ఇస్లామిక్ ఉల్లేఖనాలు/quotes పవిత్ర ఖురాన్
మరియు హదీసుల సారాన్ని ప్రతిబింబించే అనేక విషయాలను మనకు బోధిస్తాయి మరియు ఈ
ఉల్లేఖనాలు మనకు అర్థం చేసుకోవటానికి కష్టంగా అనిపించే విషయాలను సులభతరం చేస్తాయి.
ఇద్దరు ప్రసిద్ద ఇస్లామిక్ ఖలీఫా లైన ఉత్మాన్ ఘని (ర) మరియు హజ్రత్ ఉమర్ (ర) యొక్క
కొన్ని భోధనలు / quotes/మాటలు తెలుసుకొందాము.
ఉస్మాన్ ఘని (ర):
హద్రాత్ ఉత్మాన్ ఘని ఇస్లాం యొక్క మూడవ ఖలీఫా మరియు నమ్రత మరియు ఔదార్యం కోసం బాగా ప్రసిద్ది చెందారు. వేర్వేరు సమయాల్లో ఆయన చెప్పిన
మాటలు ముస్లింలను జ్ఞానంతో చక్కగా నడిపిస్తాయి. ఈ ఇస్లామిక్ వాక్యాలను /కోట్స్
చూడండి మరియు మంచి మానవుడు మరియు ముస్లిం కావడానికి వాటి అర్ధాన్ని అర్థం
చేసుకోండి.
ఉత్మాన్ ఘని (ర) చెప్పిన ఉల్లేఖనాలు/Quotes by Uthman Ghani (RA)
·
రెండు అలవాట్లను పెంపొందించుకొండి - నిజం మాట్లాడే అలవాటు; మరియు మంచి పనులు చేసే అలవాటు.
·
చనిపోయిన వారి జీవితం నుండి జ్ఞానం పొందండి.
·
ప్రపంచం గర్వమయం. దాని ఉచ్చులో చిక్కుకోకoడి. అది అల్లాహ్ నుండి మిమ్మల్ని దూరంగా ఉంచే
అహంకారాన్ని నేర్పుతుంది.
·
సంపదను సంపాదించడంలో
సంతోషంగా ఉండకూడదు మరియు సంపదలో నష్టానికి బాధపడకూడదు.
·
కోపం
కు ఉత్తమ నివారణ నిశ్శబ్దం.
·
విలాసం
అనేది అల్లాహ్ ఇచ్చిన బహుమతుల పట్ల కృతజ్ఞత చూపకపోవటం వంటిది..
·
సంపదను
కొరకు మాత్రమే ఉపయోగించచే జ్ఞానం నిందపూరితమైనది.
·
ఆచరణ
రహిత జ్ఞానం నిరర్ధకం.
·
పేదరికం
కారణంగా ఎవ్వరినీ ధిక్కరించకూడదు. అల్లాహ్ పట్ల తన కర్తవ్యాన్ని విస్మరించే వారిని
దిక్కరించ వలే.
·
బాధ
సంభవించినప్పుడు, ఒక మనిషి తన సొంత ప్రణాళికలపై ఆధారపడి ఉంటాడు
మరియు ఇతర ప్రజలపై ఆధారపడతాడు. అన్ని వైపుల నుండి నిరాశ చెందినప్పుడు మాత్రం అతను ఒంటరిగా అల్లాహ్ వైపు తిరుగుతాడు.
ఉమర్ ఫరూక్ (ర)Umar Farooq RA
ఉమర్ ఫరూక్ (ర) ను అమీర్ ఉల్-మోమినీన్ అని కూడా పిలుస్తారు మరియు అతను ధైర్యవంతుడు, శక్తివంతమైనవాడు మరియు ప్రభావవంతమైన ఖలీఫాలలో ఒకడు. ఉమర్ ఫరూక్ (ర) న్యాయమైన మరియు ధర్మబద్ధమైన వ్యక్తి, వినయశీలి
మరియు న్యాయ శీలి. అతని పాలనలో ఇస్లామిక్
రాజ్యం ప్రపంచంలోని ఎక్కువ భాగానికి వ్యాపించింది మరియు అతను గొప్ప నాయకుడు. అతను ప్రతి ముస్లింకు సరైన రోల్ మోడల్.
హజ్రత్ ఉమర్ ఫరూక్ (ర) యొక్క సూక్తులు:Sayings
of Hazrat Umar Farooq (r.a.):
·
పాపం నుండి తప్పించుకోవడం, పశ్చాత్తాప నొప్పి కంటే తేలికైనది
·
ప్రతి నిజాయితీ లేని మనిషిపై, ఇద్దరు కాపలాదారులు- అతని ఆస్తులు మరియు అతని జీవన విధానం.
·
ప్రపంచం పట్ల వ్యామోహం జీవించే స్వేచ్ఛ ను చిన్నది చేస్తుంది.
·
అవిశ్వాసులు తమ అసత్యానికి గర్వపడే మరియు ముస్లింలు వారి
విశ్వాసానికి సిగ్గుపడే రోజుకు నేను భయపడుతున్నాను.
·
ప్రపంచాన్ని ప్రేమించే పండితుని పాండిత్యం సందేహాస్పదం.
మర్యాదలు మరియు ఇస్లాం వ్యాప్తిపై ఉల్లేఖనాలు Quotes on manners and the spread of Islam:
·
మంచి కోసం మంచి చేయడం కేవలం తిరిగి చెల్లించడం వంటిది అయితే చెడుకి
మంచి చేయడం గొప్ప ధర్మం.
·
నిరంతరం పశ్చాత్తాపపడే వారితో కూర్చోండి, ఎందుకంటే వారికి మృదువైన హృదయాలు
ఉంటాయి.
·
నా మౌనానికి నేను ఎప్పుడూ చింతిoచను . నా ప్రసంగం విషయానికొస్తే, నేను పదే పదే చింతిస్తాను.
·
స్త్రీలు, మీరు ధరించే వస్త్రం కాదు మరియు మీకు
నచ్చిన దుస్తులు ధరిoచేవారు కాదు. వారు
గౌరవించబడతారు మరియు వారు వారి హక్కులు కలిగి ఉంటారు.
·
రెండు పర్వతాల క్రింద ఉన్నప్పటికీ, ప్రాప్తం
/గమ్యం మీకు
చేరుతుంది. మీ రెండు పెదవుల మధ్య ఉన్నప్పటికీ, ప్రాప్తం/గమ్యం లేనిది మీకు చేరదు.
·
ఉమర్(ర) “మాటలు లేకుండా ప్రజలను ఇస్లాంకు
ఆహ్వానించండి” అని అన్నారు. ప్రజలు “ఎలా?” అని అడిగారు.ఉమర్(ర), “మీ మర్యాదతో”
అని జవాబిచ్చాడు.
·
నేను ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి నా లోపాలను ఎత్తిచూపే వ్యక్తి.
·
నిజం మిమ్మల్ని చంపినా సత్యానికి కట్టుబడి ఉండండి.
·
నేను మూర్ఖుడిని కాదు కాని మూర్ఖుడిని మోసం చేయడానికి నేను అవివేకిగా
నటిస్తాను మరియు మూర్ఖుడు నన్ను మూర్ఖుడిని అని అనుకున్నప్పుడు, నేను మూర్ఖుడిని బహిర్గతం చేస్తాను
మరియు అతను మూర్ఖుడు అని అతనికి చూపిస్తాను!
·
ఒక వ్యక్తి నన్ను ప్రశ్న వేసినప్పుడు, నేను అతని తెలివితేటలను అంచనా వేస్తాను.
·
నా తప్పులను ఎత్తి చూపే వారి పట్ల అల్లాహ్ దయ చూపుగాక.
అల్లాహ్ (ఎస్.డబ్ల్యు.టి) దివ్య ఖురాన్, హదీసులు, ఖలీఫాల సూక్తులు మరియు మత పెద్దల భోధనల ద్వారా మనకు అనేక మార్గదర్శకాలను ఇచ్చారు. మంచి ముస్లిం కావడానికి మన జీవితంలో అన్ని ఉత్తమ పద్ధతులను అమలు చేయాల్సిన అవసరం ఉంది.
No comments:
Post a Comment