27 November 2019

బిస్మిల్ అజీమాబాది (సయ్యద్ షా మొహమ్మద్ హుస్సేన్) (1901-1978) BISMIL AZIMABADI (SYED SHAH MOHAMMAD HASSAN) (1901-1978)




Image result for bismil azimaabadi" 

బీహార్ కు చెందిన బిస్మిల్ అజీమాబాది (Bismil Azimabadi) (సయ్యద్ షా మొహమ్మద్ హసన్) 1901 సంవత్సరం లో అజీమాబాద్, పాట్నాలో జన్మించినాడు మరియు 1978 లో అజిమాబాద్ పాట్నా లో మరణించినాడు. ఇతను భూస్వామి మరియు జాతియోద్యంలో చురుకుగా పాల్గొన్నాడు. ఇతను కవి మరియు స్వాతంత్ర్య సమరయోధుడు. ఉర్దూ, అరబిక్, పెర్షియన్ మరియు ఆంగ్లములో కవిత్వం రాసాడు. గజల్, నాజ్మ్ లో ప్రసిద్దుడు.

ఇతడు 1921 లో డిల్లి నుంచి ప్రచురింపబడే జర్నల్ సబాలో journal Sabah లో రాసిన దేశభక్తి గీతం  “సర్ఫరోషి కి తమ్మన్నా” ఎందరో స్వాతంత్ర సమరయోధులకు ముఖ్యంగా రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, భగత్ సింగ్, చంద్ర శేఖర ఆజాద్ వంటి ప్రముఖ స్వాతంత్ర సమర యోధులకు స్ఫూర్తి ఇచ్చింది. దేశభక్తి గీతం  భారతదేశంలో బ్రిటిష్ రాజ్ కాలంలో యుద్ధ కేకగా భారత స్వాతంత్ర్య సమరయోధుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ చేత అమరత్వం పొందింది. ఆ రోజులలో ఈ గీతం బ్రిటిష్ వారి పట్ల విప్లవ శంఖం మ్రోగించినది. బీహార్ ఉర్దూ అకాడమీ అతని పేరు మీద "బిస్మిల్ అజీమాబాది అవార్డు" ఇస్తుంది.




.

No comments:

Post a Comment