23 April 2021

ఒక మోడల్ మసీదు A model mosque


ఇస్లాంలో మసీదు అనేది భూమిపై అల్లాహ్ ను మనిషి వినయపూర్వకoగా ప్రార్ధించడానికి ఏర్పరచిన ఒక స్థలం. అరబిక్ పదం మసీదుఅంటే సాష్టాంగ పడే ప్రదేశం అని అర్ధం.. ముస్లిం పురుషులు ప్రతిరోజూ ఐదుసార్లు, వారపు-శుక్రవారం / జుమా ప్రార్థనల కోసం  మరియు ఈద్ అల్ ఫితర్ ఈద్ అడ్ దుహా పండుగ నాడు మసీదు వద్ద సమావేశమవ్వడం తప్పనిసరి. ఇది సమావేశాలకు మరియు సాంఘికీకరణకు సమావేశ స్థలంగా కూడా ఉపయోగించబడుతుంది మరియు అందరికీ సులభంగా అందుబాటులో ఉండటానికి ఒక కూడలి లో ఉంటుంది. మసీదు మానవునికి ఏకాంతం ఇస్తుంది మరియు బాహ్యంగా ప్రపంచానికి అనుసంధానిస్తుంది.

 

ముస్లింలు ముఖ్యంగా భారతదేశం వంటి లౌకిక దేశాలలో స్థానిక మసీదును సమాజంలోని ప్రతి విభాగానికి సేవలందించే సమాజ కార్యకలాపాల కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉంది.

 

మసీదుల నిర్మాణ వృద్ధి Architectural growth of mosques:

వాస్తుపరంగా మసీదులో నాలుగు ప్రధాన భాగాలు కలవు. అవి సమూహహాల్/congregation hall, కిబ్లా (ప్రార్థనల దిశ మరియు ఇమామ్ కోసం ప్రదేశం) ను సూచించే మిహ్రాబ్, ఒక మినార్ (అజాన్ పిలుపు కోసం ఎత్తైన టవర్), మరియు ఒక హౌజ్ hauz (వజూ కోసం వాటర్ ట్యాంక్)  మరియు ఇవన్ని ముస్లింలు వారి ప్రార్థనల కోసం  పవిత్ర కాబా దిశలో ఉన్న కిబ్లా వైపుకు ఉండాలి.

 

అరబ్ తరహా హైపోస్టైల్ మసీదులు ఉమయ్యద్ మరియు అబ్బాసిడ్ రాజవంశాల ఆధ్వర్యంలో ప్రారంభమైన మసీదులు. ఈ మసీదులు చదరపు లేదా దీర్ఘచతురస్రాకార ప్రణాళికలను square or rectangular plans కలిగి ఉన్నాయి, ఇవి  పరివేష్టిత ప్రాంగణం (సాన్) enclosed courtyard (sahn మరియు కప్పబడిన ప్రార్థన మందిరం covered prayer hall ఉన్నాయి. చారిత్రాత్మకంగా, వెచ్చని మధ్యప్రాచ్య మరియు మధ్యధరా వాతావరణాలలో ప్రాంగణం courtyard శుక్రవారం ప్రార్థనల సమయంలో పెద్ద సంఖ్యలో ఆరాధకులకు వసతి కల్పించింది.

 

పర్షియన్లు (ఇరానియన్లు) అరబిక్ శైలి విడిచి పెట్టారు. వారు మునుపటి పార్థియన్ మరియు సస్సానిడ్ శైలుల Parthian and Sassanid నుండి డిజైన్ అంశాలను వారి మసీదులలో చేర్చారు. అందువల్ల వారి ఇస్లామిక్ వాస్తుశిల్పం గోపురాలు మరియు పెద్ద, వంపు ప్రవేశ ద్వారాలు వంటి నిర్మాణాలను ఇవాన్స్ iwans కలిగి ఉంది..

 

సెల్జుక్ పాలనలో, ఇస్లామిక్ ఆధ్యాత్మికత పెరుగుతున్నందున, నాలుగు-ఇవాన్ అమరిక ఏర్పడింది. ఈ శైలి మసీదుల ప్రాంగణ ముఖభాగాన్ని దృడంగా స్థాపించింది, ప్రతి వైపు అద్భుతమైన ద్వారాలు ఉన్నాయి. పెర్షియన్లు,  పెర్షియన్ తోటలను మసీదు డిజైన్లలో ప్రవేశపెట్టారు. త్వరలో పెర్షియన్ శైలి మసీదులు నిర్మించడం ప్రారంభమైనది. ఇది తరువాత తైమురిడ్ యొక్క డిజైన్లను మరియు మొఘల్-యుగం, మసీదు డిజైన్లను గణనీయంగా ప్రభావితం చేసింది..

 

ఒట్టోమన్లు ​​15వ శతాబ్దంలో కేంద్ర గోపురం central dome మసీదులను ప్రవేశపెట్టారు. ఈ మసీదులలో ప్రార్థనా మందిరం కేంద్రంగా పెద్ద గోపురం ఉంది. పెద్ద కేంద్ర గోపురం central dome కలిగి ఉండటంతో పాటు, ప్రార్థన హాల్ పైన లేదా ప్రార్ధన చేయని  మిగిలిన మసీదు అంతటా చిన్న గోపురాలు ఒక సాధారణ లక్షణం. ఈ శైలి అనగా పెద్ద కేంద్ర గోపురాల వాడకం బైజాంటైన్ నిర్మాణం ద్వారా ఎక్కువగా ప్రభావితమైంది. న్యూ డిల్లి లోని మాల్వియా నగర్‌లోని ఖిర్కి మసీదు ఈ డిజైన్‌ను కలిగి ఉంది మరియు 81 కి పైగా గోపురాలను కలిగి ఉంది.

 

ఆగ్నేయాసియాలో నిర్మించిన మసీదులు తరచుగా ఇండోనేషియా-జావానీస్ శైలి నిర్మాణాన్ని సూచిస్తాయి, ఇవి గ్రేటర్ మిడిల్ ఈస్ట్ అంతటా కనిపించే వాటికి భిన్నంగా ఉంటాయి. ఐరోపా మరియు ఉత్తర అమెరికాలో కనిపించేవి వివిధ శైలులను కలిగి ఉన్నట్లు కనిపిస్తాయి కాని చాలావరకు పాశ్చాత్య నిర్మాణ నమూనాలపై నిర్మించబడ్డాయి, కొన్ని పూర్వ చర్చిలు లేదా ముస్లిమేతరులు ఉపయోగించిన ఇతర భవనాలు మస్జిద్ గా మార్చబడినవి.

 

ఆఫ్రికాలో, చాలా మసీదులు పాతవి,  కాని కొత్తవి మధ్యప్రాచ్యం యొక్క అనుకరణలో నిర్మించబడ్డాయి.

 

చారిత్రాత్మకంగా, మొఘల్ కాలంలో భారతదేశంలో అనేక మసీదులు నిర్మించబడ్డాయి. విభజన తరువాత చాలా మసీదులు సాధారణ రూపకల్పన అంశాల simple design elements పై నిర్మించబడ్డాయి, కాని ఆర్థికoగా  బలమైన ప్రవాసులు పంపిన డబ్బుతో మరియు మతాధికారులు కూడా దనం సేకరించడంతో భారతదేశంలో మసీదు నిర్మాణం త్వరలో వేగంగా మారింది, ప్రతి మసీదు ప్లానర్ నూతనత్వాన్ని ఏర్పరచడానికి ప్రయత్నిచాడు.

 

ఒక వినూత్న మసీదుAn Innovative Mosque

 

గుజరాత్‌కు చెందిన ఆర్కిటెక్ట్ కుతుబ్ మాండ్వివాలా 2018 లో యుపిలోని కాన్పూర్‌లోని జాజ్‌మౌలోని గులిస్తాన్ హౌసింగ్ సొసైటీలో గులిస్తాన్ మసీదును ప్లాన్ చేసినప్పుడు మసీదు రూపకల్పనలో కొత్త ధోరణిని నెలకొల్పారు.

 

250 చదరపు మీటర్ల చిన్న ప్లాట్ విస్తీర్ణంలో నిర్మించిన మసీదు అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతంలో ఉంది. ఇది ప్రణాళికాబద్ధమైన కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ రూపం లో ఉంది, ఇది పెద్ద సంఖ్యలోని  విభిన్న ప్రజల విశ్వాసాలను తీరుస్తుంది.. మసీదు యొక్క సరళమైన మరియు వినూత్న రూపకల్పన ప్రతి సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది రెండు ప్రధాన రహదారులకు అనుసంధానించబడి ఉంది మరియు రెండు ఎంట్రీలను కలిగి ఉంది, ఒకటి ప్రధాన బాహ్య రహదారి నుండి, మరొకటి అంతర్గత కమ్యూనిటీ రహదారి నుండి.

 

ప్రాథమిక ప్రణాళికలు మరియు చిన్న అలంకారాలను basic plans and little ornamentation ఉపయోగించి ఈ మసీదు సరళత మరియు ఖచ్చితత్వంతో రూపొందించబడింది. మసీదు యొక్క ప్రణాళిక వాస్తవ ప్రపంచంలో విశ్వాసం యొక్క సిద్ధాంతాలను మరియు వాటి ప్రతీకలను దృష్టిలో ఉంచుకుని నిర్మించబడినది. .

 

ప్రధాన భవనం చుట్టుపక్కల ఉన్న ఒక చిన్న ఓపెన్ ప్యాచ్‌ను సెహెన్‌గా ఉపయోగిస్తారు మరియు మసీదుకు రెండు ప్రవేశ కేంద్రాలు ఒక మార్గానికి passage way దారితీస్తాయి, ఇది వూజు ప్రాంతాన్ని కలిగి ఉంది, ఇది పాదరక్షలను దాచడానికి స్థలాన్ని కూడా కలిగి ఉంది.

 

మసీదు యొక్క ప్రధాన భవనం ప్రార్థనలో ఉన్నప్పుడు సాష్టాంగ పడే వ్యక్తిని ప్రతిబింబించేలా ఒక కోణంలో వంగి ఉంటుంది. బాహ్యభాగం పెద్ద ప్రాంగణ స్థలంతో సరళమైన, ప్రకృతి దృశ్యాలతో అందంగా ఉంటుంది. ఒక చిన్న కొలను ­వెలుపల మినార్ చుట్టూ ఉంది.

 

సహజ కాంతి ముఖభాగం లో చెక్కిన జాలిస్ (లాటిక్స్డ్ లేదా చిల్లులు గల తెరలు) ద్వారా ప్రసరించి  మొఘల్ టచ్ ఇస్తుంది జాలి ముఖభాగం నీడ మరియు కాంతిని వివిధ సీజన్లలో తగినంత వెలుతురును ఇస్తుంది.లోపల ఉన్న స్థలం కు డైనమిక్ స్వభావాన్ని అందిస్తుంది.

 

ఒక మోడల్ మసీదు A Model Mosque

 

ప్రస్తుతం ఆధునికoగా  మరియు సౌందర్యంగా మసీదులను నిర్మించడంతో పాటు, మసీదులను క్రియాత్మకంగా మరియు ఇతర సమాజ ప్రయోజనాలకు కూడా ఉపయోగపడేటట్లు నిర్మించాలి.

ఆధునిక మసీదు స్థానిక ముస్లిం సమాజానికి ఒక కమ్యూనిటీ రిసోర్స్ సెంటర్ (సిఆర్సి) గా ఉపయోగ పడాలి. మసీదులు / కమ్యూనిటీ రిసోర్స్ సెంటర్ (సిఆర్‌సి) స్థానిక ముస్లిం సమాజపు మత అవసరాలు, సామాజిక అవసరాలతో పాటు వారి సమావేశ అవసరాలకు ఉపయోగపడాలి.

 

మసీదులో లైబ్రరీ, కెరీర్ గైడెన్స్/కౌన్సెలింగ్ సెంటర్ కోసం స్థలం ఉండాలి, ఇక్కడ కౌన్సెలర్లు/ నిపుణులు ముస్లిం  యువతకు  వారి విద్యా మరియు వృత్తిపరమైన ఎంపికలు సంబంధించి మార్గదర్శకత్వం ఇవ్వగలరు, ఇది కమ్యూనిటీ ఇంటరాక్షన్ సెంటర్‌గా కూడా పనిచేయాలి, సమాజంలోని పేద మరియు అనారోగ్య వర్గాల వారికి సహాయ సదుపాయాలు కల్పించాలి.. చనిపోయినవారి మృతదేహాలను స్నానం చేయించడానికి మరియు  ఖననం చేయడానికి సిద్ధం చేయడానికి ఒక గది కూడా ఉండాలి.

 

స్థానిక మసీదులను వాస్తుపరంగా.సౌందర్యంగా. ఆహ్లాదకరంగా, ఎక్కువ ఖర్చు లేకుండా ఉండాలి మరియు స్థానిక సమాజానికి, స్థానిక ముస్లింల మత మరియు ఆచరణాత్మక ప్రయోజనాలను మరియు అవసరాలను నెరవేర్చడానికి వాటిని బహుళ-ఫంక్షనల్ వేదికగా మార్చాలి.

 

కొంతకాలం క్రితం కొన్ని యూరోపియన్ దేశాలలో/అరబ్ దేశాలలో  ప్రారంభించిన ఒక చొరవ initiative, భారతదేశంలో కూడా ఇటీవల ప్రారంభించబడింది. చొరవతో స్థానిక ముస్లిమేతరులను స్థానిక మసీదుకు ఆహ్వానిస్తారు, అక్కడ వారు పవిత్ర ఖురాన్ మరియు ప్రాథమిక ఇస్లామిక్ ఫండమెంటల్స్ యొక్క బోధనలను తెలుసుకోటంతో పాటు అక్కడ ప్రార్థనలు ఎలా నిర్వహించబడుతున్నాయో గమనిస్తారు. వివిధ సమాజాల మధ్య విశ్వాస వాతావరణాన్ని పెంపొందించడం మరియు అంతర్-విశ్వాస పరస్పర చర్యలను పెంచడంలో ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. ప్రస్తుత సమయం లో ఎలాంటి కార్యక్రమాలు   దేశంలో ఎంతో అవసరం.

 

 

No comments:

Post a Comment