14 April 2021

ఇస్లాంలో దాతృత్వం యొక్క ప్రాముఖ్యత-దివ్య ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ (స) భోధనల వెలుగులో Importance of Charity in Islam as Taught by Quran and Prophet Muhammad (PBUH)

 


 ఇస్లాంలో దాతృత్వం పవిత్ర ఖురాన్ మరియు హదీసులలో ప్రస్తావించబడినది. దివ్య ఖురాన్ లో అల్లాహ్ (ఎస్.డబ్ల్యు.టిSWT) ఆర్థిక, భౌతిక అంశాలు, ఆరోగ్యం, స్వరూపం, తెలివితేటలు వంటి "సంపద యొక్క ప్రదాత " గా ప్రకటించబడినట్లు తెలుస్తుంది 

·       దివ్య ఖురాన్ ప్రకారం :అల్లాహ్  భీతి కలవారు అగోచర విషయాలను విశ్వసిస్తారు. నమాజును స్థాపిస్తారు. మేము ప్రసాదించిన దానినుండి (మా మార్గం లో) ఖర్చుచేస్తారు.” (ఖురాన్ 2: 3)

 

 జీవితంలోని ప్రతి అంశాన్ని అల్లాహ్ బోధిస్తాడు మరియు ఇస్లాంలో దాతృత్వం  నేర్చుకోవలసిన ముఖ్యమైన అంశాలలో ఒకటి. దివ్య ఖురాన్లో , సర్వశక్తిమంతుడైన అల్లాహ్ విశ్వాసులను తమ సంపదలో నిర్వచించిన భాగాన్ని నిరుపేద ప్రజలతో  పంచుకోవాలని అడుగుతాడు. ఇది  జకాత్అనే అరబిక్ పదంతో పిలువబడినది.  దీని అర్థం మన ఆత్మను స్వీయ శుద్ధి చేయడం.

 

దివ్య ఖురాన్ లో  ధనవంతుడు లేదా దాతృత్వం చెల్లించటానికి అర్హులైన వారు పేదలకు సహాయం చేయడం ద్వారా తమ ఆత్మలను స్వయంగా శుద్ధి చేసుకోవాలని ప్రకటించారు. ఈ దాతృత్వం  (జకాత్ అల్ మాల్) నిర్వచించిన మొత్తo  లేదా అంతకంటే ఎక్కువ సంపాదించే ప్రజలకు తప్పనిసరి.

ఒక ముస్లిం ప్రతి సంవత్సరం కనీస మొత్తానికి (నిసాబ్) పైన ఉన్న తన పొదుపు మరియు సంపదలో 2.5% విరాళంగా ఇవ్వాలి.

 

దివ్య ఖురాన్లో దాతృత్వం యొక్క ప్రాముఖ్యత:

ఇస్లాం ఆశీర్వాదాల గురించి వివరించును. దివ్య ఖురాన్ లో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మన ఆత్మలను మంచి పనుల ద్వారా స్వయంగా శుద్ధి చేసుకోవటo  గురించి,  మన మంచి పనులను మరియు  కలిమిని ఇతరులకు ఇవ్వడం గురించి ప్రస్తావించాడు.

 

·       అల్లాహ్ నీకు ఉపకారం చేసిన విధంగానే నీవు ఉపకారం చేయి. (ఖురాన్ 28:77)

 

·       “మేము ఏమి ఖర్చు చెయ్యాలి అని ప్రజలను అడుగుతారు.” “మీరు ఏమి ఖర్చు చేసినా దానిని మీ తల్లి తండ్రుల కొరకూ, బంధువుల కొరకూ, అనాధలు, నిరుపేదలు, బాటసారుల కొరకూ ఖర్చు చేయండి. మీరు ఏ మేలు చేసినా, దాన్ని అల్లాహ్ తెలుసుకొంటాడు” అని వారికీ చెప్పండి. (ఖురాన్ 2: 215)

 

పై ఆయతులో ఇస్లాంలో దాతృత్వం కేవలం డబ్బు లేదా ఆర్థిక అంశాల గురించి మాత్రమే కాదు, బంధువులు, పొరుగువారు మరియు స్నేహితుల పట్ల  దయ/కరుణ  చూపిస్తూ, అనారోగ్యంతో ఉన్న పేదవారికి సహాయం చేయడం ద్వారా దానధర్మాలలో పాల్గొనవచ్చు. వారి జీవితంలో ఆనందాలను వ్యాప్తి చేయడానికి మన సమయాన్ని కూడా కేటాయించవచ్చు

 

వైఖరి ద్వారా దాతృత్వం

ప్రజల పట్ల దయ మరియు కరుణ కలిగి ఉండటం కూడా ఒక మంచి పని మరియు అది ప్రతిఫలమిస్తుంది.

·       మీరంతా అల్లాహ్ కు  దాస్యం చెయ్యండి. ఎవరిని ఆయనకు భాగస్వాములుగా చేయవద్దు. తల్లి తండ్రుల ఎడల  సద్భావంతో మెలగండి. బoధువులూ, అనాధలూ, నిరుపేదల పట్ల మంచిగా వ్యవరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులు అయిన పొరుగువారు, పక్కన ఉన్న మిత్రులు, బాటసారులు, మీ అధీనం లో ఉన్న దాసీజనం పట్ల  ఉదారబుద్దితో వ్యవరించoడి. గర్వాతిశయంతో కన్నూమిన్నూ కాననివారు, తమ గొప్పతనం గురించి విర్రవీగేవారు అంటే అల్లాహ్ ఇష్టపడడు అని గట్టిగా నమ్మండి. (ఖురాన్ 4:36)

 

హదీసుల వెలుగులో ఇస్లాంలో దాతృత్వం:

·       ప్రవక్త మొహమ్మద్ (స) మనం ప్రజలకు అనేక విధాలుగా సహాయం చేయగలమని అన్నారు.:ప్రతిరోజూ ఆదాము వంశస్థులకు దాతృత్వం సూచించబడుతుంది అని అన్నారు. అప్పుడు మేము ఆయనను ఇలా అడిగాము : మేము ప్రతిరోజూ దేని నుండి దాతృత్వం ఇస్తాము?”

ప్రవక్త(స) ఇలా సమాధానమిచ్చారు: మంచితనం యొక్క తలుపులు చాలా ఉన్నాయి: మంచిని చేయడం, చెడును నిషేధించడం, రహదారి నుండి హానిని తొలగించడం, చెవిటివారి మాటలు వినడం, అంధులను నడిపించడం, ఒకరి అవసరాన్ని తీర్చడం, ఒకరికి దుఖంలో సహాయపడటం మరియు బలహీనమైనవారికి మద్దతు ఇవ్వడం ఇవన్నీ మీ కోసం సూచించిన దాతృత్వం ”. ఇంకా "మీ సోదరుడి కోసం మీ చిరునవ్వు కూడా ఒక దాతృత్వం". [బుఖారీ]

 

అంతేకాక, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లo ప్రకారం  ప్రకృతి సంరక్షణ, చెట్లను నాటడం, జంతువులను పోషించడం మరియు  రక్షించడం కూడా దతృత్వమే.  ఇవి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రతిఫలం ఇచ్చే పనులు మరియు సద్కా జరియాగా లెక్కించబడిన పనులు

 

·       ఉదాహరణకు, చెట్లను నాటడం వల్ల లభించే ప్రతిఫలం గురించి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:

"ఒక ముస్లిం ఒక చెట్టును నాటితే లేదా విత్తనాలు వేస్తే, ఆపై ఒక పక్షి, లేదా ఒక వ్యక్తి లేదా ఒక జంతువు వాటి ఫలాలను తింటుంటే, అది అతనికి ఒక స్వచ్ఛంద బహుమతి (సదాకా) గా పరిగణించబడుతుంది".

 

·       జంతువులను పోషించడం మరియు రక్షించడాన్ని గురించి ప్రవక్త(స) ఇలా అన్నారు- ఒక వ్యక్తి దారిలో ఉన్నప్పుడు చాలా దాహం అనుభవించాడు, అక్కడ అతను ఒక బావిని చూశాడు. అతను బావి లోకి దిగి, దాహం తీర్చుకొని  బయటకు వచ్చాడు. ఇంతలో, ఒక కుక్క అధిక దాహం కారణంగా ఆయాసపడుతూ మట్టిని వాసన చూడటం,త్రవ్వడం  చూశాడు. అతను తనకు  తాను ఇలా అనుకొన్నాడు ఈ కుక్క నేను దాహంతో బాధపడినట్లు బాధపడుతోంది.వెంటనే అతను మళ్ళీ బావి లోకి దిగి, తన షూని నీటితో నింపి, నోటితో పట్టుకుని, కుక్కకు నీళ్ళు పోశాడు. ఆ పనికి అల్లాహ్ అతన్ని మెచ్చుకున్నాడు మరియు అతనిని క్షమించాడు ”. సహచరులు ఇలా అన్నారు: అల్లాహ్ యొక్క దూత! జంతువులను సేవించడంలో మాకు ప్రతిఫలం ఉందా? ” ఆయన ఇలా సమాధానమిచ్చారు: ఏదైనా జీవికి సేవ చేసినందుకు ప్రతిఫలం ఉంది”. [బుఖారీ]

 

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొత్తం మానవాళికి దయ మరియు కరుణ తో పంపబడ్డారు మరియు వారు మన జీవితాలను మరియు మొత్తం ఉమ్మాను ఋజుమార్గం లో నడిపించారు.

 

దివ్య ఖురాన్ ఇలా పేర్కొంది:

·       ఓ ప్రవక్తా! మేము నిన్ను ప్రపంచమానవులకు కారుణ్యంగా పంపాము. (ఖురాన్ 21: 107)

 

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీర్పు దినం వరకు మొత్తం మానవాళికి కారుణ్యం యొక్క దైవిక బహుమతి గా పేర్కొనబడినారు.

·       ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: " అల్లాహ్ చే సృష్టించబడిన అన్ని జీవులు అల్లాహ్ యొక్క కుటుంబం. ఎవరైతే తన ఆధీనం లోని జీవులపట్ల  కారుణ్యo ప్రదర్శిస్తూ  వాటి అవసరాలు తీరుస్తాడో అతన్ని  అల్లాహ్ ఇష్టపడతాడు”

 

ఇస్లాంలో దాతృత్వం సర్వశక్తిమంతుడైన అల్లాహ్ చేత ఎంతో ప్రతిఫలం పొందుతుందని దివ్య ఖురాన్  ఆయతులు మరియు హదీసుల నుండి స్పష్టంగా తెలుస్తుంది. సహృదయం తో చేసే పని వృధా కాదు. కాబట్టి అల్లాహ్ సృష్టించిన జీవుల పట్ల దయ మరియు కారుణ్యం ప్రదర్శించండి. తప్పక అల్లాహ్ ప్రతిఫలం లబిస్తుంది.

 

 

 

.

.

.

No comments:

Post a Comment