27 November 2019

ఇస్లాంలో పొరుగువారి హక్కులు Rights of a Neighbour in Islam; under the Light of Holy Qur’an and Hadith



Image result for rights of a neighbour in islam"


ఇస్లాం ఒక  సమగ్ర ధర్మం. అది మానవ జీవితం లోని అన్ని అంశాలలో మార్గదర్శకత్వం ఇస్తుంది. ఇది మానవుల హక్కులతో పాటు  సర్వప్రాణికోటి హక్కులకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. పవిత్ర ఖురాన్ మరియు హదీసులలో  మన పొరుగువారి హక్కులను వివరించటం జరిగింది.

ఇస్లాం ప్రకారం మనం మంచి పొరుగువానిగా ఉండవలసి ఉంది.  పొరుగువారితో  స్నేహపూర్వకంగా ఉండటము వారికి సహయం  చేయడo మరియు సమాజానికి  అన్ని విధాలుగా సేవలు అందించడము మన బాద్యత.  పొరుగువారికి గౌరవం ఇవ్వడం మరియు వారి రోజువారీ పనులలో మరియు అవకాశాలలో వారికి  సౌలభ్యాన్ని సృష్టించడం చేయవలయును.

ఇస్లాం వెలుగులో పొరుగువారి హక్కులు:

పవిత్ర ఖుర్ఆన్ వెలుగులో పొరుగువారి హక్కులు:

అల్లాహ్ ఖురాన్లో ఇలా చెప్పారు: "మీరంతా అల్లాహ్ కు దాస్యం చేయండి. ఎవరిని ఆయనకు భాగస్వాములుగా చేయవద్దు. తల్లితండ్రుల పట్ల సద్భావoతో మెలగండి. బంధువులు, అనాథలు, నిరుపేదల పట్ల మంచిగా వ్యవరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులయిన పొరుగువారు, పక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ అదీనంలో ఉన్న దాసదాసిజనం పట్ల ఉదారబుద్దితో వ్యవరించండి. గర్వాతిశయంతో కన్నూమిన్నూకాననివారు, తమ గొప్పతనం గురించి విర్రవీగేవారు అంటే అల్లాహ్ ఇష్టపడడు అని గట్టిగా నమ్మండి.”(దివ్య ఖురాన్ 4:36)

అల్లాహ్ మానవాళికి సహాయం చేయమని మరియు పేద ప్రజలకు  సహాయంతో పాటు, పొరుగువారితో బంధాన్ని బలోపేతం చేయాలని మరియు వారి పట్ల విధిని అర్థం చేసుకోవాలని ఆదేశిస్తాడు.

హదీసు వెలుగులో పొరుగువారి హక్కులు:

1.ప్రవక్త మొహమ్మద్(స) ఒకసారి ఇలా అన్నారు: "పొరుగువారిని జాగ్రత్తగా చూసుకోవాలని ఏంజెల్ జిబ్రిల్ నాకు నిరంతరం సలహా ఇచ్చారు."

పొరుగువారి హక్కులను వివరించే మరో హదీసు:

2.ఒకసారి ప్రవక్త(స) ఇలా అన్నారు: ఎవరి పొరుగువారు ఆకలితో నిద్రపోతారో ఆ వ్యక్తి నావ్యక్తి కాదు.

3.అల్-ఇమామ్ `అలీ ఇబ్న్ అల్-హుస్సేన్ (A.S) తన రిసలాత్ అల్-హుక్క్‌( Risalat al-Huquq) లో ఇలా అన్నారు:

ఇవి మీ పొరుగువారి పట్ల మీ కర్తవ్యాలు:

అతను లేనప్పుడు అతని ప్రయోజనాలను కాపాడoడి; అతను ఉన్నప్పుడు అతనికి గౌరవం చూపించoడి; అతను ఏదైనా అన్యాయానికి గురైనప్పుడు అతనికి సహాయం చేయండి. అతని లోపాలను వెతకకoడి. మీరు అతని గురించి ఏదైనా అవాంఛనీయ విషయం తెలుసుకుంటే, దానిని ఇతరుల నుండి దాచండి మరియు అదే సమయంలో, అతను మీ మాట వినే అవకాశం ఉంటే, అతన్ని చెడు అలవాట్ల నుండి తప్పించడానికి ప్రయత్నించండి. ఏ విపత్తులోనైనా అతన్ని ఒంటరిగా వదిలివేయవద్దు. అతను ఏదైనా తప్పు చేసి ఉంటే అతనిని క్షమించoడి. అత్యున్నత ఇస్లామిక్ నైతిక నియమావళి ఆధారంగా అతనితో ఒక గొప్ప జీవితాన్ని గడపండి.


పొరుగువారి హక్కులు మరియు పొరుగువారి పట్ల  మన కర్తవ్యాలు:

·        అవసరoలో ఉన్న పొరుగువారికి సహాయం అందించండి.
·        కష్టాల్లో ఉంటే ఉపశమనం ఇవ్వండి.
·        అతనికి రుణం అవసరమైతే అతని ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకుండా డబ్బును అతనికి ఇవ్వండి.
·        మీ భవనాలను పొరుగువారి అనుమతి లేకుండా ఎత్తుగా నిర్మిoచవద్దు ఎందుకంటే అవి వారి గాలి,వెలుతురిని నిరోధించవచ్చు.
·        ఏ సమస్యలోనైనా పొరుగువారిని వేధించవద్దు, ఇబ్బంది పెట్టవద్దు.
·        మీరు పండ్లు లేదా ఏదైనా ప్రత్యేకంగా కొన్నప్పుడు వారికి వాటా ఇవ్వండి.
·        అనారోగ్యంతో ఉన్నప్పుడు వారిని  సందర్శించండి.
·        పొరుగువారు ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియలకు హాజరు కoడి.
·        వారికి అదృష్టం కలిగి నప్పుడు వారిని అభినందించండి.
·        మీ పొరుగున   ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు వారికి సహాయం అందించడం మీ కర్తవ్యం.

ఇవి ఇస్లాం లో పేర్కొన్న పొరుగువారి హక్కులు. మీరు ఏ పరిస్థితులలో ఉన్నా అల్లాహ్ సాక్షిగా  మీ పొరుగువారికి సేవ చేయాలని నిశ్చయించుకోండి.


No comments:

Post a Comment