OCP/నోటి గర్భనిరోధక మాత్రలు గుండె జబ్బుల
అవకాశాలను పెంచుతాయని మీకు తెలుసా?
బర్త్ కంట్రోల్ మాత్రలు ఉపయోగిస్తే మీకు ప్రమాదం
ఉంది అందువల్ల మీ వైద్యుడితో మాట్లాడిన తర్వాత వాడండి.
ఆరోగ్యవంతులైన యువతులలో హార్మోన్లను కలిగి ఉన్న నోటి
గర్భనిరోధక మాత్ర (OCP) లేదా ఇతర రకాల బర్త్
కంట్రోల్ పద్దతులను ఉపయోగించడం గర్భధారణను నివారించడానికి మిక్కిలి తేలికైన మరియు సురక్షితమైన
పద్ధతి. అయితే వీటివల్ల కొంతమంది మహిళలకు గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోకులు మరియు
రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. వారికి గర్భ నియంత్రణ చర్యలను వైద్యుడు సూచించడం మంచిది. స్వీయ-ప్రిస్క్రిప్షన్
మానుకోవాలి అని డాక్టర్ బ్రజేష్ కుమార్
కున్వర్, సీనియర్ ఇంటర్వెన్షనల్
కార్డియాలజిస్ట్ & డాక్టర్ బండితా
సిన్హా, సీనియర్
గైనకాలజిస్ట్, సూచిస్తున్నారు.
.
నోటి గర్భనిరోధక
మాత్రలు గుండె ప్రమాదాన్ని ఎలా పెంచుతాయి?
వైద్యులు నోటి గర్భనిరోధక
మాత్రలను ‘హార్మోన్ల బర్త్
కంట్రోల్ చర్యలు hormonal birth
control measure’ అని పిలుస్తారు. ఈస్ట్రోజెన్
మరియు ప్రొజెస్టిన్‌తో సహా హార్మోన్లు నోటి గర్భనిరోధక మాత్ర యొక్క ముఖ్య భాగాలు.
ఈ హార్మోన్లు ఇంజెక్షన్లు,
ఇంట్రాటూరైన్
పరికరాలు (IUD లు), ప్యాచ్, నెక్స్‌ప్లానన్
అని పిలువబడే చర్మం కింద అమర్చిన పరికరం మరియు యోని రింగ్ వంటి గర్భధారణ నియంత్రణ
చర్యలలో కూడా ఉన్నాయి.
బర్త్ కంట్రోల్ చర్యల లోని
ఈ హార్మోన్లు అనేక విధాలుగా మీ హృదయాన్ని ప్రభావితం చేస్తాయని అధ్యయనాలు
చూపిస్తున్నాయి. అవి మీ
రక్తపోటును పెంచుతాయి. మీరు బర్త్ కంట్రోల్ మాత్రలు తీసుకుంటే, మీ రక్తపోటు
ప్రతి 6 నెలలకు ఒకసారి
పరీక్షించికొండి. అధిక రక్తపోటు ఉంటే, గర్భధారణను నివారించడానికి మరో సురక్షితమైన
మార్గం ఉందా అని మీ వైద్యుడితో మాట్లాడండి. కొన్ని బర్త్ కంట్రోల్ మాత్రలు తీసుకునే
స్త్రీల రక్త కొవ్వులలో మార్పులను గమనించవచ్చు.
ఉదాహరణకు, మీ HDL "మంచి"
కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి; అదే సమయంలో, ట్రైగ్లిజరైడ్స్ మరియు LDL "చెడు"
కొలెస్ట్రాల్ పెరగవచ్చు. మీ ధమనుల లోపల కొవ్వు పదార్ధం క్రమంగా పెరగటానికి ఇది కారణం కావచ్చు. కాలక్రమేణా, ఇది మీ గుండెకు
రక్త ప్రవాహాన్ని తగ్గించవచ్చు లేదా నిరోధించవచ్చు మరియు గుండెపోటు లేదా ఆంజినా
(ఒక రకమైన ఛాతీ నొప్పి) కలిగిస్తుంది. బర్త్ కంట్రోల్ మాత్రలలోని ఈస్ట్రోజెన్ మీ
రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది!
మీరు OCP/నోటి గర్భనిరోధక
మాత్రలు వాడుతున్నప్పుడు మీకు గుండె జబ్బులు మరియు ఇతర సమస్యల ప్రమాదం ఈ క్రింది పరిస్థితులలో ఎక్కువగా ఉంటుంది:
·
35 సంవత్సరాల కంటే ఎక్కువ
వయస్సు కలిగి ఉన్నప్పుడు
·
మీకు అధిక రక్తపోటు, డయాబెటిస్ లేదా
అధిక కొలెస్ట్రాల్ కలిగి ఉన్నప్పుడు
·
మీరు స్మోకర్ అయితే
·
మీకు ఎప్పుడైనా స్ట్రోక్, గుండెపోటు లేదా
రక్తం గడ్డకట్టడం జరిగినప్పుడు,
·
అధిక కంటితో మైగ్రేన్ల నుండి బాధకలిగిన్నప్పుడు.
OCP/నోటి గర్భనిరోధక మాత్రలు గుండె జబ్బుల ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి?
మీరు గుండె జబ్బుల
ప్రమాదాన్ని పెంచే పైన పేర్కొన్న వర్గాల క్రిందకు వస్తే, మీ సమస్యలను మీ
వైద్యుడితో చర్చించండి. ప్రతి బర్త్ కంట్రోల్ ఎంపికకు వ్యతిరేకంగా, లాభాలు మరియు
నష్టాలను అంచనావేయడానికి మీ డాక్టర్ మీకు సహాయం చేస్తారు.
మీరు 35 ఏళ్లు
దాటినట్లయితే, ఆరోగ్యంగా ఉండి మరియు మీరు ధూమపానం
చేయకపోతే, మీరు హార్మోన్ల బర్త్
కంట్రోల్ ఉపయోగించుకోవచ్చు. అయితే, మీకు ఎప్పుడైనా రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్ లేదా
గుండె జబ్బులు ఉంటే మీరు ఈస్ట్రోజెన్‌తో బర్త్ కంట్రోల్ ఉపయోగించకూడదు. బదులుగా, ప్రొజెస్టిన్
మాత్రమే ఉన్న గర్భ నియంత్రణ పద్ధతుల గురించి మీ వైద్యుడితో మాట్లాడండి. వీటిలో
షాట్లు, మినీ పిల్ లేదా
పిఓపి, నెక్స్‌ప్లానన్
మరియు ఇంట్రాటూరైన్ పరికరాలు (ఐయుడి) వాడండి.
మీ వయస్సుతో సంబంధం
లేకుండా, మీరు బర్త్
కంట్రోల్ మాత్రలు ఉపయోగిస్తే, మీకు ప్రమాదం ఉంది మరియు అందువల్ల, మీ వైద్యుడితో
మాట్లాడిన తర్వాత మాత్రమె వాడండి. బాగా సమాచారం తీసుకోవాలి.
No comments:
Post a Comment