ప్రస్తుత కాలంలో ముస్లింలను ద్వేషించడం, తృణీకరించడం మరియు
వెనుకబడినవారిగా పరిగణించడo సర్వసాధారణం గా జరుగుతుంది. ఇది ముస్లింలతో సహా అందరు
అంగీకరించే సత్యం. ప్రపంచవ్యాప్తంగా
ముస్లింలు మైనారిటీలుగా, పేదలుగా లేదా చదువురానివారుగా లేదా రాజకీయ శక్తి లేనివారిగా
పరిగణిoపబడుతున్నారు.
ప్రస్తుత ప్రపంచంలో 58 దేశాలు "ఇస్లామిక్" అని
చెప్పుకుంటాయి మరియు అవి “ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్OIC”
ఏర్పరచుకొన్నారు. కాని దురదుష్టవశాత్తు వారు
ముస్లిం దేశాలకు వ్యతిరేకంగా ఒక దురాక్రమణను అడ్డుకోవటo లేదా మయన్మార్ మరియు చైనా వంటి దేశాలు తమ ముస్లిం మైనారిటీ ప్రజలను హింసించడం ఆపమని
వత్తిడి తేవటంగాని చేయలేక పోతున్నారు. ఇజ్రాయెల్
అనే చిన్న దేశాన్ని ఎదుర్కోలేకపోతున్నారు.
వాస్తవం ఏమిటంటే, ఈ రోజు మిలియన్ల మంది ముస్లిం వ్యక్తులు, కార్పొరేట్లు మరియు రాజ్యాల
వద్ద ఉన్న సంపద గత పదిహేను శతాబ్దాలలో ముస్లింలు కలిగి ఉన్నదాని కంటే మించి పోయింది.
గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు డాక్టరేట్ పొందిన ముస్లింలు ఉన్నారు. కాని నిజం
ఏమిటంటే ముస్లింలు వ్యక్తులుగా మరియు సమాజాలుగా, గౌరవించబడుట లేదు.
దీనికి ప్రధాన ఏకైక కారణం ఏమిటంటే, మనం/ముస్లింలు ఇస్లాంను
ఆచారాలు rituals గా మార్చారు – మనo చేసే ప్రార్థనలు, ఉపవాసాలు, హజ్, ‘ఉమ్రా, జకాత్ మరియు సదాకాహ్‌లు
ప్రాణములేని ఆచారాలుగా మారాయి. మక్కా మరియు మదీనా యాత్ర నుండి తిరిగి వచ్చిన తరువాత మన వ్యక్తిత్వం లో మార్పు
లేదు. వాస్తవానికి ఇటువంటి యాత్రలు మన నిజ జీవితంలో ఇస్లామిక్ సిద్దాంతాలకు
అనుగుణంగా జీవించడానికి మనల్ని ఉత్సాహపరచలేక పోతున్నాయి. ఇస్లాం పట్ల మనకు ఎటువంటి విధులు మరియు
బాధ్యతలను కలిగి లేనట్లుగా మరియు తీర్పు దినం అనేది లేనట్లుగా మనం నిర్లక్ష్యంగా
జీవిస్తున్నాము. నిజానికి మన జీవితాలు
ఇస్లాంను నమ్మని వారి కంటే భిన్నంగా లేవు, కాకపోతే అధ్వాన్నంగా
ఉన్నాయి. .
మనం ఒక శక్తివంతమైన మరియు విప్లవాత్మక ఇస్లాంను ప్రాణములేని ఆచారాలుగా
మార్చడం జరిగింది. ఇది దివ్య ఖుర్ఆన్ ప్రాధమిక సూత్రాల నుంచి వైదోలగటమే. ఈ రోజు
మనం ఖుర్ఆన్ చదువుతాము లేదా తవాబ్ thawab (పరలోకంలో బహుమతి)
కోసం వింటాము. మార్గదర్శకత్వం మరియు ప్రేరణ యొక్క మూలంగా కాదు లేదా వ్యక్తి లేదా సమాజ జీవితాలకు మార్గదర్శకంగా కాదు. అరబిక్ తెలిసిన వారు కూడా దివ్య
ఖుర్ఆన్ యొక్క పారాయణలను వినడానికి ఇష్టపడతారు, అది కేవలం పఠనాన్ని
ఆస్వాదించడానికి మాత్రమే, మార్గదర్శకత్వం, ప్రేరణ మరియు ఉపదేశానికి పొందటానికి కాదు
అందుకే ప్రవక్త(స) తీర్పు రోజున అల్లాహ్‌కు ఫిర్యాదు చేస్తారు: “నా ప్రభూ! నా జాతివారు
ఈ ఖురానును ఒక పరిహాస విషయంగా చేసుకొన్నారు.”(25:30).
ఇది మనo ముస్లింలుగా ఎలా ఉండాలో మరియు ముస్లిం సమాజం అల్లాహ్‌కు ఎలా విధేయులుగా ఉండాలో
నేర్పించిన పుస్తకాన్ని ఎలా విడిచిపెట్టినామో వివరించే ఒక తీవ్రమైన నేరారోపణ. 610CE లో మొదటి ద్యోతకం revelation/వహి అవతరించిన తరువాత దశాబ్దాల
వ్యవధిలో నిరక్షరాస్యులైన అరబ్బులను ప్రపంచంలోని మార్గదర్శకులు మరియు మాస్టర్స్ గా
రుపొందించిన పుస్తకం దివ్య ఖురాన్.
దివ్య ఖురాన్ అనువాదం చదవవద్దని చెప్పే కొందరు ఉన్నారు, ఎందుకంటే వారి వాదన
ప్రకారం ('ఉలం(‘ulum) ) లేకుండా మీరు ఖురాను ను అర్థం చేసుకోలేరు.ఇది 'ఒక! వింతగా ఉంది!
ప్రవక్త(స) యొక్క సాధారణ సహచరులు ఎటువంటి 'ఉలం’ లేకుండా ఖుర్ఆన్
ను తక్షణమే అర్థం చేసుకున్నారు. ఈ దైవిక సందేశంపై విశ్వాసం మరియు అవగాహనతో వారు, ప్రచారం చేశారు
మరియు ప్రపంచాన్ని జయించారు. ప్రవక్త(స) అతని సహచరులు మరియు తరువాత
వచ్చిన తరాలకు (టాబియున్, తబా ’తబీఇన్) తెలియని“ ఇస్లాం ”లోని ఏదైనా భాగం ముహమ్మద్(స) యొక్క ఇస్లాం కాదు.
అరబిక్‌లో ఖుర్ఆన్ చదవడం మరియు అర్థం చేసుకోవడం ప్రతి ముస్లిం యొక్క కర్తవ్యం
మరియు అతనికి అరబిక్ తెలియకపోతే, అతను ఈ రోజు ప్రపంచంలోని చాలా భాషలలో
అందుబాటులో ఉన్న ఖుర్ఆన్ అనువాదాన్ని తప్పక చదవాలి. ఈ రోజు మెజారిటీ ముస్లింలు
ఖురాన్ ఏమి చెబుతుందో తెలియకుండా దానిని తిలావత్(పఠనం) చేస్తున్నారు.
ముస్లింలు కేవలం కలిమా Kalimah చెప్పడం లేదా
కొన్ని ప్రార్థనలు చెప్పడం లేదా ఖుర్ఆన్ యొక్క కొన్ని అధ్యాయాలు చదవడం పరలోకంలో
వారి మోక్షానికి సరిపోతుంది అనుకొంటున్నారు. నిజంగా ఖుర్ఆన్ చదివితే ఎప్పుడూ అలా భావించారు.దివ్య ఖుర్ఆన్ ప్రతి పేజీ అల్లాహ్ ను విశ్వసించాలని మరియు ధర్మబద్ధమైన
పనులు చేయాలని మనకు ఉపదేశిస్తుంది. నమ్మకం మరియు నిరంతరం ధర్మబద్ధమైన పనులు చేయడం
పరస్పర పూరకమైనవి. మంచి పనులు చేయకుండా తాము స్వర్గంలోకి ప్రవేశిస్తారని చాలా మంది
అనుకుంటారు,
అల్లాహ్ దివ్య ఖుర్ఆన్ లో మంచి పనులు చేయకుండా మంచి మాటలు చెప్పడం అర్థరహితం అని
చెప్తాడు (35:10).
ప్రార్థన (సలాత్) “అశ్లీలకార్యాలనుండి చెడు పనుల నుండి నిరోధిస్తుంది” (29:45) అని దివ్య ఖుర్ఆన్
చెబుతోంది, కాని ఈ రోజు మన ప్రార్థన మన జీవితాలపై ప్రభావాన్ని చూపడంలో విఫలమైంది.
దివ్య ఖురాన్ మీరు "మీ నిత్యావసరాలకు పోగా మిగిలినది ఖర్చు
చేయాలి" (2: 219) అని
చెబుతుంది.
అయితే మనలో అదిక సంఖ్యాకులు జకాత్ యొక్క కొద్ది మొత్తాలను కూడా చెల్లించరు.
కాని ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ముస్లింలు సామాజిక సందర్భాలలో విపరీతంగా
ఖర్చు చేస్తారు, ముస్లింలు
ఖరీదైన వస్తువులు కొనడం మరియు 'ఉమ్రా సందర్శనలను
ఒకదాని తరువాత ఒకటి చేయడానికి పోటీ పడుతుండగా, వారి తోటి ముస్లింలు
ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఆకలితో ఉన్నారు. అల్లాహ్ యొక్క కోపాన్ని పొందడానికి
మరియు ఇతరులను నిందించడానికి మనము ప్రతిదీ చేస్తున్నాము!
మన మోక్షానికి ఏకైక మార్గం ఖుర్ఆన్ చదవడం. మనకు అరబిక్
తెలియకపోతే అనువాదం చదువుదాము మరియు మన జీవితంలోని ప్రతి భాగంలో
అల్లాహ్ ఆదేశాలను ఖచ్చితంగా పాటించడం మన కర్తవ్యం.
దివ్య ఖుర్ఆన్ ప్రకారం, ఈ సమాజం మానవజాతి కోసం తిసుకురాబడిన ఉత్తమ సమాజం. ఇది
మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తుంది మరియు చెడును
నిషేధిస్తుంది -(3: 110).
ఈ సమాజం మానవుల ముందు సత్యానికి
సాక్ష్యమివ్వడానికి ఏర్పడింది. ఈ
లక్ష్యాన్ని నిర్వహించడానికి, ముస్లిం వ్యక్తులు మరియు సమాజాలు మొదట
వారి ఆలోచన మరియు ప్రవర్తనలో రుజు మార్గానికి తిరిగి రావాలి. నిజమైన ఇస్లాంలో జీవించడం ద్వారానే వారు ప్రపంచం ముందు సాక్ష్యం
చెప్పగలరు,
No comments:
Post a Comment