.
ఇస్లాం అనేది
జీవితంలోని ప్రతి అంశాన్ని వివరించే సమగ్ర ధర్మం. ఇది విభిన్న సంస్కృతి మరియు
నాగరికతలను తనలో కలుపుకొంది. అనేక ముస్లిం దేశాల సంప్రదాయాలు విభిన్నంగా ఉంటాయి.
ఇస్లాంలో ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్కృతి మరియు నాగరికత పూర్తిగా అరబిక్ కాదు
అందులో గొప్ప వైవిధ్యం ఉంది. ఇస్లామిక్
సంస్కృతి మరియు నాగరికతలో విలక్షణమైన అంశాలను ముస్లింలు స్వీకరించారు. వేర్వేరు ముస్లిం
దేశాలు వేర్వేరు ఆచారాలు మరియు సాంప్రదాయాలను కలిగి ఉన్నాయి, అవి వారి ప్రజలచే
ఆదరించ బడుతున్నాయి..
ముస్లిం దేశాల ఆచారాలు మరియు సంప్రదాయాలు
సౌదీ అరేబియా saudi Arabia
సౌదీల
డ్రెస్సింగ్ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రత్యేకమైనది మరియు ప్రసిద్ధి చెందింది. వారి “తోబే Thobe” చాలా భిన్నమైన
మరియు వదులుగా ఉండే దుస్తులు. ఇవి సౌది యొక్క వేడి వాతావరణానికి అనువైన సాంప్రదాయ
దుస్తులు. సౌదీ అరేబియా యొక్క “అబయ” బాగా ప్రాచుర్యం పొందింది మరియు దీనిని ఇస్లామిక్
నమ్రతని అనుసరించి మహిళలు ధరించడానికి ఇష్టపడతారు.
దేశంలోని ఇతర
ఆచారాలలో సౌదీ పురుషుల జాతీయ నృత్యం ఉన్నది. ఇది అర్ధ అని పిలువబడే కత్తి నృత్యం.
ఇది ప్రాథమికంగా కవులు మరియు కథకులతో పాటు నృత్యకారులు మరియు గాయకుల కలయిక. కవి
మధ్యలో నిలబడి ఉండగా పురుషులు రెండు పంక్తులు లేదా వృత్తంలో నిలబడతారు. వారి ఆహార
వంటకాలు కూడా గొప్పవి మరియు అనేక రకాలను కలిగి ఉంటాయి. జాతీయులు మరియు
నిర్వాసితులు ఈ భోజనాన్ని ఆనందిస్తారు.
మలేషియాలో Malaysia
.
మలేషియా బహుళ
సాంస్కృతిక దేశం మరియు ఇది సాంస్కృతిక వైవిధ్యాలను కలిగి ఉంది. విభిన్న ఆకర్షణలకు
కేంద్రంగా ఉoది.
మలేషియా లో అక్కడ
ఉన్న ప్రతి ఒక్కరూ మీలో milo పానీయం తాగుతారు.
పెద్దలు, పిల్లలు మరియు నిర్వాసితులు అందరు మీలో పానీయంతో బంధం
పొందుతారు. ఇది ఐసడ్, జెల్లీడ్, కేక్డ్, కాక్టెయిల్డ్
మరియు డైనోసార్డ్ (iced, jellied, caked, cocktailed, and the
dinosaured) వంటి వైవిధ్య
రూపాల్లో వస్తుంది. ఆతిద్యకర్తకు(Host) బహుమతులు ఇవ్వడం దేశంలో మరో ఆసక్తికరమైన ఆచారం.
మీరు మలేషియాలో విందు కోసం స్నేహితులు
లేదా బంధువుల ఇంటికి వెళుతుంటే, మీరు తప్పనిసరిగా ఆతిద్యకర్తకు బహుమతులు తీసుకు
వెళ్ళాలి. కానీ ఇస్లాంలో మద్యం లేదా అనుమతి లేని వస్తువులు ఇవ్వకుండా చూసుకోవాలి.
ఆఫ్ఘనిస్తాన్ Afghanistan
ఆఫ్ఘనిస్తాన్లో, పష్టో మరియు దరి (Pashto and Dari) అనే రెండు అధికారిక భాషలు ఉన్నాయి. అక్కడ జనాభాలో 35% పష్టో, 50% జనాభా దరి
మాట్లాడుతారు.
ఆఫ్ఘన్లు మార్చి 21 న నూతన
సంవత్సరాన్ని జరుపుకుంటారు మరియు వారు దీనికి "నవ్రోజ్" అని అంటారు ఇది
ఇస్లాము కు ముందు నుంచి వాడుకలో ఉన్న పండుగ మరియు ప్రజలు, వేలాది మంది అతిదిలతో కలసి దీనిని జరుపుకుంటారు. వారు వేడుకలు కూడా
చేస్తారు మరియు హెరాత్ నగరంలో గురువారం కవితల రాత్రి జరుగుతుంది. అక్కడ వివిధ
వయసుల ప్రజలు వచ్చి పురాతన, ఆధునిక కవితలను చదువుతారు. ఆహారం మరియు తీపి టీ ఈ కార్యక్రమానికి ఆసక్తిని
కలిగిస్తాయి.
పాకిస్థాన్ Pakistan
ఇస్లామిక్
రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రత్యేకమైన చారిత్రక, భౌగోళిక మరియు
జాతి వైవిధ్యాన్ని కలిగి ఉంది. ఇది విభిన్న సంస్కృతులు మరియు సంప్రదాయాల మిశ్రమం.
దేశం దక్షిణ ఆసియా మరియు పశ్చిమ ఆసియా ప్రేరణల మిశ్రమం. దేశంలో అధికారికంగా
మాట్లాడే భాషల సంఖ్య 73 మరియు 76గా ఉంది. ఈద్
వంటి మతపరమైన సంఘటన మరియు ఇక్కడ ఇతర జాతీయ కార్యక్రమాలు ఉత్సాహంతో జరుపుకుంటారు.
గొప్ప సంస్కృతి
పాకిస్తాన్‌ను సాంప్రదాయ మరియు ఆధునిక సంగీత రంగానికి పరిచయం చేసింది. పాకిస్తాన్
అనేక భాషలు మరియు సాహిత్యాలతో నిండిన విభిన్న కవితా రూపాలను మరియు సంగీత శైలులను
సృష్టించే విస్తృత సంగీత స్వరకర్తగా మారింది.
పాకిస్తానీ ట్రక్
ఆర్ట్ అనేది ప్రపంచంలో ప్రసిద్ధ హస్తకళ. ఈ పాకిస్తానీ కళ(Craft)లో బిన్న శైలులు, అంశాలు మరియు
సృజనాత్మక సౌందర్యం ఉన్నాయి. ఈ కళ కింద, అరబిక్
కాలిగ్రాఫి కూడా ఉంది మరియు అది శ్రామికుల నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది. అనేక స్థానిక
భవనాలు మరియు సైట్లు, పెయింటింగ్స్, వాల్ హన్గింగ్స్, చెక్క పని మరియు రాగి పని
కలిగి ఉన్నాయి. అక్కడి నీలిరంగు కుండలు వాటి ఆనందకరమైన రూపానికి ప్రపంచ ప్రసిద్ది
చెందినాయి. రంగురంగుల నకాషి టైల్ పని నాటి మొఘల్ వారసత్వాన్ని ప్రతిబింబించే కళ.
No comments:
Post a Comment