13 November 2019

ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం జనాభా మరియు ప్రాంతాల సంగ్రహావలోకనం




Image result for islam around the world" 




ప్రపంచవ్యాప్తంగా విబిన్న దేశాలలో ఇస్లాం:

1. ఇండోనేషియా:
2019 ప్రపంచ జనాభా సమీక్ష గణాంకాల ప్రకారం ముస్లింలు అత్యధిక జనాభా కలిగిన దేశం ఇండోనేషియా. మొత్తం దేశం రెండు వందల డెబ్బై మిలియన్లకు పైగా జనాభాను కలిగి ఉంది అందులో  ముస్లిం జనాభా రెండు వందల ఇరవై మిలియన్లు ఉన్నారు.. ఇది దేశంలోని మొత్తం జనాభా లో 87% గా ఉంది.

.2. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్:
అధిక  ముస్లిం జనాభా  కలిగిన రెండవ దేశం పాకిస్తాన్. అక్కడ మొత్తం జనాభా రెండు వందల పదహారు మిలియన్లు. వీరిలో రెండు వందల మిలియన్లకు పైగా ముస్లింలు ఉన్నారు. దేశంలో ముస్లిం జనాభా మొత్తం జనాభా లో 96% పైగా ఉంది. పాకిస్తాన్ ను  ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అని పిలుస్తారు. దేశంలోని నిర్దిష్ట ప్రాంతాలలో క్రైస్తవులు మరియు హిందువులు  కొద్దిపాటి మైనారిటీ శాతం గా ఉన్నారు.

3. భారతదేశం:
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో భారతదేశం ఒకటి. ఇది  ఒక బిలియన్ మూడు వందల అరవై ఆరు మిలియన్ల జన సంఖ్యను కలిగి ఉంది. ఈ జనాభాలో నూట తొంభై ఐదు మిలియన్లు ఇస్లాంను ఆచరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ముస్లిం జనాభా మొత్తం జనాభాలో 14% మంది ఉన్నారు. హిందూ మతాన్ని అత్యధికులు ప్రధానంగా అనుసరిస్తున్నారు.

4. బంగ్లాదేశ్:
నూట యాభై మూడు మిలియన్లకు పైగా ముస్లింలతో ముస్లిం దేశాల జాబితాలో బంగ్లాదేశ్ నాలుగవ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ యొక్క మొత్తం జనాభా నూట అరవై మూడు మిలియన్లు మరియు అందులో 90% ముస్లింలు ఉన్నారు

5. నైజీరియా:
ఇస్లాంను ఆచరించే టాప్ 5 దేశాలలో నైజీరియా ఒకటి . ఇక్కడ జనాభాలో దాదాపు 50% ముస్లింలు మరియు దేశం మొత్తం జనాభా రెండు వందల మిలియన్లలో తొంభై తొమ్మిది మిలియన్ల ముస్లిం జనాభా ఉంది.

6. ఇతర దేశాలు:
ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంను అధికారిక మతంగా భావించే అనేక దేశాలు ఉన్నాయి. ముస్లింల జనాభా ఎక్కువగా ఉన్న ఇతర దేశాలు వరుసగా ఈజిప్ట్, ఇరాన్, టర్కీ, అల్జీరియా, సుడాన్ మరియు అనేక ఇతర దేశాలు. ఈ దేశాల క్యాలెండర్ అంతా ఇస్లామిక్ పండుగలతో నిండి ఉన్నది. ఈ దేశాల గొప్ప ఇస్లామిక్ సంస్కృతి మిలియన్ల మంది ప్రజలను మరియు పర్యాటకులు ఆకర్షిస్తుంది.

ఇవి ప్రముఖ ముస్లిం జనాభా ఉన్న దేశాలు. వీరు ఇస్లామిక్ కళ మరియు వాస్తుశిల్పం యొక్క విపరీతమైన సంపదను కలిగి ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఈ దేశాలలో ఒకదాన్ని సందర్శించారా మరియు మీ అనుభవం ఎలా ఉంది?

No comments:

Post a Comment