-
యునాని అనేది అయోనియన్ (Ionian) లేదా గ్రీకు అనే అరబిక్
పదం. గ్రీస్ యొక్క ఇస్లామిక్ పొరుగువారు గ్రీస్ యునానిస్తాన్ లేదా యునానిస్ యొక్క
భూమి అని పిలుస్తారు.
పశ్చిమ ఐరోపా చీకటి యుగంలో ఉన్నప్పుడు, గ్రీక్ మెడిసిన్
మరియు విజ్ఞాన శాస్త్ర శాఖలు ఇస్లామిక్ దేశాలలో అభివృద్ధి చెందినవి. గ్రీక్
మెడిసిన్ ను ముస్లిం పండితులు మరియు వైద్యులు వారి స్వంత ఆవిష్కరణలు మరియు రచనలతో అభివృద్ధి
చేసారు. ఈ ప్రక్రియలో, గ్రీక్ మెడిసిన్
యునాని-టిబ్బ్ లేదా గ్రీకో-అరబిక్ మెడిసిన్ లోకి "ఇస్లామికరణం" చేoదింది.
పుట్టిన కొద్ది కొద్ది
శతాబ్దాలలోనే, ఇస్లామిక్
ప్రపంచం పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం నుండి తూర్పున భారత మహాసముద్రం వరకు, మూరిష్ స్పెయిన్
నుండి హిందుస్తాన్ మైదానాల వరకు విస్తరించింది. ముస్లింలు వెళ్ళిన ప్రతిచోటా, వారి యునాని
వైద్యులు వారితో కలిసి, స్థానిక
పరిస్థితులకు మరియు వనరులకు అనుగుణంగా ఉంటారు. యునాని వైద్య చరిత్రకారుల మాటలలో యునాని టిబ్బ్
వివిధ సంస్కృతులు మరియు వైద్య వ్యవస్థల నుండి కొత్త మందులు, పద్ధతులు మరియు
చికిత్సలను పొందడం ద్వారా సుసంపన్నమైంది. ఉదా:భారతీయ ఆయుర్వేదం మరియు
ఓరియంటల్ మెడిసిన్.
క్రూసేడ్ల సమయంలో, ఇస్లామిక్
ప్రపంచం చాలా ప్రముఖ మరియు ప్రభావవంతమైన వైద్యులు మరియు వైద్య పండితులను తయురు చేసింది.
వారి పేర్లు లాటినైజ్ చేయబడ్డాయి, మరియు వారి వైద్య గ్రంథాలు ఐరోపాలోకి దిగుమతి చేయబడ్డాయి
మరియు లాటిన్లోకి అనువదించబడ్డాయి మరియు అవి మధ్యయుగ ఐరోపాలోని వైద్య పాఠశాలల్లో పాఠాలు
మరియు రిఫరెన్స్ మాన్యువల్లుగా పనిచేసాయి.
ఇబ్న్ రష్ద్, లేదా అవెరోస్ (1120
- 1198) మూరిష్ స్పెయిన్‌లో
వైద్యుడు మరియు ఇస్లామిక్ పండితుడు మరియు తత్వవేత్త. అతను ఔషధంపై అల్-కుల్లియాట్ (ది ఫండమెంటల్స్) లేదా కొల్లిగెట్ (Al-Culliyat (The Fundamentals), or Colliget) అనే ఐదు వాల్యూమ్
గ్రంథాన్ని రాశాడు.
అల్-రాజి, లేదా రేజెస్ (865 - 924) ఒక పెర్షియన్ వైద్యుడు, రసాయన
శాస్త్రవేత్త మరియు రసవాది. అతను హిందూ మరియు గ్రీకు వైద్య వనరుల నుండి అనేక
సారాంశాలతో కాంటినెన్స్ (Continens) అనే వైద్య ఎన్సైక్లోపీడియాను
రాశాడు.
హకీమ్ ఇబ్న్ సినా లేదా
అవిసెన్నా. అతను ది కానన్ ఆఫ్ మెడిసిన్ (The Canon of
Medicine) అనే ఐదు వాల్యూమ్ గ్రంథాన్ని వ్రాసాడు, ఇది యూరోపియన్
వైద్య పాఠశాలల్లో ప్రామాణిక పాఠ్యపుస్తకంగా మారింది. నేడు, ఇది యునాని
మెడిసిన్ అభ్యాసకులందరికీ ప్రాథమిక హ్యాండ్‌బుక్‌గా ఉపయోగపడుతుంది.
యునాని మెడిసిన్
భారతదేశంలో కూడా అభివృద్ధి చెందినది. డిల్లి సుల్తానేట్ మరియు
తరువాత మొఘల్ చక్రవర్తులు మెడిసిన్ యొక్క గొప్ప పోషకులు. వారి కాలం లో పర్షియా
మరియు మధ్య ఆసియా నుండి చాలా మంది ప్రముఖ వైద్యులు భారతదేశానికి వచ్చారు.
బ్రిటీష్ పాలనలో సాంప్రదాయ
అల్లోపతి మెడిసిన్ మినహా అన్ని రకాల వైద్యం అభివృద్ధి చెందలేదు. కానీ యునాని
మెడిసిన్ ప్రజల ఆదరణ పొందడం జరిగింది
హకీమ్ అజ్మల్ ఖాన్ (1864 - 1927) ఒక సుప్రసిద్ధ యునాని
వైద్యుడు, దేశభక్తుడు మరియు భారత స్వాతంత్ర్య సమరయోధుడు. అతను ఆయుర్వేద మరియు యునాని
మెడిసిన్ యొక్క గొప్ప సమర్ధకుడు మరియు వాటి చికిత్సలపై శాస్త్రీయ పరిశోధనలకు మార్గదర్శకుడు.
నేడు, భారత ప్రభుత్వం ఆయుర్వేద మరియు యునాని వైద్య
కళాశాలలు మరియు ఆసుపత్రులకు ప్రోత్సాహం ఇస్తుంది. ఆయుర్వేదం జనాదరణలో అసాధారణమైన
పెరుగుదలను పొందినప్పటికీ,
యునాని మెడిసిన్
ఇప్పటికీ గుర్తింపులో వెనుకబడి ఉంది.
అవెరోస్, రేజెస్ మరియు అవిసెన్నా గురించి మరింత తెలుసుకోవాలనుకునే
వారు క్రింది వెబ్-సైట్ లను దర్శించండి.
http://en.wikipedia.org/wiki/Averroes
http://en.wikipedia.org/wiki/Rhazes
http://en.wikipedia.org/wiki/Avicenna
భారతదేశంలోని యునాని
మెడిసిన్ చరిత్రపై సమాచారం కోసం భారత ప్రభుత్వ ఆయుష్ విభాగం వెబ్‌సైట్
దర్శించండి.
No comments:
Post a Comment