-
తల్లిదండ్రులు మనకు
ప్రపంచంలోని సాటిలేని దీవెనలు. ఇస్లాం ధర్మం తల్లిదండ్రుల స్థానం ను మరియు మన
జీవితంలో వారి ప్రాముఖ్యతను గొప్పగా తెలియజేస్తుంది. మన పుట్టుకతో ఆరంభించి మన
చివరి శ్వాస వరకు ఇస్లాం మనము మన తల్లితండ్రుల పట్ల కృతజ్ఞతతో ఉండాలని మరియు తల్లిదండ్రులకు అన్ని విధాల బాగా సేవ చేయాలని
చెబుతుంది.
దివ్య ఖుర్ఆన్
మరియు హదీసులు తల్లిదండ్రుల కోసం మనకు ఇస్తున్న ప్రాముఖ్యతను తెలుసుకొందాము:
దివ్య ఖురాన్
తల్లిదండ్రుల గురించి ఏమి చెబుతుంది?
మీరు కోపంగా
ఉన్నప్పుడు లేదా బాధలు ఎదుర్కొంటున్నప్పుడు కూడా మీ తల్లిదండ్రుల పట్ల దయ చూపాలని మరియు కృతజ్ఞతతో ఉండాలని అల్లాహ్ (SWT) దివ్య ఖురాన్లో
చాలాసార్లు ఆదేశించారు. దివ్య ఖురాన్ అంతటా మీ
తల్లిదండ్రులను ఎలా చక్కగా చూసుకోవాలో మరియు వారి పాదాల క్రింద జన్నాను ఎలా
కనుగొనాలో అల్లాహ్ (SWT) చక్కగా వివరంగా వివరిస్తారు.
తల్లి త్యాగాలు;
(అల్లాహ్ ఇలా అంటాడు) “మానవుడు తన తల్లితండ్రుల
హక్కును గుర్తించాలని స్వయంగా మేమే అతనికి నిర్దేశిoచాము. అతని తల్లి బలహీనతపై బలహీనతను
సహించి అతనిని తన కడుపున మోసింది. అతను పాలు విడిచిపెట్టటానికి రెండు సంవత్సరాలు
పట్టింది. (అందుకే మేము అతనికి ఇలా భోదిoచాము)” “ నాకు కృతజ్ఞడవై ఉండు, నీ తల్లి
తండ్రులకు కృతజ్ఞతలు తెలుపు. నా వైపునకే నీవు మరలి రావలసి ఉన్నది. –దివ్య ఖురాన్, సూరా లుక్మాన్ 31: 14
తల్లిదండ్రుల
ప్రాముఖ్యతను ఎత్తిచూపే మరో ఆయతు
నీ ప్రభువు ఇలా నిర్ణయం చేసాడు: “మీరు కేవలం ఆయనను
తప్ప మరెవరిని ఆరదిoచకండి.
తల్లితండ్రులతో మంచితనం తో వ్యవరించండి. ఒకవేళ మీవద్ద వారిలో ఒకరు గాని ఇద్దరుగాని
ముసలివారై ఉంటె, వారిముందు విసుగ్గా “చీ” అని కూడా అనకండి. వారిని కసురుకొంటూ సమాధానం
ఇవ్వకండి. వారితో మర్యాదగా మాట్లాడండి.” దివ్య ఖురాన్ -బనీ ఇస్రాయిల్ 17:23
ఇస్లాం
తల్లిదండ్రులకు ఉన్నత స్థానం ఇస్తుంది మరియు అల్లాహ్ (SWT) తరువాత
తల్లిదండ్రులకు విధేయత చూపాలని ఆదేశిస్తుంది. ఒకరు తన తల్లిదండ్రుల ముందు తన
గొంతును పైకి లేపకూడదు. అంతేకాక, అతను తన చూపులను తగ్గించుకోవాలి మరియు వాటి కంటే
ముందు నడవకూడదు.
తల్లిదండ్రులకు
దువా
తల్లిదండ్రుల
కోసం ఎలా ప్రార్థించాలో పవిత్ర ఖుర్ఆన్ మనకు సమగ్ర మార్గదర్శకత్వం ఇస్తుంది.
“ప్రభూ! నన్నూ, నా తల్లితండ్రులనూ విశ్వసించే వారందరినీ లెక్క
ఖరారు అయ్యేరోజున క్షమించు.” -సూరా ఇబ్రహీం 14:41
ఇలా ప్రార్ధిస్తూ
ఉండండి: “ప్రభూ! వారిపై కరుణ జూపు, బాల్యంలో వారునన్ను కారుణ్యంతో, వాత్సల్యంతో
పోషించినట్లు” -సూరా బనీ ఇస్రాయిల్ 17:24
ఈ ఆయతులను సలాతుల్
వాలిదైన్ అని పఠిస్తారు మరియు ఈ లోకం లో మరియు పరలోకంలో తల్లిదండ్రుల శ్రేయస్సు
కోసం ప్రార్థిస్తారు
హదీసుల వెలుగులో
తల్లిదండ్రుల స్థానం:
1.అబూ ఉమామా
ప్రకారం : ఒక వ్యక్తి, “అల్లాహ్ యొక్క దూత (స) తో తల్లిదండ్రులు తమ పిల్లల నుండి ఏ హక్కులను
కోరుతారు?”
ఆయన అన్నారు, “వారు మీ స్వర్గం
మరియు మీ నరకం.”
ఇబ్న్ మజా దానిని
ప్రసారం చేశాడు. -అల్-తిర్మిజి -
హదీసులు 1277
మీకు స్వర్గం
లేదా నరకం రావడానికి కారణం తల్లిదండ్రులు. వారిని దయతో చక్కగా సేవ చేయమని హదీసులు చెబుతాయి. పరిస్థితులు ఎలా ఉన్నా
ఎల్లప్పుడూ వారిపట్ల దయ /కరుణ మరియు వినయం
చూపండి.
2.అస్మా బింతే అబూబకర్ ఇలా వివరించారు: నా తల్లి నా వద్దకు
వచ్చింది మరియు ఆమె ఇస్లాం స్వికరించ లేదు. (అతని తీర్పును
కోరుతూ), “నా తల్లి నా దగ్గరకు వచ్చింది మరియు ఆమె నా నుండి ప్రతిఫలం
పొందాలని కోరుకుంటుంది, నేను ఆమెతో మంచి సంబంధాలు పెట్టుకోవచ్చా?”
దానికి ప్రవక్త (స) అన్నారు, “అవును, ఆమెతో మంచి
సంబంధాలు పెట్టుకోండి. ”
సహిహ్ అల్-బుఖారీ
- పుస్తకం 47 హదీసులు 789
3.ఇబ్న్ మసూద్ ఇలా
వివరించినాడు : ఒక వ్యక్తి ప్రవక్త (స) ను “ఏ పనులు
ఉత్తమమైనవి?” అని అడిగారు. ప్రవక్త (స) ఇలా అన్నారు: (1) రోజువారీ ఫర్జ్ ప్రార్థనలు చేయటo (2) తల్లిదండ్రులకు మంచి మరియు విధేయత చూపడం. (3) అల్లాహ్ కోసం జిహాద్‌లో పాల్గొనడం. ”
సాహిహ్
అల్-బుఖారీ - పుస్తకం 93 హదీసులు 625
అనేక హదీసుల
నుండి, ప్రతి ఒక్కరు తన తల్లిదండ్రులకు వారి జీవితమంతా విధేయతతో
ఉండాలని స్పష్టంగా తెలుస్తుంది. వారు మరణించిన తరువాత వారి కోసం
క్షమాపణ (మాగ్ఫిరాత్) కోసం ప్రార్థించండి.
ఇస్లాం మన
ప్రవర్తనలలో మనం అందరి పట్ల, ముఖ్యంగా మన తల్లిదండ్రులతో దయ/కరుణ చూపాలని బోధిస్తోంది. దివ్య ఖుర్ఆన్ మరియు
హదీసుల బోధనల ప్రకారం నడుచుకోవటానికి అల్లాహ్ (SWT) మనకు
మార్గనిర్దేశం చేయుగాక. ఆమీన్!
No comments:
Post a Comment