ఇస్లామిక్ చరిత్ర స్ఫూర్తిదాయకమైన వ్యక్తులతో నిండి
ఉంది. సాధారణంగా మనం
స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల గురించి ఆలోచించినప్పుడు మగవారి గురించి మాత్రమే ఆలోచిస్తాము. కానీ దివ్య ఖురాన్లో
ప్రస్తావించబడిన ప్రభావంతమైన మహిళల గురించి ఆలోచంచం.
మనం ఇప్పుడు పవిత్ర ఖురాన్ లో ప్రస్తావించిన
కొందరు ప్రముఖ మహిళామణుల గురించి
తెలుసుకొందాము.
"పూర్వపు ప్రజలకు సంబంధించి
ఈ గాధలలో బుద్ది,సృహ ఉన్న వారికీ ఒక గుణపాఠo ఉన్నది.ఖురాన్లో చెప్పబడుతున్న ఇవన్ని
కల్పిత విషయాలు కావు. వాస్తవానికి ఇవి ఇదివరకు వచ్చిన గ్రంధాలకు ద్రువికరణ. ప్రతి
విషయానికి వివరణ. విశ్వసించేవారికి హితబోధా,(దేవుని) కారుణ్యమును.”(అల్ ఖురాన్ -12:
111).
1.హవ్వా Hawwa:
భూమిపై మొదటి మహిళ,
ఆదం (A.S) భార్య మరియు
ఖురాన్లో ఆదం (A.S) తో పాటు హవ్వా
కథను బోధిస్తారు. సర్వశక్తిమంతుడు అయిన అల్లాహ్ గొప్ప ప్రార్థన తర్వాత హవ్వాను ఆదంకు బహుమతిగా
ఇచ్చాడు. ఖురాన్లో హవ్వా ప్రస్తావించబడినప్పుడల్లా ఆమె ఆదం తో సమానంగా ప్రస్తావించబడినది.
“నేను భువిలో ఒక ప్రతినిధిని” సృష్టించబోతున్నాను”అని మీ
ప్రభవు తన దూతలతో అన్నప్పుడు వారు “భూవ్యవస్థను అస్తవ్యస్తం చేసి రక్తం
చిందించేవాడిని నియమించాబోతున్నావా ప్రభూ? మేము సోత్రం చేస్తూ నీ గోప్పతనాన్ని
కొనియాడుతూ నీ పవిత్రనామం స్మరిస్తూనే ఉన్నాము కదా!” అని
విన్నవించుకొన్నారు.దానికి అల్లాహ్ ”మీకు తెలియని వన్ని నాకు తెలుసు” (అల్ ఖురాన్ -2:
30)
ఈ ఆయత్ నుండి మనకు తెలియునది ఏమనగా ఆదం మరియు హవ్వ భూమిపై
అల్లాహ్ ప్రతినిధులు మరియు ప్రత్యేకమైన తెలివితేటలు కలిగి ఉన్నారు. ఆరాధన మరియు అల్లాహ్ ఆజ్ఞను అమలు చేయడానికి అల్లాహ్ వారిని
భూమిపైకి పంపారు.
2.మరియం బింతే ఇమ్రాన్ Maryam:
ఇమ్రాన్ కుమార్తె మరియం ఒక గొప్ప మహిళ.
అల్లాహ్ ఖురాన్లో చెప్పినట్లుగా
“ఇమ్రాన్
కుమార్తె మరియం వినయవిధేయతలు గల వారిలో
ఒకరు”. (అల్ ఖురాన్ -66:
11)
అల్లాహ్ ఖురాన్ లో మర్యామ్ ను బింతె ఇమ్రాన్ అని
చెప్పారు. మర్యం వివేకవతి
ప్రవక్త ముహమ్మద్ (స) గొప్ప మహిళామణులలో ఒకరిగా మర్యం
ను ప్రస్తావించారు. అల్లాహ్‌పై తవాక్కుల్ (విశ్వాసం) ఉంచాలని మరియు కష్ట సమయాల్లో
అల్లాహ్‌పై ఆధారపడాలని ఆమె మనందరికీ తెలియజేసిన మహిళ. ఆమె భక్తి, ఆరాధన మరియు నమ్రతకు ఒక ఉదాహరణ.
3.సారా Sarah:
సారాహిస్ ప్రవక్త ఇబ్రహీం (A.S) యొక్క మొదటి భార్య. దివ్య
ఖురాన్ లో మరియు ఇస్లామిక్ సాహిత్యంలో సారా పేరు సానుకూలంగా ప్రస్తావించబడినది. సారా కు వంధ్యత్వo కలదు. సారా అందమైనది,
నీతిమంతురాలు
మరియు సూటిగా ఉండే మహిళ.
ప్రవక్త ఇబ్రహీం (A.S) మరియు అతని భార్య సారా
ఇద్దరినీ అల్లాహ్ పరీక్షించారు. వారికి వివాహం జరిగినది కాని పిల్లలు పుట్టలేరు. వారు
ఎల్లప్పుడూ అల్లాహ్ ఆజ్ఞలను నెరవేర్చేవారు మరియు వారికి వృద్ధాప్యంలో అల్లాహ్ (s.w.t) ఆశీర్వదoతో ఒక కుమారుడు
ఇషాక్ (A.S) కలిగాడు.
అల్లాహ్‌ను విశ్వసించిన మహిళ సారా. ఆమె కష్ట సమయాల్లో
తన భర్తకు అండగా నిలిచింది.
4.హజరా Hajara:
హజరా ప్రవక్త ఇబ్రహీం (A.S) యొక్క రెండోవ భార్య. ఆమె విశ్వాసం
దృడమైనది. అల్లాహ్‌కు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో ఆమె తన భర్తకు మద్దతు
ఇచ్చింది. తక్కువ సమయం ఇబ్రహీం (A.S) తో కలిసి ఉన్నప్పటికీ, అల్లాహ్ ను అమితంగా ఆరాదించేది. అల్లాహ్ అత్యంత
దయగలవాడు కరుణగలవాడు అని ఆమెకు
తెలుసు. తల్లి తన బిడ్డ పట్ల చూపే దయ కన్నా ఎక్కువ దయ అల్లాహ్ తన సృష్టి పట్ల చూపుతాడని
ఆమెకు తెలుసు.
ఆమె తన కోసం మరియు తన కుమారుడు ఇస్మాయిల్(A.S) కోసం కష్టపడింది. అల్లాహ్ వారికి ఖచ్చితంగా సహాయం
చేస్తాడని ఆమె హృదయపూర్వకంగా నమ్మింది. అల్లాహ్ ఆజ్ఞను నెరవేర్చడానికి ఇబ్రహీం (A.S)
హామీ ఇచ్చాడు మరియు అల్లాహ్ వారిని
జాగ్రత్తగా చూసుకుంటాడని గట్టి నమ్మకం ఉన్నందున ఆమె ఆందోళన చెందలేదు.
ఆమె అల్-సఫా మరియు అల్-మార్వా కొండల మధ్య ఎడారిలో నీటిని
వెతుక్కుంటూ 7 సార్లు
పరిగెత్తింది, అప్పుడు అల్లాహ్ అనుగ్రహంతో
జమ్-జమ్ రూపంలో కనిపించింది.
హజ్ సందర్భంగా సఫా మరియు
మార్వా మధ్య 7 సార్లు పరుగులు
తీయడం హజారా యొక్క ధైర్యం మరియు అల్లాహ్‌పై ఆమెకుగల విశ్వాసంను జ్ఞాపకం చేస్తుంది.
5.ఆసియా బింతే
ముజాహిమ్ Asiyah bint Muzahim:
ఫారో భార్య ఆసియా బింతే
ముజాహిమ్ మహారాణి. ఆమె చుట్టూ ఎప్పుడు పరిచారికలు ఉండేవారు. ఆమెకు ఎప్పుడూ
ఎలాంటి కష్టాలు అసౌకర్యం కలుగలేదు. ఆమె ఔదార్యం ప్రసిద్ది చెందింది.
ఆసియా బింతే ముజాహిమ్ భర్త
దుర్మార్గుడు అయినప్పటికీ ఆమె ప్రవక్త ముహమ్మద్ (స) వివరించినట్లు పరిపూర్ణ విశ్వాసం/ఇమాన్
గల మహిళ. ఆసియా ప్రవక్త మూసా (A.S) పెంపుడు
తల్లి మరియు మూసా (A.S) యొక్క భవిష్యత్తును కాపాడుతుంది. అల్లాహ్ ఇశ్రాయేలీయులను ఫారో
అణచివేత నుండి రక్షించాడు.
విశ్వాసుల విషయం లో అల్లాహ్ ఫిరౌన్ భార్యను ఉదాహరణగా
పేర్కొంటున్నాడు. అప్పుడు ఆమె ఇలా ప్రార్ధించారు ”ప్రభూ! నా కొరకు నీవద్ద
స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మించు. నన్ను ఫిరౌన్ నుండి, అతని చేష్టల నుండి కాపాడు,
దుర్మార్గపు జాతి నుండి నాకు విముక్తి కలిగించు” (దివ్య ఖురాన్ 66:11)
ఆమె పరిపూర్ణ విశ్వాసం/ఇమాన్
గల మహిళ మరియు ఫారో సమక్షం లో అల్లాహ్‌పై విశ్వాసం (s.w.t) ప్రకటించిన
తర్వాత ఎదుర్కొనే పరిణామాల గురించి పట్టించుకోలేదు. ఆమె అల్లాహ్ పట్ల
తన విశ్వాసం ప్రకటించిన తరువాత ఆమె ఫారో చేత ఎడారికి పంపబడి నీరు, ఆహరం లేకుండా హింసించబడినది.
ఆమె తన విశ్వాసంపై దృడంగా
ఉంది మరియు ఆమె తన ప్రభువుపై ఆధారపడింది మరియు "”ప్రభూ!
నా కొరకు నీవద్ద స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మించు.” అని కోరినది.
6.బిల్క్విస్ (షెబా రాణి) Bilquis (Queen Of Sheba):
బిల్క్విస్, పేరు ఖురాన్లో
ప్రస్తావించబడలేదు
అయితే ఇతర
ఇస్లామిక్ సాహిత్యాల ఆధారంగా ఆమె పేరు మనకు తెలుసు.
ఖురాన్లో ప్రస్తావించబడిన
కొద్దిమంది పాలకులలో ఆమె ఒకరు. బిల్క్విస్ యెమెన్ రాజ్యాన్ని పరిపాలించిన మహిళ. ప్రవక్త సులైమాన్
(A.S) కాలంలో ఆమె
పరిపాలించింది. అయితే, ఆమెకు మంత్రుల /సలహాదారుల
బృందం ఉంది.
సాధారణంగా పాలకులు ఎక్కువగా మగవారు మరియు వారిలో
చాలామంది చాలా మంది ప్రజలను అణచివేతకు గురిచేసిన కాలంలో షెబా రాణి (Queen of Sheba) చాలా తెలివైన,
న్యాయమైన మరియు వివేకవంతమైన పాలకురాలుగా ప్రసిద్ది
చెందినది.
ఆమె ఒక దూరదృస్టి గల పాలకురాలు
మరియు పొరుగు రాజ్యాలతో మంచి సంభంధాలను కలిగి
పోరాటాల పట్ల ఆసక్తి చూపలేదు. ఆమె క్లిష్ట పరిస్థితులను శాంతియుతంగా మరియు దౌత్యపరంగా పరిష్కరించుకునేది
మరియు ఆమె సులైమాన్ (A.S) యొక్క
విశ్వాసాన్ని పొందినది. ఆమె తనదైన రీతిలో విశ్వాసం ఉన్న మహిళలకు ఒక ఉదాహరణ.
7.మూసా తల్లి (A.S) Mother of Musa(A.S):
అల్లాహ్ ఖురాన్ లో చెప్పాడు- మేము ముసా తల్లికి ఇలా సూచించాము, “అతనికి
పాలుపట్టు, అతని ప్రాణానికి ప్రమాదముందని నీకు అనిపిస్తే అప్పుడు అతనిని నదిలో
విడిచి పెట్టు, ఏమాత్రం భయపడకు, భాధ పడకు, మేము అతనిని నీ వద్దకే తిరిగి తీసుకు
వస్తాము. అతనిని ప్రవక్తలలో ఒకడిగా చేస్తాము” (దివ్య ఖురాన్ -28: 7)
ఉమ్మే-ఎ-ముసా మదర్ ఆఫ్
మూసా (A.S) అల్లాహ్ పట్ల ఆశను
కలిగి ఉంది మరియు ఆమెకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ
ఆమె అల్లాహ్‌పై ఉన్న నమ్మకం విడనాడలేదు. అల్లాహ్ తన దయ, కరుణ మరియు ప్రేమ ద్వారా తన కుమారుడు మూసా (A.S) ను రక్షిస్తాడని ఆమె ఆశతో ఉంది.
అల్లాహ్ ఖురాన్లో
చెప్పినట్లుగా ముసా (A.S) ఇశ్రాయేలీయులలో
ఒకరిచే నాశనం చేయబడతాడు అని కల కన్న ఫారో ఇంటికి వెళ్తాడు.
ఇశ్రాయేలీయులందరినీ చంపడానికి ఫారో చట్టం చేసాడు. కానీ అల్లాహ్ యొక్క ఇష్టానుసారం మూసా (A.S) ఫారో రాజ్యానికి
వెళుతాడు మరియు అల్లాహ్ ముసా (A.S) మరియు ఇశ్రాయేలీయులకు ఫారో నుండి ఎలా స్వేచ్ఛ ఇచ్చాడనేది తరువాతి
కథ.
కానీ మనం ఇక్కడ మూసా (A.S)
తల్లి ఆశను గమనించాలి. ఆమె అల్లాహ్
ప్రవక్త లేదా అల్లాహ్ యొక్క దూత కాదు. జిబ్రీల్ (A.S) ఆమె వద్దకు రాలేదు.
ఇక్కడ మనం నేర్చుకున్న
పాఠం ఏమిటంటే, కష్టతరమైన
సమయాల్లో కూడా అల్లాహ్ పట్ల విధేయత చూపడం మరియు అతని ఆజ్ఞలను పాటించడం.
అల్లాహ్ చెప్పినదాని ఆధారంగా సరైన నిర్ణయం తీసుకోవటం మరియు అల్లాహ్ ఆజ్ఞలను పాటిస్తే భయపడాల్సిన
అవసరం లేదని మరియు విచారపడవలసినది ఏమీ
లేదని మరియు అల్లాహ్
వాగ్దానం నిజమని తెలుసుకోవాలి.
ఆమె విశ్వాసం/ఇమాన్ అల్లాహ్‌పై
ఆమెకున్న నమ్మకం క్లిష్ట పరిస్థితులలో కూడా ఆమెను ఆ విధంగా వ్యవహరించడానికి
అనుమతించాయి.
8.నుహ్ (A.S)
మరియు లూట్ (A.S) భార్య Wife of Nuh(A.S) and Lut(A.S:
అల్లాహ్ అవిశ్వాసుల విషయంలో
ప్రవక్త నుహ్ మరియు ప్రవక్త లూత్ భార్యలను ఉదాహరణగా పెర్కొoటున్నాడు “వారు
సజ్జనులైన మా ఇద్దరు దాసుల వివాహబంధం లో ఉండేవారు. కాని వారు తమ భర్తలకు ద్రోహం
చేసారు. వారు అల్లాహ్ కు ప్రతిగా ఆ స్త్రీలకు ఏమాత్రం ఉపయోగపడలేక పోయారు. వారిద్దరితో,
“వెళ్ళండి, అగ్నిలోకి వెళ్ళే వారితోపాటు మీరు వెళ్ళండి” అని చెప్పబడినది. (దివ్య ఖురాన్ -66: 10)
ఈ ఆయత్ నుండి అల్లాహ్ (s.w.t) అవిశ్వాసులకు ఒక ఉదాహరణ ఇస్తాడు. నుహ్ (A.S) మరియు లూత్ (A.S) భార్యలు
ప్రవక్తలను వివాహం చేసుకున్నప్పటికీ అల్లాహ్‌ను నమ్మలేదు.
అల్లాహ్ పట్ల ఇమాన్/విశ్వాసం
ఒక వ్యక్తిగత పోరాటం మరియు అది వ్యక్తి
ద్వారానే సాధించబడుతుంది మరియు మీ సంఘాలు మరియు మీ అనుబంధాలు మరియు మీ కుటుంబాలు,
తీర్పు రోజున మిమ్మల్ని రక్షించలేవు.
No comments:
Post a Comment