అరబ్ వైద్యులు మరియు
పండితులు ఐరోపాలో వైద్య సాధన/ప్రాక్టిస్ కు
ఆధారం అయ్యారు.
ఇస్లామిక్ నాగరికత
ఒకప్పుడు తూర్పున భారతదేశం నుండి పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం వరకు
విస్తరించింది. అండలూసియాలోని గ్రెనడాలోని అల్హంబ్రా (Alhambra) కార్డోబాలోని మెజ్క్విటా (Mezquita) మరియు
సెవిల్లెలోని గిరాల్డా (Giralda) వంటి భవనాలు పశ్చిమ ఐరోపాలో మిగిలిపోయిన ఇస్లామిక్
అర్కిటేక్చర్ ముద్రను గుర్తుచేస్తాయి.
800 మరియు 1450. సంవత్సరాల మధ్య ఇస్లామిక్ నాగరికత యొక్క
ప్రభావం పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం మరియు ఔషధం మీద అపారంగా
కలదు. నేటి పాశ్చాత్య ప్రపంచం పై బాగ్దాద్, కైరో, కార్డోబా కు
చెందిన ముస్లిం పండితుల ప్రభావం ను ఉహించకుండా ఉండలేము.
ఇస్లాం అరేబియా
ద్వీపకల్పం నుండి సిరియా,
ఈజిప్ట్ మరియు
ఇరాన్లలోకి వ్యాపించడంతో ఇది చాలాకాలంగా స్థాపించబడిన నాగరికతలను మరియు అభ్యాస
కేంద్రాలను కలుసుకుంది. అరబ్ పండితులు గ్రీకు, సిరియాక్ (తూర్పు క్రైస్తవ పండితుల భాష), పహ్లావి
(ఇస్లామిక్ పూర్వ ఇరాన్ యొక్క పండిత భాష) మరియు సంస్కృతం నుండి తాత్విక మరియు
శాస్త్రీయ రచనలను అరబిక్లోకి అనువదించారు.
830 లో బాగ్దాద్‌లో అబ్బాసిద్ కాలిఫ్ అల్-మామున్
చేత "హౌస్ ఆఫ్ విజ్డమ్" (బైట్-ఉల్-హిక్మా) స్థాపించడంతో అనువాద ప్రక్రియ
గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇది అనేక శతాబ్దాలుగా అరబిక్‌ను ప్రపంచంలోని అతి
ముఖ్యమైన శాస్త్రీయ భాషగా మార్చింది మరియు శాశ్వతంగా కోల్పోయే జ్ఞానం
సంరక్షించబడుతుంది.
ఇతర సంస్కృతుల జ్ఞానాన్ని
సమీకరించడం మరియు వ్యాప్తి చేయడంతో పాటు, అరబ్ పండితులు గణితం, ఖగోళ శాస్త్రం, రసాయన శాస్త్రం, లోహశాస్త్రం, వాస్తుశిల్పం, వస్త్రాలు మరియు
వ్యవసాయంలో అనేక ముఖ్యమైన శాస్త్రీయ మరియు సాంకేతిక పురోగతులను సాధించారు. వారు
అభివృద్ధి చేసిన టెక్నిక్స్-స్వేదనం, స్ఫటికీకరణ (distillation, crystallisation) మరియు ఆల్కహాల్ ను అంటి-సెప్టిక్ మందుగా
ఉపయోగించడం వంటివి ఇప్పటికీ ఉపయోగించబడుతున్నాయి.
అరబ్ వైద్యులు మరియు
పండితులు ఐరోపాలో వైద్య విధానానికి ఆధారం అయ్యారు. ఇస్లామిక్ యుగానికి ముందు, వైద్య సంరక్షణను
యూరప్ లో ఎక్కువగా పూజారులకు మరియు
దేవాలయాలకు అనుసంధానించారు. ప్రధాన అరేబియా ఆస్పత్రులు వైద్య విద్య కేంద్రాలు
మరియు అవి ఆధునిక ఆసుపత్రులలో మనం చూసే అనేక భావనలు మరియు నిర్మాణాలను పరిచయం చేశాయి. పురుషులు మరియు
మహిళలకు ప్రత్యేక వార్డులు,
వ్యక్తిగత మరియు
సంస్థాగత పరిశుభ్రత, వైద్య రికార్డులు
మరియు ఫార్మసీలు స్థాపించారు.
13 వ శతాబ్దపు అరబ్ వైద్యుడు ఇబ్న్ అల్-నఫిస్, విలియం హార్వేకి 300 సంవత్సరాల కంటే
ముందు పల్మనరీ ప్రసరణ గురించి వివరించాడు . సర్జన్ అబూ అల్-ఖాసిమ్ అల్-జహ్రావి
తాస్రిఫ్ (Tasrif) రాశారు, ఇది లాటిన్లోకి అనువదించబడింది మరియు తరువాత మధ్య యుగం
లో యూరోపియన్ విశ్వవిద్యాలయాలలో ప్రముఖ వైద్య పాఠంగా మారింది.. అల్-జహ్రావి కూడా
ఒక ప్రసిద్ధ పాథాలజిస్ట్,
హైడ్రోసెఫాలస్
మరియు ఇతర పుట్టుకతో వచ్చే వ్యాధులను వివరిస్తూ, క్యాట్‌గట్ స్టుచర్స్ (catgut sutures) వంటి నూతన శస్త్రచికిత్సా సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి
చేశాడు.
865 లో జన్మించిన
అల్-రాజి (రేజెస్ Rhazes) ను ఇస్లామిక్ ప్రపంచంలోని గొప్ప వైద్యుడిగా
కొందరు పండితులు అభివర్ణించారు. అతను కితాబ్ అల్-మన్సూరి (లాటిన్లో లిబర్
అల్మార్ట్సోరిస్ Liber Almartsoris ), గ్రీకు ఔషధంపై 10
వాల్యూమ్ గ్రంథం, మరియు మశూచి
మరియు తట్టు మీద కూడా తన రచనలు ప్రచురించాడు: అతని గ్రంథాలు 19 వ శతాబ్దం వరకు పునర్ముద్రించబడ్డాయి.
యూరోపియన్ విశ్వవిద్యాలయాలలో ఇబ్న్ రష్ద్ (అవెరోస్ Averroes) యొక్క వైద్య
గ్రంథాలు విస్తృతంగా ఉపయోగించబడ్డాయి.
ఇబ్న్ సినా (అవిసెన్నా) పడమర
"వైద్యుల యువరాజు" గా పిలువబడ్డాడు. అతని ఇస్లామిక్ ఔషధం యొక్క
సంశ్లేషణ synthesis, అల్-ఖానున్ ఫైల్ టిబ్బ్ (al-Qanun fi'l tibb -ది కానన్ ఆఫ్ మెడిసిన్) అనేక శతాబ్దాలుగా
ఐరోపాలో వైద్య విషయాలపై సాధికార గ్రంథం గా
నిలిచింది. ఇబ్న్ సినా ఫార్మకాలజీలో మరియు క్లినికల్ ప్రాక్టీస్‌లో పురోగతి
సాధించినప్పటికీ, అతని గొప్ప
సహకారం బహుశా ఔషధ తత్వశాస్త్రంలో ఉంది. అతను సమగ్ర ఔషధ వ్యవస్థను సృష్టించాడు మరియు అందులో రోగులకు
చికిత్స చేయడంలో శారీరక మరియు మానసిక కారకాలు, మందులు మరియు ఆహారం కలిపి ఉన్నాయి.
చివరికి, అరబ్బులు
నిర్మించిన ఇస్లామిక్ నాగరికత క్షీణించింది. తూర్పున, కొత్త శక్తులు ఆవిర్భవించాయి
మొదట మంగోలు, 1258 లో ఆనాటి గొప్ప
అరబ్ నగరo బాగ్దాద్‌ను, తరువాత ఒట్టోమన్
టర్క్‌లు 14 వ శతాబ్దం నుండి అరబ్ ప్రపంచంలోని పెద్ద
భాగాలను తమ కొత్త సామ్రాజ్యంలోకి విలీనం చేసి నాశనం చేశారు. అంతర్గత కలహాలు మరియు
పౌర సంఘర్షణలతో బలహీనపడిన స్పెయిన్లోని చాలా ఇస్లామిక్ నగరాలను 14 వ శతాబ్దం
నాటికి క్రైస్తవ సైన్యాలు స్వాధీనం చేసుకున్నాయి. స్పెయిన్లో చివరి ఇస్లామిక్
రాష్ట్రం గ్రెనడా, 1492 లో స్పెయిన్ కు లొంగిపోయింది మరియు దాని పాలకుడు బోబ్డిల్ (Boabdil) ఉత్తర ఆఫ్రికాకు
బహిష్కరించబడ్డాడు.
ఇస్లామిక్ ప్రపంచం నుండి
పశ్చిమ దేశాలకు సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆలోచనల ప్రవాహం మందగించింది మరియు గత 600 సంవత్సరాలలో ఈ పరిస్థితి తారుమారైంది.
ఇస్లామిక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ క్షీణతకు గల కారణాలు మరియు పరిణామాలను
విద్యావేత్తలు మరియు రాజకీయ నాయకులు ఇప్పటికి చర్చించుచున్నారు. ఇస్లామిక్ నాగరికత యొక్క
వారసత్వం కు ఐరోపా యొక్క శాస్త్రీయ మరియు
సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని సాధ్యం చేయడం లో ప్రముఖ పాత్ర వహించినది.
No comments:
Post a Comment