 లో 4,19,623 నుండి 2017 లో 4,50,696 కు పెరిగింది - 7.4 శాతం పెరిగింది. 2016 లో, మొత్తం ఖైదీలు 4,33,003 మంది ఉన్నారు.
·        2017 లో, 4 50,696 మంది ఖైదీలలో 4,31,823 మంది పురుష ఖైదీలు, 18,873 మంది మహిళా ఖైదీలు.
·        2017 లో దేశంలోని వివిధ జైళ్లలో మొత్తం 16,55,658 మంది ఖైదీలు ఉన్నారు.
దోషులు, అండర్ ట్రైల్ ఖైదీలు మరియు నిర్బంధించిన వారి సంఖ్య
·        4,50,696 మంది ఖైదీలలో, దోషులు, అండర్ ట్రైల్ ఖైదీలు మరియు నిర్బంధించిన (Convicts, undertrial inmates and detenues) వారి సంఖ్య వరుసగా 1,39,149, 3,08,718 మరియు 2,136 గా నమోదైంది, ఇవి వరుసగా 30.9 శాతం 68.5 శాతం మరియు 0.5 శాతం ఉన్నాయి. మొత్తం ఖైదీలలో ఇతర ఖైదీలు 0.2 శాతం (693 మంది ఖైదీలు) ఉన్నారు.
·        దోషులుగా (convicted) తేలిన ఖైదీల సంఖ్య 2015 లో 1,34,168 నుండి 2017 లో 1,39,149 కు పెరిగింది, ఈ కాలంలో 3.7 శాతం పెరిగింది. 92,184 మంది ఖైదీలలో 66.3 శాతం సెంట్రల్ జైల్స్ లో ఉండగా జిల్లా జైళ్లు 27.9 శాతం 38,785 మంది ఖైదీలు ఉన్న్నారు. ఓపెన్ జైళ్లు 2.4 శాతం 3,323 మంది ఖైదీలతో ఉన్నారు.


జైలు సంస్కరణలు మరియు జైళ్ళలో రద్దీ అనే అంశాన్ని సుప్రీంకోర్టు మరియు ఇతర సంస్థలు లేవనెత్తుతున్నప్పటికీ, తీసుకున్న చర్యలు చాలా రాష్ట్రాల్లో స్వల్పంగా ఉన్నాయి. మొత్తం ఆక్యుపెన్సీ రేట్లు 2007 లో 140% నుండి 2017 లో 115% కి తగ్గింది., కొన్ని రాష్ట్రాలు మాత్రమే, ఈ కాలంలో, ఖైదీల జనాభాలో మార్పులకు అనుగుణంగా ఎక్కువ జైళ్ళను నిర్మించడం లేదా జైళ్లలో సామర్థ్యాన్ని పెంచడం జరిగింది.

తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాలు జైళ్ల సంఖ్యను పెంచడం ద్వారా జైలు ఆక్యుపెన్సీ రేటును (61.3 శాతానికి) తగ్గించాయి గత దశాబ్దంలో పెరిగిన ఖైదీల జనాభాతో పాటు  రాజస్థాన్ మరియు మహారాష్ట్ర జైలు సామర్థ్యాన్ని పెంచలేకపోయాయి. యు.పి. జైలు సామర్థ్యంలో సాపేక్షంగా పెరుగుదల ఉన్నప్పటికీ ఖైదీల జనాభా పెరిగినందున అధిక ఆక్యుపెన్సీ రేట్లు కలిగి ఉంది.


జైలు శిక్ష అనుభవిoచే  వారిలో 68% కంటే ఎక్కువ మంది అండర్ ట్రైల్స్ వారిలో  మెజారిటీ పేదలు మరియు బెయిల్ బాండ్లను ఇవ్వలేని వారు లేదా ష్యురితి ఇవ్వలేని వారు.. లా కమిషన్ ఆఫ్ 2017 మేలో సమర్పించిన తన 268 వ నివేదికలో ఇండియా లోని జైళ్లలో రద్దీ అధికంగా ఉండటానికి ప్రధాన కారణాలలో ఒకటిగా బెయిల్ వ్యవస్థలో ఉన్న అసమానతలను స్పష్టంగా ఎత్తి చూపింది. అటువంటి ఖైదీల కోసం విచారణ ప్రక్రియను వేగవంతం చేయడం మరియు జైల్స్ లో రద్దీ తగ్గించడానికి అండర్ ట్రైల్స్ కు రిలీఫ్ అందచేయడం ప్రధానమైనవి.

ఏడు సంవత్సరాల జైలు శిక్షతో కూడిన నేరాల కోసం అదుపులోకి తీసుకున్న వారిని ఆ కాలానికి మూడింట ఒక వంతు పూర్తి చేసిన తర్వాత విడుదల చేయాలని మరియు ఎక్కువ కాలం జైలు శిక్షను అనుభవించే నేరాల అభియోగాలు మోపబడిన వారిని ఆ వ్యవధిలో సగం పూర్తి చేసిన తరువాత విడుదల చేయాలనీ కమిషన్ సిఫారసు చేసింది. మొత్తం కాలాన్ని అండర్‌ ట్రైల్స్  గడిపిన వారికి, ఉపశమనం కోసం అండర్ ట్రైన్ గా గడిపిన కాలాన్ని రేమిషన్ కోసం పరిగణించాలి. పోలీసులు అనవసరమైన అరెస్టులకు దూరంగా ఉండాలని, మెజిస్ట్రేట్లు మెకానికల్ రిమాండ్ ఆదేశాలకు దూరంగా ఉండాలని కూడా ఇది సిఫారసు చేసింది.

ఈ సిఫార్సులు త్వరలో చట్టంలో చేర్చడం అత్యవసరం. పరిశుభ్రత, నిర్వహణ మరియు క్రమశిక్షణ యొక్క సమస్యలతో బాధపడే రద్దీగా ఉండే జైళ్లలో కేవలం విచారణ ప్రక్రియ లేకుండా ఎక్కువ కాలం అండర్‌ ట్రైల్స్ ను ఉంచే వ్యవస్థ వాoచనీయం కాదు.

అటువంటి జైలు పరిస్థితుల్లో ఖైదీలు సంస్కరించడం మరియు పునరావాసం పొందడం కంటే కరుడుకట్టిన  నేరస్థులుగా మారే అవకాశం ఉంది

No comments:

Post a Comment