ఇస్లామిక్ నాగరికత ఆకృతులు రూపుదిద్దుకున్న కేంద్ర బిందువు
మదీనా నగరం. ఇస్లామిక్ నాగరికత యొక్క పురోగతి అక్కడ ఆగలేదు మరియు అది ముందుకు
కదిలింది. చరిత్రలో బాస్రా, కుఫా, ముసల్, డమాస్కస్, కాన్స్టాంటైన్, కైరో, కార్డోబా మరియు డిల్లి తో సహా అనేక నగరాలు
ఇస్లామిక్ నాగరికత ఇతర ప్రధాన కేంద్రాలుగా మారాయి. ఈ నాగరికత
కాలక్రమేణా స్థానిక సంస్కృతులను తనలో కలుపుకొంది. ఇస్లాం యొక్క ప్రారంభ సంవత్సరాల నుండి రెండవ ఖలీఫా ఉమర్ (ర) కాలం వరకు వికాసం చెందిన ఇస్లామిక్ నాగరికత
యొక్క అవలోకనాన్నిపరిశిలించుదాము. .
మదీనాకు TO MADINAH
చారిత్రక రికార్డులు ప్రకారం మొదటి శతాబ్దం (AH) మరియు రెండవ
శతాబ్దం ప్రారంభంలో అనేక యూదు తెగలు పాలస్తీనా ప్రాంతం నుండి వలస వచ్చాయని మరియు
హిజాజ్ యొక్క వివిధ ప్రదేశాలలో స్థిరపద్దాయని తెలుస్తుంది. బాను ఖైనుకా, బాను ఖురైజా, మరియు బాను
నాదిర్ (Banu Qaynuqa, Banu Qurayza, and Banu Nadir) అనే
మూడు యూదుతెగల వారు యాత్రిబ్
అనే ప్రదేశంలో స్థిరపడ్డారు. యాత్రిబ్ తరువాత మదీనా గా పిలబడినది. అదే సమయంలో కొన్ని అరబ్ తెగలు కూడా ఈ ప్రాంతంలో
నివసిస్తున్నారు. సుమారు మూడు శతాబ్దాల తరువాత భారీ వరదల కారణం గా యెమెన్ నుండి కొన్ని
అరబ్ తెగలు వచ్చి అక్కడ స్థిరపడినాయి.
బాను ఆస్ మరియు బాను ఖాజ్రాజ్ అనే రెండు తెగలు
యాత్రిబ్‌లో నివసించసాగారు.ఆధిపత్య యుద్ధంలో ఈ రెండు కొత్త తెగలు నగరాన్ని
ఆక్రమించగలిగాయి. బాను ఖైనుకా తెగ బాను
ఖాజ్రాజ్‌తో పొత్తు పెట్టుకున్నది మరియు
ప్రధాన నగరంలో నివసించసాగినది మిగిలిన రెండు యూదు తెగలు బాను భానుఅస్ తో పొత్తు పెట్టుకొని నగర శివారు ప్రాంతాలలో
స్థిరపడ్డారు.
బాను ఖురైజా మరియు బాను నాదిర్ తెగ వారు బాను ఖైనుకా కంటే
సామాజికంగా ఉన్నత స్థానంలో ఉన్నారు. వారు సమీపంలో ఉన్న ఇతర తెగల కన్నా సంస్కృతికంగా, విద్యాపరంగా అధునాతనంగా పరిగణించబడ్డారు. వారు ఇతరులను
తమకంటే హీనమైన, చదువురాని, అన్యజనులని అనేవారు.
బాను ఆస్ మరియు బాను ఖాజ్రాజ్ తెగలవారు రైతులు మరియు ఖర్జురాలను
పండించేవారు. యూదు తెగలు ఆర్థిక వ్యవస్థను నియంత్రించారు మరియు ఆహార పదార్థాల
దిగుమతి మరియు ఎండు-ఖర్జురం ఎగుమతి వంటి విభిన్న కార్యకలాపాలలో నిమగ్నమయ్యారు.
వారు చేతివృత్తులవారు మరియు వారి వ్యాపార కార్యకలాపాలలో నేత వస్త్రం, చర్మశుద్ధి, పౌల్ట్రీ పెంపకం, మత్స్య, లోహ వ్రుత్తి , స్వర్ణకారుడు, కత్తులు మరియు
పాత్రల తయారీ ఉన్నాయి. వారు ఈ ప్రాంతంలో అనేక వైన్ షాపులను కలిగి ఉన్నారు.
వీటన్నిటితో పాటు, వారు సాధారణంగా అరబ్బులకు వడ్డీకి రుణాలు ఇచ్చేవారు. యాత్రిబ్‌పై
రాజకీయ నియంత్రణ కోల్పోయినప్పటికీ, వారు ఆర్థికంగా
దూసుకుపోయారు.
ప్రవక్త(స) యొక్క
వలస ఈ పరిస్థితులను పూర్తిగా మార్చివేసింది. ఈ నగరాన్ని ఇప్పుడు మదీనా అని
పిలుస్తారు, ఇది మదీనా-తుర్ రసూల్ (ప్రవక్త నగరం) యొక్క చిన్న రూపం.
మక్కా నుండి వలస వచ్చినవారు మదీనా సమాజానికి కొత్త కోణాన్ని జోడించారు. మక్కా
నుండి వచ్చిన వారికి వ్యవసాయం మరియు రైతుల
గురించి జ్ఞానం లేదు. వారికి కళల పట్ల అభిరుచి లేదు. వారు ప్రధానం గా వ్యాపారస్తులు, కార్మికులు మరియు
కష్టపడి పనిచేసేవారు, వారు మొత్తం అరేబియా ద్వీపకల్పంలో ఎంతోగా గౌరవించబడేవారు. ప్రియమైన ప్రవక్తతో కలిసి
మదీనాలో వారి ఉనికి మదీనాను విలువైనదిగా మరియు గుర్తించదగినదిగా చేసింది.
ఆరంభ ముస్లింలందరూ మదీనాకు వలస వెళ్ళవలసి వచ్చింది. అందువల్ల
మదీనాలో వేరు వేరు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు కనిపిస్తారు. మదీనా కాస్మోపాలిటన్ నగరం
అయింది. అందరు తమ స్వంత వైవిధ్యాన్ని కొనసాగిస్తూ, సాధారణ విశ్వాసం
మరియు ఆరాధన పద్ధతులను అవలంబించారు. పవిత్ర ఖుర్ఆన్ పారాయణం కూడా అరబిక్ యొక్క
వివిధ మాండలికాలలో అనుమతించబడింది. నాటి యాత్రిబ్ నగరం వైవిధ్యంలో ఐక్యతకు ఉదాహరణగా నిలిచినది..
మదీనా నుండి FROM MADINAH
ఇస్లామిక్ నాగరికత మదీనా నుండి ముందుకు సాగింది. ప్రవక్త (స) బయటి ప్రపంచానికి పరిచయం అవడం మొదలైనది. దీనికి ఉదా:గా
హుదైబియా ఒప్పందం తరువాత వివిధ దేశాల పాలకులకు ఇస్లాం
స్వికరించమని ఆహ్వాన లేఖలు పంపడం మరియు
యెమెన్ గవర్నర్‌గా మాజ్ బిన్ జబల్ (ర)నియమించడంను ఉదహరించవచ్చు. తరువాత అబూబకర్ (స)ఖలీఫా
పరిపాలన కాలం తక్కువగా ఉంది మరియు ప్రవక్త(స)
మరణం తరువాత వివిధ ప్రాంతాలలో తిరుగుబాట్లు జరిగినవి మరియు తిరుగుబాట్లను అణిచివేయడానికి
ప్రయత్నాలు చేయబడ్డాయి.
మొదటి ఖలీఫా పాలనాకాలం ఇస్లామిక్ రాజ్యాన్ని ఏకీకృతం చేయడంలో విజయవంతమైంది మరియు రెండవ ఖలీఫా
రాజ్య విస్తరణపై దృష్టి పెట్టారు. అతను
అనేక నగరాల వాస్తుశిల్పి మరియు కొత్త ప్రదేశాలకు వలస వెళ్ళడం ద్వారా ఇస్లామిక్ నాగరికత
వికాసం మరియు అక్కడి పరిస్థితులతో కలిసిపోవడం కొనసాగింది. ఖలిఫా ఉమర్(ర) కాలం లో అభివృద్ధి చెందిన రెండు కొత్త నగరాలను గమనిద్దాము.
బస్రా Basrah: ఖలీఫా ఉమర్(ర)
ఈ నగరాన్ని నీరు మరియు ఖాళీ భూమి అందుబాటు లో ఉన్న ఎడారిలో సృష్టించాడు. ఇది పెర్షియన్
గల్ఫ్ కు దగ్గరగా ఉంది మరియు భారతదేశం మరియు పర్షియా నుండి వచ్చే నౌకలు ఇక్కడ
లంగరు వేసేవి. సముద్రo నుండి జరిగే దాడి నుండి రక్షణగా ఖలీఫా ఈ స్థలాన్ని ఎంచుకున్నట్లు చెబుతారు. ఒక
వివరణాత్మక ప్రణాళికను ఖలీఫా స్వయంగా
తయారు చేశారు. ప్రారంభంలో అతను ఇటుక ఇళ్ళు నిర్మించడానికి అనుమతించలేదు మరియు
నిర్మాణానికి మట్టి మరియు గడ్డిని మాత్రమే ఉపయోగించాలని ఆదేశించాడు. తరువాత కాలం
లో అతను కాంక్రీట్ ఇళ్ళు నిర్మాణానికి అనుమతి
ఇచ్చాడు. వివిధ తెగల కాలనీలు, సెంట్రల్ గ్రాండ్ మస్జిద్
ఇతర మసీదులు మరియు బహిరంగ ప్రదేశాలు అన్నీ ప్రణాళిక ప్రకారం నిర్మించబడినవి. బస్రా
నగరానికి నీటిని తీసుకురావడానికి పది మైళ్ల పొడవున్న ఒక కాలువ తవ్వారు. ఇది
విజయవంతమైన ప్రాజెక్ట్. నగరం పెరిగింది మరియు దాని జనాభా లక్షా ఇరవై వేలకు
పెరిగింది. ఈ కొత్త నగరం అభ్యాసానికి విలువైన కేంద్రంగా నిలిచినది.: మొదటి అరబిక్
నిఘంటువు, కితాబుల్ ఐన్ (Kitabul Ain) ఈ ప్రదేశంలోనే సంకలనం చేయబడింది మరియు ప్రఖ్యాత పండితుడు హసన్
బస్రీ అక్కడ జన్మించారు.
కుఫా Kufah: ఇది ఖలీఫా ఉమర్(ర)
నిర్మించిన మరో నగరం. దాని నిర్మాణం కూడా ప్రణాళికాబద్దం
గా జరిగింది. వివిధ తెగలకు ప్రత్యేక
ప్రాంతాలను కేటాయించి, నలభై వేల మందికి
ఇళ్ళు నిర్మించారు. సెంట్రల్ మసీదు నలభై వేల మంది ఒకేసారి ప్రార్థనల జరపటానికి
అనువుగా అన్ని వైపులా ఖాళి స్థలo కలిగి ఎత్తైన
వేదికపై నిర్మించబడింది. వెడల్పాటి వీధులు నిర్మించబడ్డాయి. ఏడు-మూరల వెడల్పు సైడ్
లేన్ల కోసం కేటాయించబడింది మరియు ప్రధాన వీధులు, హైవేలు, నలభై మూరలు వెడల్పుతో నిర్మించబడ్డాయి. ఈ ప్రదేశం ఇస్లాం కేంద్రంగా
మారింది.
నాల్గవ ఖలీఫా అయిన అలీ (ర) ఇస్లామిక్ రాజ్య రాజధానిని మదీనా
నుండి కుఫాకు మార్చారు. ఈ నగరం అపారమైన జ్ఞానం మరియు అభ్యాసానికి దోహదపడింది. ఉమర్
అబ్దుల్లా బిన్ మసూద్ (ర) కుఫాలో ఉపాధ్యాయునిగా నియమించబడినారు. వాక్యనిర్మాణ
సూత్రాలు (principles of syntax), హదీసు విజ్ఞాన
శాస్త్రం మరియు హనాఫీ న్యాయ శాస్త్రం యొక్క సూత్రాలతో సహా అనేక అభ్యాస శాఖలు
కుఫాలో జన్మించాయి లేదా అభివృద్ధి చేయబడ్డాయి. ఈ ప్రదేశంలో ఇబ్రహీం నఖై, హమ్మద్ మరియు అబూ
హనిఫా తో సహా అనేకమంది ప్రసిద్ధ ఇస్లామిక్ పండితులు జన్మించారు.
ఖలీఫా ఉమర్ ఇతర నగరాలను కూడా
నిర్మించారు లేదా పునర్నిర్మించారు మరియు అభివృద్ధి చేశారు. ఫస్టాస్ (Fustas) మరియు ముసల్
అలాంటి రెండు ప్రదేశాలు. ఈ ప్రదేశాలన్నీ జ్ఞానం యొక్క పురోగతికి దోహదపడ్డాయి మరియు
ఇస్లామిక్ సమాజ అభివృద్ధిలో కీలక పాత్రలను పోషించాయి.
No comments:
Post a Comment