.
మనము నీటిని ఆరాధనగా పరిరక్షించవలసి ఉంది. భవిష్యత్ తరాల
కోసం మరియు జీవితాన్ని కొనసాగించడానికి మనలో ప్రతి ఒక్కరిపై విధించిన పవిత్రమైన
విధిగా దీనిని పరిగణించాలి.
ప్రఖ్యాత ఆంగ్ల కవి మరియు వేదాంతి శామ్యూల్ టేలర్ కోల్రిడ్జ్ తన కవితా రచన, “ది రైమ్ ఆఫ్ ది
ఏన్షియంట్ మెరైనర్ (The Rime of the Ancient Mariner) లో చుట్టూ నీరు ఉన్నప్పటికీ దానిని దానిని తాగలేని ఒక నావికుడి
వేదనను వివరించాడు. అతను, "నీరు, ప్రతిచోటా నీరు, కాని త్రాగడానికి చుక్క లేదు!"అంటాడు.
కోల్రిడ్జ్ యొక్క ఈ వ్యక్తీకరణ మానవ పరిమితుల యొక్క ఉదాహరణ. మనిషి మనుగడకు నీరు చాలా ముఖ్యమైనది కాని అతను ఈ ముఖ్యమైన సహజ వనరును వృధా చేస్తున్నాడు. ధ్రువ మంచు కప్పుల(polar ice caps)లో మంచినీటి విస్తారమైన జలాశయాలు ఉన్నాయి, కానీ అవి త్వరగా కరుగుతున్నాయి మరియు మహాసముద్రాలలోకి పోతున్నాయి. సముద్ర మట్టాలు పెరిగి త్రాగునీటి కొరతకు కారణమవుతోంది. మూడవ ప్రపంచ యుద్ధం వస్తుంది అన్నవిధంగా నీటి కొరత తీవ్రతరం అయిoదని నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ మానవ మనుగడకు ప్రమాదకరంగా మారింది అని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పదేపదే అంటున్నారు.
దానం/ఉదారత ఇంట్లో మొదలవాలి మనలో ప్రతి ఒక్కరూ జల
సంరక్షణకు తోడ్పడాలి. నీటిని సృష్టించడం ఒక అద్భుతం: రెండు విభిన్న
వాయువులు కలిసి నీటి ద్రవ రూపాన్ని తీసుకుంటాయి. మానవ మనుగడ కు నీరు ఎంతో అవసరం
కాని ప్రపంచవ్యాప్తంగా నీటి కొరత పెరుగుతోంది, అన్ని దేశాల ప్రభుత్వాలు
తమ దేశాలలో నీటి సమస్యను పరిష్కరించే
మార్గాలను కనుగొనటానికి ప్రయత్నిస్తుండగా, బాధ్యతాయుతమైన
పౌరులుగా, మనలో ప్రతి ఒక్కరూ నీటిని పరిరక్షించే చొరవలో పాలుపంచుకోవాలి.
ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం, నీటి కొరత
ఇప్పటికే ప్రపంచంలోని ప్రతి ఖండాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి వ్యక్తి నీటి
వనరులను జాగర్తగా, బాద్యత తో ఉపయోగిస్తే నీటి కొరత
సమస్యను పరిష్కరించడానికి అతను ఎంతో కొంత దోహదపడగలడు..
దివ్య ఖురాన్ ప్రకారం, నీరు సృష్టికర్త
యొక్క గొప్ప సృష్టి. దివ్య ఖుర్ఆన్ ఇంకా ఇలా చెబుతోంది, ‘మేము ప్రతి
జీవిని నీటితో తయారు చేసాము.’ (21:30). మనము ఆరాధనగా
నీటిని సంరక్షించాలి; భవిష్యత్ తరాల కోసం నీటిని సంరక్షించడం మనలో ప్రతి ఒక్కరిపై
విధించిన పవిత్రమైన కర్తవ్యంగా మనం భావించాలి. మనము తీసుకునేవారిగా కాకుండా
ఇచ్చేవారిగా జీవించాలి.
No comments:
Post a Comment