18 November 2019

మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మేవార్ రాణా ప్రతాప్ తో కలసి పోరాడిన హకీమ్ ఖాన్ సుర్



Image result for hakeem khan sur"

హల్దిఘాటి యుద్ధం భారత చరిత్రలో హిందూ-ముస్లిం సంఘర్షణగా తప్పుగా  చిత్రికరించబడినది. కాని వాస్తవానికి రెండు సైన్యాలు హిందువులు మరియు ముస్లింల మిశ్రమాన్ని కలిగి ఉన్నాయి. ఇది మొఘల్ చక్రవర్తి అక్బర్ మరియు మేవార్ రాణా ప్రతాప్ మధ్య జరిగిన పోరాటం. హకీమ్ ఖాన్ సూరి రాణా ప్రతాప్ సైన్యానికి నాయకత్వం వహించగా, అక్బర్ సైన్యాన్ని జైపూర్ రాజపుత్ర రాజు  మన్ సింగ్I నాయకత్వం వహించినాడు.

మొఘల్ సైన్యంలో సగం మంది రాజ్పుట్ సైనికులు  ఉన్నారు. రాణా ప్రతాప్  సైన్యంలో హకీమ్ నాయకత్వం లోని ఆఫ్ఘన్ పఠాన్ సైన్యం ఉంది.  

హకీమ్ ఖాన్ మహారాణా ప్రతాప్ తో కలసి  అక్బర్‌ మన్ సింగ్I తో  కలిసి మరియు పోరాడటం, హల్దిఘాటి యుద్ధం మతపరమైనది కాదు మొఘలాయి సామ్రాజ్య విస్తరణ కొరకు జరిపిన యుద్ధం అనే విషయాన్ని స్పష్టపరుస్తుంది.  

హకీమ్ ఖాన్ సుర్  జీవిత చరిత్ర:

హకీమ్ ఖాన్ సూరి, సుర్ వంశస్తుడు  మరియు సుర్ సామ్రాజ్యం స్థాపకుడు షేర్ షా సూరి వారసుడు. ఖైసా ఖాన్ సూరి- బీబీ ఫాతిమా దంపతులకు డిల్లి లో జన్మించిన హకీమ్ ఖాన్ సుర్ ను  హకీమ్ ఖాన్ సుర్ పఠాన్ అని కూడా పిలుస్తారు.

ఒకప్పుడు పఠాన్ హకీమ్ ఖాన్‌ ఆఫ్ఘన్ సైన్యాన్ని ఓడించిన అక్బర్ హకీమ్ ఖాన్‌ను తనతో తీసుకెళ్ళి జైలులో పెట్టాడు. కొన్ని రోజుల తరువాత, అక్బర్ ఆఫ్ఘనిస్తాన్ తెగలను కలవడానికి వెళ్తూ అతనిని రాజా మన్ సింగ్ ఆధీనం లో ఉంచాడు. హకీమ్ ఖాన్ మన్ సింగ్  నుంచి తప్పిచుకొన్నాడు.  మన్ సింగ్ అతనిని వెతకడానికి వెళ్ళాడు. హకీమ్ ఖాన్ మన్ సింగ్ పై దాడి చేసి బట్టలు చించి గుర్రంపై ఉదయపూర్ కు పారిపోయాడు.అతను గుర్రంపై  అపస్మారక స్థితిలో ఉదయపూర్ చేరుకున్నాడు. మహారాణా ప్రతాప్ సింగ్  అతనికి వైద్యం చేయించి అతని ప్రాణాలు కాపాడాడు.

హకీమ్ ఖాన్ మొఘలుల సామ్రాజ్య విస్తరణకు అడ్డుగా నిలిచాడు.  మహారాణా ప్రతాప్ సింగ్ కూడా మొఘలాయి సామ్రాజ్య విస్తరణ కు వ్యతిరేకం గా నిలిచాడు. ఈ ఇద్దరు కలసి  మొఘల్ చక్రవర్తి కి వ్యతిరేకంగా పోరాడారు.  

మహారాజ రాణా ప్రతాప్ సింగ్ మరియు మొఘలాయి చక్రవర్తి అక్బర్ మద్య హల్దిఘాటి యుద్ధం జరిగింది. ఈ యుద్ధం లో హకీమ్ ఖాన్  మొఘలులకు వ్యతిరేకం గా పోరాడాడు. హకీమ్ ఖాన్ సుర్ తుపాకులు మరియు ఫిరంగులతో యుద్ధాలు చేయడంలో నిపుణుడు. హకీమ్ ఖాన్ తన పూర్వీకుడు సికందర్ షా సూరి ఓటమికి మొఘలుల నుండి ప్రతీకారం తీర్చుకునేoదుకు హల్దీఘాట్ యుద్ధంలో భాగస్వామి అయ్యాడు. అతను హల్దిఘాటి యుద్ధంలో ముందు ఉండి మహారాణా ప్రతాప్ సైన్యాన్ని నడిపించాడు

పష్తున్ యోధుడు మరియు మహారాణా ప్రతాప్ సైన్యంలో జనరల్ అయిన హకీమ్ ఖాన్ సుర్  మహారాణా ప్రతాప్ తో కలసి మొఘల్ చక్రవర్తి అక్బర్ కు వ్యతిరేకంగా హల్దిఘాటి యుద్ధం 1576లో  పోరాడి మరణించాడు. ఈ యుద్ధం లో మొఘల్ సామ్రాజ్య శక్తీకి వ్యతిరేకంగా ఆఫ్ఘన్ల సైన్యానికి  అతను నాయకత్వం వహించాడు.  హకీమ్ ఖాన్ రాణా ప్రతాప్ కోశాధికారిగా కూడా పనిచేశాడు

మేవార్ చరిత్రలో  హకీమ్ ఖాన్ సూరి ఉన్నత స్థానాన్ని ఆక్రమించారు మరియు అతని పేర మహారాణా మేవార్ ఫౌండేషన్ అవార్డు ప్రకటించబడినది. 2017 హకీమ్ ఖాన్ సుర్ అవార్డు E.SRIDHARAN E. శ్రీధరన్ (మెట్రోమ్యాన్) కు లబించినది. ప్రతి సంవత్సరం ఆయన స్మారక చిహ్నం ఉన్న హల్దిఘాటిలో అతని స్మారక ఉత్సవం జరుగుతుంది.

No comments:

Post a Comment