కాకర
కాయ ను ఆంగ్లం లో బిట్టర్ గౌర్డ్ అని లేదా హిందీ లో కరేలా అని అందురు. దీనిని
భారతీయులు వేల సంవత్సరాలుగా వంటలలో ఉపయోగిస్తున్నారు. ఇది రెండు రకాలుగా-(పొడుగు
మరియు పొట్టి) లబించును. క్యాల్సియం, ఫోస్ఫరస్,ఐరన్, విటమిన్C మరియు కొద్ది మాత్రం లో విటమిన్ B కాంప్లెక్స్ దీనిలో లబించును. వండుటకు
ముందు చెక్కు తీసిన కాకరకాయను ఉప్పు నీటిలో ముంచుట ద్వార దీని చెదుతనమును తగ్గించ
వచ్చును. కాకర లో ఔషద గుణములు అధికముగా కలవు.
కొన్ని రకాల రోగములను ఇది త్వరగా తగ్గించగలదు.
1. మధుమేహం (డయాబితిస్): శరీరంలో బ్లడ్
సుగర్స్ స్థాయిలను నియంత్రించడంలో ఇది అనేక వందల సంవత్సరాలుగా మన దేశం లో ఉపయోగ
పడుచున్నది. దీనిలో బ్లడ్ సుగర్స్ స్థాయిలను నియంత్రించే ప్లాంట్ ఇన్సులిన్ అను
పదార్ధం కలదు. ఇది బ్లడ్ సుగర్స్ ను తగ్గించును. కాబట్టి డయబిటిస్ ఉన్నవారు దీనిని
తప్పనిసరిగా తీసుకోన వలయును.కాకర కాయ జ్యూస్ లేదా పౌడర్ రూపం లో తిసుకోనవలయును.
2. మూలశంక (piles)నివారణ: కాకర కాయ ఆకుల తాజా రసం మూలశoక ను నివారించును. మూడు టీ-స్పూన్ల
కాకర కాయ ఆకు రసంను ఒక టీ-స్పూన్ మజ్జిగ లో కలిపి ప్రతి ఉదయం ఒక నెల రోజులు
తీసుకొన్న మూలశoక(piles) నివారించబడును. లేదా కాకర కాయ చెట్టు వేళ్ళను పేస్టు గా మొలలపై(piles) వ్రాయవలయును.
3. చర్మ వ్యాధులు నివారణ: గడ్డలు, స్కాబీస్(గజ్జి), దురదలు,సోరియాసిస్, తామర మొదలగు చర్మ వ్యాధుల నివారణ లో
ఇది తోడ్పడును. ఒక కప్పు తాజా కాకర కాయ ఆకుల రసం, టీ-స్పూన్ నిమ్మరసం తో కలిపి పరగడుపున 4-6 సేవించిన క్రానిక్ చర్మవ్యాదుల నుండి
నివారణ లబించును.
4. శ్వాస కొస వ్యాదుల నివారణ: అస్తమా నివారణ కు దీనిని ఎన్నో
సంవత్సరాలుగా వాడు చున్నారు. ఒక టీ-స్పూన్ కాకర కాయ రసంను ఒక టీ-స్పూన్ తేనే లేదా
తులసి ఆకుల రసం తో కలిపి రాత్రి నిద్రించునప్పుడు సేవించిన ఆస్తమా, బ్రోన్కైటిస్,జలుబు వంటి శ్వాస కోశ వ్యాధులు
తగ్గును.
5. మద్యపాన నివారణ: కాకర కాయ ఆకు రసం సంవత్సరాలుగా మద్యపాన నివారణ కొరకు
వాడుచున్నారు. ఇది మద్యo మత్తు తొలగించును. మద్య పానం వలన పాడు
అయిన కాలేయo(liver) పునర్ద్దరణ లో సహాయ పడును.
6.కాకర కాయ -వేడి నీరు
వేడి నీటిలో కాకర కాయ
(కరేలా) కాన్సర్ నివారణ లో సహాయపడుతుంది. వేడి కాకర కాయ (కరేలా) క్యాన్సర్ కణాలను
చంపగలదు.
కాకర కాయ యొక్క 2-3 సన్నని ముక్కలను
కట్ చేసి ఒక గ్లాసులో ఉంచండి, దాంట్లో వేడినీరు పోయాలి, నీరు ఆల్కలీన్ అవుతుంది. ప్రతిరోజూ దీనిని కనీసం
ఒక్కసారైనా త్రాగాలి. ఎవరికైనా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
వేడి నీటి కాకర కాయ (కరేలా) క్యాన్సర్ నిరోధక
పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఇది సహజ ఔషధం మరియు ఇది క్యాన్సర్ చికిత్సకు
ఉపయోగపడుతుంది.
వేడి నీటి కాకరకాయ సారం సిస్ట్ మరియు కణితి/ట్యూమర్ ను ప్రభావితం చేస్తుంది. ఇది వివిధ రకాల
క్యాన్సర్లను నయం చేయడానికి సహాయపడుతుంది.
క్యాన్సర్ చికిత్సలో కాకర
కాయను ఉపయోగించడం వలన ఇది కణితి/ట్యూమర్ యొక్క ప్రాణాంతక కణాలను
మాత్రమే చంపుతుంది. ఇది ఆరోగ్యకరమైన కణాలను ప్రభావితం చేయదు.
అదనంగా, కాకరకాయలోని
అమైనో ఆమ్లాలు మరియు పాలీఫెనాల్ ఆక్సిడేస్ అధిక రక్తపోటు, రక్త ప్రసరణను బ్యాలెన్స్
చేయగలవు, రక్తం
గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి మరియు లోతైన సిర/వెయిన్ త్రంబోసిస్ సంభవించకుండా
నిరోధించగలవు.
No comments:
Post a Comment